F-35 fighter jets | సౌదీకి F-35 ఫైటర్ జెట్లు విక్రయించనున్న అమెరికా.. MBS వాషింగ్టన్ పర్యటనలో కీలక ప్రకటన

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: F-35 fighter jets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాకు అత్యాధునిక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను అమ్మేందుకు ఆమోదం తెలిపారు. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో మధ్యప్రాచ్యంలో సైనికంగా కీలక పరిణామాలు జరుగనున్నాయి. కాగా.. MBS ఏడేళ్ల తర్వాత అమెరికా రాజధాని సందర్శించడం గమనార్హం.

ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. “సౌదీ అరేబియా మా గొప్ప మిత్రదేశం. వాళ్లు F-35 జెట్లు కొనాలని కోరుకుంటున్నారు.. మేం కచ్చితంగా అమ్ముతాం” అని స్పష్టం చేశారు. సౌదీ ఇప్పటికే 48 వరకు F-35 జెట్ల కోసం అభ్యర్థన పెట్టింది. ఇది బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందంగా మారనుందని తెలిపారు.

F-35 fighter jets | ఈ ఒప్పందంపై ఆందోళన

అమెరికా అడ్మినిస్ట్రేషన్‌లోని కొందరు అధికారులు ఈ అమ్మకానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సౌదీ – చైనా సన్నిహిత సంబంధాలు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది చైనా సౌదీకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయింది. రెండు దేశాలు సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించాయి. F-35లోని అత్యంత రహస్య సాంకేతికత చైనా చేతికి చిక్కే ప్రమాదం ఉందని పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే కారణంతో గతంలో UAEకి F-35 అమ్మకం కూడా ఆలస్యమైంది.

F-35 fighter jets | మరో కీలక అంశం ఏమిటంటే..

ఇజ్రాయెల్ సైనిక ఆధిపత్యం (Qualitative Military Edge). అమెరికా చట్టం ప్రకారం ఇజ్రాయెల్‌కు మధ్యప్రాచ్యంలో ఎవరికీ లభించని సైనిక ప్రాధాన్యత ఉండాలి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో F-35లు ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే.

F-35 fighter jets | అబ్రహం ఒడంబడిక విస్తరణపై ట్రంప్ ఆశలు

ట్రంప్ తన మొదటి టర్మ్‌లో సాధించిన అబ్రహం ఒడంబడికను (Abraham Accords) విస్తరించాలని భావిస్తున్నారు. సౌదీ-ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ ద్వారా మధ్యప్రాచ్య శాంతిని సాధించవచ్చని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. “సౌదీ త్వరలోనే అబ్రహం ఒడంబడికలో చేరుతుందని ఆశిస్తున్నా” అని ట్రంప్ చెప్పారు.

Source : Indiatvnews.com

ఇది కూడా చదవండి..: Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

Related posts

Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

Water Geyser Replacement |ఈ ఐదు సంకేతాలు మీ గీజర్​లో కనిపిస్తున్నారా.. అయితే మీరు వెంటనే మార్చాల్సిందే..!