తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: మీ ఇంట్లో వై-ఫై వేగం సాధారణం కంటే నెమ్మదిగా వస్తోందా..? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసే ముందు.. మీరు స్వయంగా కొన్ని సులభతరమైన పరీక్షలు చేయవచ్చు. చిన్నచిన్న టెక్నిక్స్ ద్వారా వేగాన్ని పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా..
Improve WiFi Speed | మీ రౌటర్ స్థానం చెక్ చేయండి..
వై-ఫై వేగం తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రౌటర్ అమర్చిన స్థానం. ఒకవేళ మీ రౌటర్ ఇంటి మూలలో లేదంటే విడిగా ఉన్న ప్రాంతంలో ఉంటే అది సిగ్నల్ బలంతో పాటు కనెక్టివిటీపై ప్రభావితం చూపిస్తుంది. వైర్‌లెస్ రౌటర్ మాములుగా ఒక అంతస్తు ఇంటిని కవర్ చేయగలదు. కానీ, మీరు బహుళ అంతస్తుల ఇంట్లో ఉన్నట్లయితే సిగ్నల్ కవరేజ్ కోసం వైఫై ఎక్స్‌టెండర్లు లేదా మెష్ రౌటర్లను వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే రౌటర్‌ను సిగ్నల్స్ గోడలు, తలుపులు లాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా వ్యాప్తి చెందే స్థానంలో ఉంచాలి.
How to Improve WiFi Speed : రౌటర్‌ను ఇంటి మధ్యలో ఉంచాలి..
మీ వైఫై రౌటర్‌ను ఏర్పాటు చేయడానికి ఇంటి మధ్య భాగం అనువైన స్థలం. సాధారణంగా హాల్ లేదా లివింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేయడం వల్ల ఇల్లు మొత్తం సిగ్నల్ సమానంగా వస్తుంది. అంతేకాకుండా రౌటర్‌ను బుక్‌షెల్ఫ్ లేదా క్యాబినెట్ పైభాగం లాంటి ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేయడం మంచిది. ఇలా పెట్టడం వల్ల రౌటర్లు తక్కువ అడ్డంకులను ఎదుర్కోవడంతో పాటు సిగ్నల్‌ను సమర్థవంతంగా ప్రసారం చేస్తుంది. దీని వల్ల వేగం బాగా ఉంటుంది.
Improve WiFi Speed : రౌటర్‌ను ఈ ప్రదేశాల్లో పెట్టొద్దు..
చాలా మంది రౌటర్‌ను టీవీల వెనుక లేదంటే ఫర్నిచర్ వెనుక, గృహోపకరణాల వెనుక ఏర్పాటు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సిగ్నల్ కొంత వీక్‌గా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే.. మైక్రోవేవ్ ఓవెన్, టీవీ, ఎలక్ట్రానిక్ పరికరాల రౌటర్ ఏర్పాటు చేయడం వల్ల సిగ్నల్ ప్రసారానికి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి రౌటర్ చుట్టు పక్కల ఇలాంటి పరికరాలు లేకుండా ఖాళీ ప్రదేశంలో ఉంచాలి.
ఇలాంటి చిన్నచిన్న టిప్స్ పాటించి మీ రౌటర్ వేగాన్ని పెంచుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు పాటించినా కూడా వైఫ్ వేగం పెరగకపోయినట్లతే మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సంప్రదించాల్సి ఉంటుంది.
Improve WiFi Speed