తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Greater Hyderabad expansion | హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న 20 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో సమ్మిళితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేసింది. దీంతో హైదరాబాద్ మహానగర సరిహద్దులు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాయి. నవంబర్ 25న మంత్రివర్గం ఈ విస్తరణకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా జీహెచ్ఎంసీ చట్టం మరియు తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణలకు గవర్నర్ సమ్మతి తెలపడంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెంటనే నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 2 నుంచి ఈ 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో భాగమైనట్లు ఆదేశాల్లో స్పష్టం చేశారు.
Greater Hyderabad expansion | విలీన ప్రక్రియకు ఆదేశాలు
గ్రేటర్ హైదరాబాద్ విస్తరణకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా విలీన ప్రక్రియకు ఆదేశాలు ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానమైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 27 పట్టణ స్థానిక సంస్థల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. సమీప జోనల్ కమిషనర్లకు ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.
అంతేకాకుండా.. ఈ 27 సంస్థల ఖాతాలను తక్షణమే స్తంభింపజేసి, నిధులను జీహెచ్ఎంసీ ఖాతాకు బదలాయించాలని ఆదేశించారు. అదనంగా, 9 రకాల ప్రొఫార్మాలను సిద్ధం చేయించారు. ఉద్యోగుల వివరాలు, స్థిర మరియు చరాస్తులు, పెట్టుబడులు, పన్నులు, కొనసాగుతున్న పనులు, చెల్లింపులు, గత మూడు సంవత్సరాల్లో భవనాలు మరియు లేఔట్లకు ఇచ్చిన అనుమతులు వంటి సమాచారాన్ని ఈ ప్రొఫార్మాల్లో నమోదు చేసి, మరుసటి రోజు నాటికి సమర్పించాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: India Q2 GDP | దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. అంచనాలను మించిన జీడీపీ గణాంకాలు
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
1 comment