తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Period Delay Pills |యువతులు, మహిళల్లో పీరియడ్స్ రావడం అనేది చాలా కామన్. ఇది సహజమైన ప్రక్రియ. అయితే పండుగలు, వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో పీరియడ్స్‌ను అడ్డంకిగా భావిస్తారు. ఇది సహజంగా జరిగేదే అని తెలిసినా సెంటిమెంట్ ప్రకారం వేడుకలకు దూరంగా ఉంటారు. ఇంకొంత మంది పీరియడ్స్ ఆలస్యమయ్యేలా టాబ్లెట్స్ వాడుతుంటారు. ఇలా మాత్రలు వేసుకుని గతకొంతకాలం క్రితం ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మాత్రలు వేసుకోవడం వల్ల దుష్ర్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందామా..
కొంతకాలం క్రితం ఓ 18 ఏళ్ల యువతి ఇంట్లో పూజ కోసం పీరియడ్స్ ఆలస్యం కావడానికి పిల్స్ వాడింది. బ్లడ్ క్లాట్ కావడంతో వల్ల ప్రాణాలు కోల్పోయింది. దాదాపు మూడు రోజుల పాటు ఇలా పిల్స్ వేసుకుంది. కాళ్లు, చేతులలో వాపులు వచ్చి చివరకు చనిపోయిన విషయం తెలిసిందే.
Period Delay Pills | పిల్స్ వాడుతున్నారా..
అనేక మంది మహిళలు పీరియడ్స్ ఆలస్యం కావడానికి పిల్స్ వాడుతుంటారు. వీటిలో కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. ఇవి నెలసరి రాకుండా తాత్కాలికంగా ఆపుతాయి. ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకలు ఉన్న సమయంలో కొందరు మహిళలు వీటిని వినియోగిస్తుంటారు. ఇది కొన్ని సార్లు ప్రభావం చూపించకపోవచ్చు. కానీ కొన్ని సార్లు మాత్రం తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. బ్లడ్ క్లాట్స్ వచ్చే ముప్పు సైతం ఏర్పడుతుంది. ఉన్నట్టుండి హార్మోన్ల లెవెల్స్ పడిపోవడం వల్ల తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు.
ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకున్నట్లే..!
పిల్స్ వేసుకున్న సమయంలో బాడీలో హార్మోన్ల లెవెల్స్ మారిపోతాయి. నెలసరిని ప్రేరేపించే హార్మోన్స్ అనేవి ఆగిపోతాయి. ఈ కారణంగా పీరియడ్స్ రావడం ఆలస్యం అవుతుంది. ఎన్ని రోజుల పాటు మెడిసిన్ తీసుకుంటే అన్ని రోజుల పాటు ఆగిపోతాయి. ఇలా చేయడం వల్ల సమస్యలు రావడంతో పాటు రక్తం పని తీరు కూడా మారిపోతుంది. ఈ మాత్రల్లో నోరెతిస్టెరాన్ ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టుకుపోవడానికి కారణం అవుతుంది. ఈ సమస్య మొదలైతే.. ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది.
Period Delay Pills |ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటే..
పీరియడ్స్ డిలే కోసం పిల్స్ వేసుకున్నట్లయితే నోరెతిస్టెరాన్ హార్మోన్ రక్త సరఫరాపై ప్రభావం చూపిస్తుంది. దీంతో బ్లడ్ క్లాట్స్ వస్తాయి. అదే సమయంలో రక్తం చిక్కబడుతుంది. అలాగే రక్తాన్ని పల్చగా ఉంచే ప్రొటీన్లు అనేవి తగ్గిపోతాయి. దీని వల్ల రక్తం చిక్కబడుతుంది. సరైన విధంగా సరఫరా కాకపోవడం కారణంగా నరాల్లో గడ్డలు కడుతుంది. రక్తం గడ్డకట్టినప్పుడు కండరాలు వాపునకు గురవుతాయి. నొప్పి వస్తుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు వస్తాయి.
Period Delay Pills |ఎవరికి ముప్పు
ఎప్పుడో ఓసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పిల్స్ వేసుకుంటే పరవాలేదు. కానీ ఎక్కువ రోజుల పాటు వాడినట్లయితే దీర్ఘకాలిక ప్రభావాలు తప్పవు. అయితే.. కొన్ని రకాల సమస్యలున్న వాళ్లయితే వీటిని అసలు వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టడం అనేది కుటుంబంలో అంతకు ముందు ఇంకెవరికైనా ఉన్నట్లయితే వాళ్లు ఈ పిల్స్ వేసుకోకూడదు. అలాగే ఉబయకాయం ఉన్న వారు సైతం వాడకూడదని సూచిస్తున్నారు.
Period Delay Pills |ఈ జాగ్రత్తలు తప్పనిసరి
తప్పనిసరి పరిస్థితుల్లో పిల్స్ వాడాల్సి వస్తే వైద్యుల సలహా లేనిది వేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ పిల్స్ తీసుకున్నా సరైన విధంగా హైడ్రేట్‌గా ఉండాలి. నీరు బాగా తగడంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసిన సమయంలో మధ్యలో కాస్త గ్యాప్ తీసుకోవాలంటున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించారం. మీరు వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి.
child safety tips | ఇంట్లో చిన్న పిల్లలున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
1 comment