Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Dhurandhar box office collections | ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధురంధర్’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు (Dhurandhar box office collections) సృష్టిస్తోంది. రిలీజ్ అయి నాలుగు వారాలు పూర్తయినా సినిమా వసూళ్ల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. నాలుగో వారంలో కూడా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ద్వారా బాలీవుడ్ చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పరచింది.

Dhurandhar box office collections | వరుసగా నాలుగో వారం..

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం నాలుగో వీక్‌లో సుమారు రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు (Dhurandhar box office collections) సాధించి.. బాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన మొదటి సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఏ హిందీ చిత్రం కూడా నాలుగో వారంలో ఇంత భారీ మొత్తాన్ని సాధించలేదు. ఇండియాలో మొత్తం నెట్ వసూళ్లు రూ.784 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు రూ.1164 కోట్లు దాటాయి.

Dhurandhar box office collections | జవాన్​ రికార్డులను తిరగరాస్తూ..

ఈ విజయంతో ‘ధురంధర్’ సినిమా.. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రం వసూళ్లను అధిగమించి, హిందీ సినిమాల్లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా అవతరించింది. భారత్‌లో హిందీ చిత్రాల్లో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన సినిమాగా కూడా ఈ చిత్రం రికార్డు నమోదు చేసింది.

Dhurandhar box office collections | రెండోస్థానంలో..

ప్రస్తుతం భారత్‌లో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘ధురంధర్’ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో పుష్ప 2 నిలిచింది. అయితే, థియేట్రికల్ రన్ ఇంకా బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే వీకెండ్‌లో పుష్ప 2ను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోయినప్పటికీ ఇంత భారీ విజయం సాధించడం విశేషం. సాధారణంగా బాలీవుడ్ సినిమాలకు గల్ఫ్ మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంటుంది. అక్కడ విడుదలై ఉంటే మరింత రూ.100 కోట్ల వసూళ్లు సులువుగా వచ్చేవని అంచనాలు ఉన్నాయి. అయినా సరే, భారత్ మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ చిత్రం అద్భుతంగా రాణిస్తోంది.

రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత కూడా ప్రేక్షకుల ఆదరణ తగ్గకపోవడం ద్వారా ఈ చిత్రం రూ.1200 కోట్ల మార్క్‌ను త్వరలోనే అందుకునే అవకాశం కనిపిస్తోంది. రాబోయే వీకెండ్‌లో ఈ మైలురాయిని చేరుకోవడం కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలో సీక్వెల్​..

ఈ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలో వస్తోంది. ఈ ఏడాది వేసవిలో లేదా మార్చి నాటికి పార్ట్-2 థియేటర్లకు రావచ్చని సమాచారం. మొదటి భాగం ముగింపు ఉత్కంఠగా సాగడంతో సీక్వెల్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా మరింత ఆకర్షణీయంగా తెరకెక్కనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

ఇక ఓటీటీ విషయానికొస్తే, నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల చివరి నాటికి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని అంచనాలు ఉన్నాయి, అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related posts

Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

Dhurandhar collections | ‘ధురంధర్’ బాక్సాఫీస్ దూకుడు.. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న మూవీ..

Water Geyser Replacement |ఈ ఐదు సంకేతాలు మీ గీజర్​లో కనిపిస్తున్నారా.. అయితే మీరు వెంటనే మార్చాల్సిందే..!

1 comment

yn777game January 10, 2026,7:14 pm - January 10, 2026,7:14 pm
YN777game? Not bad! Has some of the games I like, and payouts seem fair so far. Worth a look-see I reckon. Here's the link yn777game.
Add Comment