తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: IPL 2026 Mini Auction |అబుదాబీలో డిసెంబర్ 16న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీ పోటీ పడ్డాయి. ఈ వేలంలో యువ క్రీడాకారులను ఊహించని ప్రైస్‌కు దక్కించుకోవడం విశేషం.
IPL 2026 Mini Auction : ఐపీఎల్ 2026 మినీ వేలం..
కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను దక్కించుకునేందుకు లఖ్‌నవ్, ముంబై, రాజస్థాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) రూ.14.20 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. ఇది అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల చరిత్రలో అత్యధిక ధరగా నిలిచింది.
అదే విధంగా.. రాజస్థాన్ వికెట్‌కీపర్-బ్యాటర్ కార్తిక్ శర్మపై కూడా భారీ బిడ్డింగ్ జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవ్ సూపర్ జయంట్స్ వంటి జట్లు పోటీపడ్డాయి. ఆఖరికి సీఎస్‌కే మరోసారి రూ.14.20 కోట్లతో అతన్ని సొంతం చేసుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లుగా జంట రికార్డు సృష్టించారు.
మరో అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్..
IPL 2026 Mini Auction
IPL 2026 Mini Auction, జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆకిబ్ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు దక్కించుకుంది. ఈ ముగ్గురు యువకులు వేలంలో జాక్‌పాట్ కొట్టడం ద్వారా యువ ప్రతిభకు ఫ్రాంచైజీలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థమవుతోంది.
గత సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆకట్టుకున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరన వేలంలో మరో హైలైట్‌గా నిలిచాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వచ్చిన అతనిపై మొదట ఢిల్లీ, లఖ్‌నవ్ జట్లు ఆసక్తి చూపాయి. తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ ఎంట్రీ ఇచ్చి రూ.18 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది.
భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసింది. IPL 2026 Mini Auction, సౌత్ ఆఫ్రికా పేసర్ అన్రిచ్ నార్ట్‌జేను లఖ్‌నవ్ సూపర్ జయంట్స్ రూ.2 కోట్లకు దక్కించుకుంది. ఇక న్యూజిలాండ్ బ్యాటర్ జాకబ్ డఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హోసేన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.2 కోట్లతో సొంతం చేసుకుంది.
మొత్తంగా ఈ మినీ వేలం యువ ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూ, ఫ్రాంచైజీల వ్యూహాలను ప్రతిబింబిస్తూ ఆకట్టుకున్న వేదికగా మారింది.
ఇది కూడా చదవండి..: Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్ కల్యాణ్
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai