తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Moto G57 Power 5G | బడ్జెట్ పరిధిలోనే గొప్ప బ్యాటరీ బ్యాకప్, మంచి పనితనం కావాలని చూస్తున్నారా? అయితే మోటరోలా తాజాగా భారత మార్కెట్‌లో “మోటో G57 పవర్ 5G” (Moto G57 Power 5G) ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు అందించారు. బడ్జెట్ ధరలో లభ్యం అవుతుండడంతో ఈ ఫోన్ త్వరలోనే అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.
Moto G57 Power 5G | డిస్‌ప్లే
6.72 అంగుళాల ఫుల్ HD+ LCD స్క్రీన్ (1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్) ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్మూత్ అనుభవం లభిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, స్మార్ట్ వాటర్ టచ్ 2.0 సాంకేతికత కూడా ఉన్నాయి.
Moto G57 Power 5G | ప్రాసెసర్ & మెమరీ
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 (4nm ఆక్టా-కోర్) చిప్‌సెట్‌తో ఇది పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిపి మల్టీటాస్కింగ్, రోజువారీ ఉపయోగం సులువుగా ఉంటుంది.
Moto G57 Power 5G | బిగ్ బ్యాటరీ
7,000mAh భారీ బ్యాటరీతో రెండు రోజుల వరకు సులువుగా బ్యాకప్ ఇస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడంతో త్వరగా ఛార్జ్ అవుతుంది.
Moto G57 Power 5G | కెమెరా
- వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్
- 50MP ప్రధాన సెన్సార్ (సోనీ LYT-600, f/1.8)
- 8MP అల్ట్రావైడ్ లెన్స్ (f/2.2, 119.5° FOV)
- టూ-ఇన్-వన్ లైట్ సెన్సార్
- ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
Moto G57 Power 5G | సాఫ్ట్‌వేర్
ఆండ్రాయిడ్ 16 ఆధారిత My UX తో వస్తోంది. మ్యాజిక్ ఎరేజర్, ఫొటో అన్‌బ్లర్, ఆటో స్మైల్ క్యాప్చర్, పోర్ట్రెయిట్ బ్లర్, స్కై రీప్లేస్‌మెంట్, రీఇమాజిన్ ఆటో ఫ్రేమ్ వంటి అనేక AI కెమెరా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది.
కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు
5G, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, USB టైప్-C, అన్ని ప్రధాన సాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్ సపోర్ట్ చేస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి ఉన్నాయి.
డిజైన్ & బరువు
166.23 × 76.50 × 8.60 mm కొలతలు, 210.6 గ్రాముల బరువు. మూడు అందమైన పాంటోన్ వేరియంట్స్ – రెగట్టా, ఫ్లూయిడిటీ, కోర్సెయిర్.
ధర & ఆఫర్లు
భారత్‌లో 8GB + 128GB వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. లాంచ్ స్పెషల్ ఆఫర్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. అంటే ఈ ఫోన్‌ను కేవలం రూ.12,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.
సేల్ ఎప్పటి నుంచంటే..
డిసెంబర్ 3 మధ్యాహ్నం నుంచి అధికారిక సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. మూడు కలర్ వేరియంట్స్‌లో వస్తోంది.
ఇది కూడా చదవండి..: X Chat | WhatsAppకు షాక్ ఇవ్వనున్న మస్క్.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
2 comments