తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Loan rejection | మీ క్రెడిట్ స్కోర్ బాగుందా.. అయినా మీరు లోన్‌కు అప్లయ్ చేసినా రావడం లేదా.. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా రుణం ఎందుకు రావడం లేదని ఆలోచిస్తున్నారా.. బ్యాంకులు లోన్ మంజూరు చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. లోన్ ఇచ్చే టైంలో బ్యాంకర్లు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.. రుణం విషయంలో అవి ఎలా ప్రభావం చూపుతాయనే విషయం తెలుసుకుందాం..
చాలా మంది క్రెడిట్ స్కోర్ బాగుంటే చాలు.. లోన్ తప్పకుండా వచ్చేస్తుందని భావిస్తారు. కానీ వాస్తవంగా అలా జరగదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్ మంజూరు చేసేటప్పుడు క్రెడిట్ స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవు. అది కేవలం ఒక భాగం మాత్రమే. దరఖాస్తుదారుడి మొత్తం ఆర్థిక చిత్రాన్ని సమగ్రంగా పరిశీలిస్తారు. అందుకే 750–800 పైన స్కోర్ ఉన్నవారికి కూడా కొన్నిసార్లు లోన్ తిరస్కరణకు గురవుతుంటుంది. బ్యాంకులు లోన్ ఇవ్వడానికి పరిగణనలోకి తీసుకునే అంశాలివే..
Loan rejection | స్థిరమైన ఆదాయం మరియు ఉద్యోగ స్థిరత్వం
మీ జీతం ఎంత స్థిరంగా వస్తోంది? గత రెండు-మూడేళ్లలో ఉద్యోగాలు తరచూ మార్చారా? కంపెనీ మారినప్పుడు జీతంలో పెద్ద తేడా వచ్చిందా? ఇలాంటి అస్థిరత ఉంటే బ్యాంకులు “ఈ వ్యక్తి నెలవారీ EMI చెల్లించగలడా?” అని సందేహపడతాయి.
Loan rejection | డెట్-టు-ఇన్‌కమ్ రేషియో (DTI)
మీ నెలవారీ ఆదాయంలో ఎంత శాతం ఇప్పటికే ఉన్న అప్పుల EMIలకు వెళ్తోంది? సాధారణంగా 40–50% పైన వెళ్తే బ్యాంకులు కొత్త లోన్ ఇవ్వడానికి జంకుతుంటాయి. ఎందుకంటే మిగిలిన డబ్బుతో జీవన ఖర్చులు తీర్చుకోవడం కష్టమవుతుందని వారి అంచనా వేస్తాయి.
Loan rejection | ఇప్పటికే ఉన్న రుణ భారం
బహుళ క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, కారు లోన్, ఇల్లు లోన్ – ఇవన్నీ కలిపి చాలా ఎక్కువగా ఉంటే, మంచి స్కోర్ ఉన్నా కొత్త లోన్ ఆమోదం రాకపోవచ్చు. బ్యాంకులు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటాయి.
Loan rejection | ఇటీవలి క్రెడిట్ ఎంక్వైయిరీలు
చివరి 6–12 నెలల్లో ఎన్ని క్రెడిట్ కార్డులు, లోన్ల కోసం దరఖాస్తు చేశారు? ఎక్కువ దరఖాస్తులు ఉంటే “ఈ వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాడేమో” అని బ్యాంకులు అనుమానిస్తాయి. అందుకే రుణం ఇచ్చే విషయంలో ఆలోచిస్తాయి.
Loan rejection | చెల్లింపు చరిత్రలో చిన్న లోపాలు
ఒక్కోసారి క్రెడిట్ కార్డు బిల్లు 29 రోజులకు బదులు 31వ రోజు చెల్లించినా, లేదా ఒక్క రోజు ఆలస్యమైనా కొన్ని బ్యాంకులు దాన్ని పెద్ద లోపంగా భావిస్తాయి. ఈఎంఐలు, బిల్లు చెల్లింపులు ఆలస్యం చేయడం కూడా ప్రభావం చూపిస్తాయి.
వయస్సు, రిటైర్మెంట్ దూరం
ఉద్యోగి రిటైర్మెంట్కు 5 నుంచి 7 ఏళ్లలోపు ఉన్నవారికి పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడవు. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఆదాయం తగ్గే అవకాశం ఉంది. దీంతో డబ్బులు తిరిగి చెల్లిస్తారో లేదోనని సందేహిస్తాయి.
క్రెడిట్ హిస్టరీ
క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉండడం కూడా రుణం ఇవ్వకపోవడంపై ప్రభావం చూపిస్తుంది. తక్కువ క్రెడిట్ హిస్టరీ ఉన్నట్లయితే మీరు లోన్ తీసుకున్న తర్వాత చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అనేది బ్యాంకులు అంచనా వేయడం కష్టమవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డులు రద్దు చేసుకుని విషయం కూడా ఒక సారి ఆలోచించాలి. క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవడం వల్ల క్రెడిట్ హిస్టరీ పోతుంది.
డాక్యుమెంటేషన్ లోపాలు
డాక్యుమెంటేషన్‌లో లోపాలు కూడా రుణ మంజూరులో కీలకమే. ఫారంలో చిన్న స్పెల్లింగ్ తప్పులు, సంతకం సరిగ్గా సరిపోకపోవడం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అసంపూర్ణంగా ఉండడం ఇవన్నీ కూడా తిరస్కరణకు కారణమవుతాయి.
క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక ఆరోగ్యానికి ఒక థర్మామీటర్ లాంటిది. జ్వరం లేదని చెప్పగలుగుతుంది. కానీ.. పూర్తి వ్యాధి నిర్ధారణ చేయలేదు. లోన్ మంజూరు కావాలంటే స్థిరమైన ఆదాయం, తక్కువ రుణ భారం, చెల్లింపు క్రమశిక్షణ, తగినంత క్రెడిట్ హిస్టరీ ఇవన్నీ ఉండాలి. కాబట్టి క్రెడిట్ స్కోర్‌ను మాత్రమే నమ్ముకుని లోన్లకు దరఖాస్తు చేయవద్దు.
ఇది కూడా చదవండి..: vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్‌కు వచ్చేస్తున్నాయ్.. లాంచింగ్ అప్పుడే..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
1 comment