Bhai Dooj | నేడు భగినీ హస్త భోజనం.. అన్నాచెల్లెలి అనుబంధాల పండుగ.. దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటంటే..?

Bhai Dooj

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Bhai Dooj | భాయ్​ దూజ్​.. (భగినీ హస్త భోజనం) ఈ పండుగను ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో జరుపుకుంటారు. కార్తీకమాసంలో రెండో రోజు ఈ భాయ్ దూజ్ పండుగను చేసుకుంటారు. దీనిని మన తెలుగువారు యమ విదియ అని కూడా అంటారు. ఈ పండుగ పురాణాల్లో రక్షాబంధన్ అని చెప్పుకోవచ్చు. సోదరసోదరీమణికి సంబంధించిన పండుగ. అయితే ఈ యేడు నేడు (అక్టోబర్ 23న) జరుపుకుంటున్నారు.

దేశంలోని అతిపెద్ద పండుగలలో భాయ్ దూజ్ కూడా ఒకటి, ఇది దీపావళి అనంతరం రెండు రోజుల తర్వాత, అలాగే గోవర్ధన్ పూజ ఒక రోజు తర్వాత జరుపుకుంటారు. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో భగినీ హస్త భోజనం పండుగగా జరుపుకుంటారు. భగినీ అనగా సోదరి అని అర్థం. అంటే.. ఈ రోజు సోదరి వండి పెట్టే భోజనాన్ని సోదరులు తినాలి అన్నమాట. సోదరులు.. సోదరి ఇంటికి వెళ్లి.. భోజనం చేయడంతో పాటు ఆమెకు ఒక చీర, రవికను బహుకరించాల్సి ఉంటుంది. ఇది వారి మధ్య బంధాన్ని మరింత పెరిగేలా చేస్తుంది. సోదర, సోదరీ బంధం అనేది పుట్టుక నుంచి ఉంటుంది. అది ప్రేమానురాగాలతో నిండిన బంధం. అందుకే ఈ రోజున సోదరుడు సోదరి ఇంట్లో భోజనం చేస్తే.. ఆమె ఎంతో సంతోషిస్తుంది. అంతేకాకుండా.. పురాణాల ప్రకారం ఇద్దరికీ అపమృత్యు దోషాలు ఉండవు అని పండితులు చెబుతున్నారు. ఇందుకు ఒక పురాణ కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం..

Bhai Dooj | ఈ రోజు ఏం చేయాలంటే..

మహిళలు ఉదయమే నిద్రలేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు పూజ గదిలో దీపం వెలిగించాలి. విష్ణువు, వినాయకుడికి పూజ చేయాలి. ఈరోజున సోదరుడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. నుదుటున బొట్టు పెట్టి  హారతి ఇవ్వాలి. తన కుడిచేతి ఉంగరం వేలితో సోదరుడికి తిలకం దిద్దాలి. చేతికి రక్షా దారం కట్టి స్వీట్లు తినిపించాలి. అనంతరం సోదరిని దీవించి బహుమతి ఇవ్వడం ఆచారంగా వస్తోంది.

Bhai Dooj | పురాణ గాథ..

పూర్వకాలంలో యముడు మార్కండేయుడిని తనతో తీసుకువెళ్లేంఉదకు యమపాశం విసిరాడు. దీనిని తప్పించుకునేందుకు మార్కండేయుడు వెంటనే శివలింగాన్ని ఆలింగనం చేసుకొని.. కాపాడాలని వేడుకున్నాడు. అయితే.. యముడు విసిరిన యమపాశం మార్కండేయుడిని చుట్టుకుంది. ఆ క్రమంలో అది శివలింగాన్ని సైతం చుట్టుకుందట.

Bhai Dooj | దీంతో కోపోద్రిక్తుడైన శివుడు తన త్రిశూలాన్ని యముడిపైకి వదిలాడు. త్రిశూలం.. వేగంగా యముడివైపు రావడంతో పరుగు మొదలుపెట్టాడు. ఏం చెయ్యాలో తెలియక.. తన సోదరి ఇంటికి వెళ్లాడు. చాలా కాలం తర్వాత అన్నయ్య రావడంతో.. ఆనందపడిన ఆమె.. యముడికి భోజనం పెట్టింది.

సరిగ్గా అదే సమయంలో.. త్రిశూలం అక్కడికి వచ్చింది. భోజనం చేస్తున్న యముడి జోలికి వెళ్లకుండా ఆగిపోయింది. ఎందుకనగా.. భోజనం తినేవారిని మధ్యలో అంతరాయం కలిగించకూడదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉందని పండితులు చెబుతుంటారు. ఈ కారణంగానే త్రిశూలం.. తిరిగి శివుడిని చేరింది. అప్పటికి శివుడి ఆగ్రహం కాస్త చల్లారడంతో యుముడిని క్షమించి వదిలేశాడు.

Bhai Dooj

త్రిశూలం తిరిగి వెళ్లిపోవడంతో యముడు ఊపిరిపీల్చుకున్నాడు. తన చెల్లి చలవ వల్లే ప్రాణాలు కాపాడుకున్నాను అనుకున్నాడు. ఈ క్రమంలో ‘నా ప్రాణాలు కాపాడావు. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు.’ యముడి సోదరి స్పందిస్తూ నువ్వు ఆరోగ్యంగా ఉండటమే నాకు చాలు సోదరా అని అంది. కానీ యముుడు ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు. దాంతో ఆమె స్పందించి.. ‘నువ్వు ఎలాగైతే.. నా వంట తిని మృత్యువు నుంచి తప్పించుకున్నావో.. అలాగే.. సోదరి పెట్టే భోజనం ఆరగించిన వారిందరికీ అపమృత్యు దోషం లేకుండా కరుణించాలని’ కోరింది. దీంతో యముడు ఆ వరం ఇచ్చాడని పురాణ గాథ.

గమనిక: Bhai Dooj ఈ కథనం ప్రజల విశ్వాసలతో పాటు సామాజిక మాద్యమాల్లో లభించిన సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చాం. దీనిని విశ్వసించడం అనేది మీ వ్యక్తిగతం.

Benefits of smile | ఎంత నవ్వితే అంత ఆరోగ్యం.. నవ్వులో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం..!

Follow Us : WhatsappFacebookTwitter

Related posts

Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!

Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

Vande Bharat Sleeper Train | రైల్వే ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ ట్రెయిన్​..

1 comment

sign up for binance January 18, 2026,6:24 am - January 18, 2026,6:24 am
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Add Comment