తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Google Maps | మనం తెలియన ప్రాంతాలకు వెళ్తే.. నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ వాడుతుంటాం. దీనివల్ల మనం గమ్యస్థానానికి చేరుకోవడం సులభం అవుతుంది. అయితే వినియోగదారుల మరింత సౌలభ్యంగా మార్చేందుకు గూగుల్స్ మరిన్ని ఫీచర్స్ తీసుకువచ్చింది. కొత్త AI ఫీచర్లతో మరిన్ని అప్‌డేట్స్ తెచ్చింది. ప్రత్యేకంగా భారతీయ యూజర్స్ కోసం రూపొందించిన ఫీచర్స్ ఇవి. కొత్త అప్‌డేట్స్ ఏంటో తెలుసుకుందామా మరి..
Google Maps | జెమినీ నావిగేషన్..
జెమినీ నావిగేషన్ అనేది డ్రైవింగ్ చేసే సమయంలో హ్యాండ్‌ఫ్రీ, సంభాషణాత్మక అనుభవాన్ని ఇస్తుంది. “దగ్గరలోని పెట్రోల్ పంప్ ఎక్కడ?” అని అడగడం వల్ల.. మనం వెళ్లే దారిలో పార్కింగ్ ఉందా అని తెలుసుకోవచ్చు. లేదంటే ఒక రెస్టారెంట్ వెతికి “సరే, అక్కడ వెళ్దాం” అని చెప్పొచ్చు. దీని మనను అక్కడకు తీసుకెళ్తుంది.
Google Maps | సూచనలు కూడా ఇస్తుంది..
కొత్త అప్‌డేట్స్ జెమినీ మ్యాప్స్ రివ్యూలు, వెబ్ కంటెంట్‌ను విశ్లేషిస్తుంది. అంతేకాకుండా ప్రాక్టికల్, స్పష్టమైన సూచనలు ఇస్తుంది. ఉదాహరణకు, హైదరాబాద్‌లో ఏదైనా మార్కెట్ గురించి చూసినట్లయితే.. “అక్కడ బేరం ఆడొచ్చు” అని సూచిస్తుంది. లేదంటే ఆ ప్రాంతంలోని అత్యుత్తమ స్టాల్స్‌ను సైతం చెబుతుంది.
Google Maps | మ్యాప్స్‌ని ప్రశ్నలు అడగొచ్చు..
మ్యాప్స్ యూజర్స్ ఇక నుంచి ఒక ప్రాంతం గురించి ప్రశ్నలు అడగవచ్చు. జెమినీ ఏఐ ఫీచర్ రివ్యూలు, ఫొటోలు, వెబ్ డేటాను పరిశీలించి చెబుతుంది. అక్కడ చూడాల్సిన ప్రదేశాలతో పాటు పార్కింగ్ వివరాలను సైతం సూచిస్తుంది.
Google Maps | స్పీడ్ లిమిట్స్, ట్రాఫిక్ అలర్ట్స్..
కొత్త ఫీచర్స్ మనం ప్రయాణించే దారిలో స్పీడ్ లిమిట్స్‌ను సైతం చెబుతుంది. స్థానిక ట్రాఫిక్ అధికారుల డేటా ఆధారంగా రోడ్లపై స్పీడ్ లిమిట్‌ను చూపిస్తుంది. అయితే ఇది ప్రస్తుతానికి ముంబై, హైదరాబాద్, కోల్‌కతా వంటి 9 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. అలాగే ప్రధాన రోడ్లలో డిజర్ప్షన్ లేదా డిలేల గురించి ఆటోమాటిక్ నోటిఫికేషన్లు అందిస్తుంది. నావిగేషన్ యూజ్చేయకపోయినా సమాచారం వస్తుంది. ఇది కూడా ప్రస్తుతానికి ప్రధాన నగరాల్లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఫీచర్ అందుబాటులో ఉంది.
Google Maps | NHAIతో భాగస్వామ్యం..
గూగుల్ మ్యాప్స్ హైవేపై రోడ్ క్లోజర్స్‌తో పాటు రిపేర్ల గురించి రియల్ టైమ్ డేటా అందిస్తుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)తో భాగస్వామ్యం ద్వారా ఈ వివరాలను ఇవ్వనుంది. అంతేకాకుండా రోడ్డు పక్కన రెస్ట్ రూమ్స్, పెట్రోల్ స్టేషన్ల సమాచారం కూడా అందిస్తుంది.
ఇది కూడా చదవండి.. : Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai