Gupt Navratri 2026: నేటి నుంచి గుప్త నవరాత్రులు.. దీని విశిష్టత ఏమిటంటే..

Gupt Navratri 2026

Gupt Navratri 2026: నవరాత్రి పండుగ ప్రతియేటా నాలుగు సార్లు వస్తుంది. చైత్ర మాసం, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు సాధారణంగా ఎక్కువ మందికి తెలిసినవి. వీటిని ఘనంగా జరుపుకుంటారు. అయితే మాఘ మాసం, ఆషాఢ మాసంలో వచ్చే రెండు గుప్త నవరాత్రుల గురించి చాలా మందికి తెలియదు.

Gupt Navratri 2026

గుప్త నవరాత్రులు ప్రధానంగా ఆధ్యాత్మిక సాధకులు, తాంత్రిక మార్గంలో నడిచే వారు రహస్యంగా ఆచరించే పవిత్ర కాలంగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో దేవీ ఆరాధన ద్వారా అంతర్గత శక్తిని పెంపొందించుకోవడం, జీవితంలోని అడ్డంకులను అధిగమించడం ప్రధాన ఉద్దేశంగా పండితులు చెబుతారు.

Gupt Navratri 2026: నేటి నుంచి మాఘ గుప్త నవరాత్రులు

2026లో మాఘ గుప్త నవరాత్రి జనవరి 19వ తేదీ ఆదివారం ప్రారంభమై జనవరి 28వ తేదీ వరకు కొనసాగుతుంది. అష్టమి జనవరి 26, నవమి జనవరి 27, ఉపోషణ ముగింపు జనవరి 28న జరుగుతుంది.

Gupt Navratri 2026

శుభ ముహూర్తాలు

నవరాత్రి ప్రారంభంలో దేవీ ఆవాహనకు ఘటస్థాపన(కలశ స్థాపన) చేస్తారు. 2026లో మాఘ గుప్త నవరాత్రి ఘటస్థాపనకు శుభ సమయాలు ఇవే..

  • ఘటస్థాపన శుభ ముహూర్తం: జనవరి 19, 2026 ఉదయం 7:14 నుంచి 10:46 వరకు..
  • అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:11 నుంచి 12:53 వరకు..
  • ప్రతిపద తిథి: జనవరి 19 రాత్రి 1:21 నుంచి జనవరి 20 రాత్రి 2:14 వరకు..

గుప్త నవరాత్రి అంటే ఏమిటి..

“గుప్త” అంటే రహస్యమైనది అని అర్థం. సాధారణ నవరాత్రుల్లో ఊరేగింపులు, భజనలు, ప్రదర్శనలతో బహిరంగంగా జరుపుకుంటారు. కానీ గుప్త నవరాత్రి పూర్తిగా అంతర్ముఖమైన, రహస్య సాధనగా పేర్కొంటారు. తాంత్రిక విధానాలు, మంత్ర సాధన, దశ మహావిద్యల ఆరాధన ఇందులో ప్రధానంగా చెబుతుంటారు. రహస్యంగా చేసే ఆరాధనకు ఈ కాలంలో ప్రత్యేక శక్తి ఉంటుందని ప్రజలు విశ్వసిస్తుంటారు. దేవీ దుర్గను సూక్ష్మ రూపాల్లో ఆరాధించడం ద్వారా జీవితంలోని అవరోధాలు తొలగుతాయని, అంతర్గత శక్తి పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

గుప్త నవరాత్రి ఎవరు ఆచరించాలి?

ఈ పవిత్ర కాలం ప్రత్యేకంగా ఈ కింది వారికి అనుకూలం..

  • ఆధ్యాత్మిక సాధకులు, మంత్ర జపం-ధ్యానం చేసే వారు
  • జీవితంలో ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నవారు
  • క్రమశిక్షణతో సాధన చేయాలని ఆసక్తి ఉన్న భక్తులు
  • బాహ్య గౌరవాల కంటే అంతర్గత బలాన్ని కోరుకునేవారు

ఆచరించాల్సిన నియమాలు..

  • ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం
  • మొదటి రోజు చౌకీ ఏర్పాటు చేసి కలశ స్థాపన నిర్వహించడం
  • దుర్గా మంత్రాలు, దుర్గా చాలీసా లేదా దుర్గా సప్తశతి పారాయణం
  • ప్రతిరోజూ ఉదయం-సాయంత్రం ఆరతి నిర్వహించడం
  • ఉపవాసం ఆచరించేవారు పండ్లు, సాత్విక ఆహారం మాత్రమే సేవించడం

గమనిక: మేం అందించిన ఈ కథనం ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించాం.. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

Top Links : ఇవి కూడా చదవండి

  1. Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!
  2. Times of India – Magha Gupt Navratri 2026: Date, Puja Muhurat, Rituals and Significance
  3. Economic Times – Gupt Navratri 2026 January: Dates, rituals, shubh muhurats, mantras…

Related posts

Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!

Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి.. ముక్కోటి దేవతలు భువికి దిగొచ్చే పవిత్రమైన రోజు..!

Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!