తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Ola EV car | ఓలా ఎలక్ట్రిక్ ఈవీ కార్లలో (Ola EV car) గేమ్ ఛేంజర్‌గా నిలవడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో ఒకప్పుడు దుమ్ము దులిపిన ఈ కంపెనీ, ఇప్పుడు కొత్త సవాల్ విసిరేందుకు సన్నద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి ముందడుగు వేసింది. కాంపాక్ట్ డిజైన్‌లో చౌకగా ఈవీ కారు తయారీకి తాజాగా పేటెంట్ దరఖాస్తు చేసినట్లు సమాచారం. చూడాలి మరి టాటా, ఎంజీలకు ఓలా పోటీ ఇస్తుందా.. లేదా అనేది..
Ola EV car | హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌లో..
ఓలా దరఖాస్తు చేసిన పేటెంట్ చిత్రాలు చూస్తే.. ఈ కారు 5-డోర్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. మరియు ఇది టాటా, ఎంజీ, విన్‌ఫాస్ట్ వంటి మోడళ్లను నేరుగా టార్గెట్ చేయనున్నట్లు అర్థమవుతోంది. ఓలా ఇటీవల నిర్వహించిన తన ‘సంకల్ప్ 2025’ ఈవెంట్‌లో జెన్ 4 మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాట్‌ఫాం స్కూటర్లు, త్రీ వీలర్లు, కార్లు వంటి వివిధ రకాల వాహనాల తయారీకి అనుకూలంగా రూపొందించింది.
Ola EV car | రూ. 10లక్షలలోపు ఉండనుందా..!
ప్రస్తుతం దేశీయంగా బ్యాటరీ సెల్స్ కొరత ఉంది. కానీ ఓలా 4680 సిరీస్ సెల్స్ తయారీకి సన్నద్ధమవుతోంది. ఇవి నికెల్, మాంగనీస్, కోబాల్ట్‌తో తయారైన అత్యాధునిక సెల్స్ అని చెబుతున్నారు. అయితే రూ.10 లక్షల లోపు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఓలా అడుగుపెడితే, పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. గతంలో S1 సిరీస్ స్కూటర్లతో సాధించిన విజయం.. కార్ల రూపంలో తిరిగి పునరావృతం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Ola EV car | ఈవీ కార్ల ప్రాజెక్టుపై దృష్టి
స్కూటర్లతో ప్రారంభమైన ఓలా.. ఇప్పుడు చిన్న ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్ట్‌పై దృష్టి సారించింది. ఒకప్పుడు ప్రతి నెలా 50 వేలకు పైగా స్కూటర్లు అమ్మిన ఓలా.. ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. సరైన సర్వీస్ లేకపోవడం, వినియోగదారుల నమ్మకం కోల్పోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే సంస్థ మళ్లీ గేమ్‌లోకి రావడానికి సన్నద్ధమవుతోంది. చౌకైన ధరలో కొత్త కారును (Ola EV car) మార్కెట్‌లోకి తీసుకువచ్చి ఇతర ప్రధాన కంపెనీలకు పోటీ ఇవ్వాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి..: Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
1 comment