తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: IRCTC Package |ప్రయాణికుల సౌకర్యార్థ్యం ఇండియన్ రైల్వే కేటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో ప్యాకేజీని అందుబాటులో తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా 10 రోజుల్లో దక్షిణ భారతదేశంలోని పలు ఆధ్యాతిక ప్రదేశాలను దర్శించుకోవచ్చు. శ్రీ రామేశ్వరం – తిరుపతి దక్షిణ యాత్ర పేరుతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. IRCTC భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రెయిన్ కార్యక్రమంలో భాగంగా దీనిని ప్రారంభించింది. దీని ద్వారా సౌత్ ఇండియాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. తిరుపతి నుంచి రామనాథస్వామి ఆలయం వరకు సందర్శించవచ్చు.
IRCTC Package |టూర్ ఎప్పుడు ప్రారంభం కానుందంటే..!
ఈ టూర్ మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు ఉండనుంది. ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ నెలలో ఉంటుంది. నవంబర్ 7 – నవంబర్ 16 యాత్ర సాగనుంది.
IRCTC Package |దర్శించుకునే ప్రాంతాలివే..
నవంబర్ 7న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. తిరుపతిలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం ఉంటుంది. అనంతరం పద్మావతి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత రామేశ్వరంలో రంగనాథ స్వామి ఆలయం, ధనుష్కోడిలోని కోదండ రామాలయం దర్శనం కల్పిస్తారు. అనంతరం మధురై చేరుకున్న తర్వాత మీనాక్షి అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత కన్యాకుమారి చేరుకుంటారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్, కన్యాకుమారి దేవాలయం, గాంధీ మండపం సందర్శిస్తారు. ఇక చివరగా తిరువనంతపురం చేరుకుని అక్కడ పద్మనాభ స్వామి వారిని దర్శించుకుంటారు. అలాగే కోవాలమ్ బీచ్‌ను చూడవచ్చు.
IRCTC | ప్యాకేజీ వివరాలివే..
పెద్దలు: రూ. 18,040 (స్లీపర్ క్లాస్), రూ. 30,370 (3 AC), రూ. 40,240 (2 AC) ఉంటుంది.
పిల్లలు (5–11 సంవత్సరాలు) : రూ. 16,890 (స్లీపర్), రూ. 29,010 (3 AC), రూ. 38,610 (2 AC) ఉంటుంది.
IRCTC | బస, భోజనం వివరాలివే..
ప్రయాణికులు బడ్జెట్ హోటల్స్, ఏసీ-నాన్ ఏసీ రూంలలో ఉండవచ్చు. కేవలం శాఖాహార భోజనం మాత్రమే అందిస్తారు.
Ujjwala Scheme : ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్..!