తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Rohit Sharma | భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ మళ్లీ టీ20 ఫార్మాట్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సొంత మైదానంలో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న రోహిత్.. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీ20 జెర్సీ ధరించనున్నాడు. అయితే ఇది అంతర్జాతీయ టీ20 కాదు.. దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడే అవకాశం ఉందని సమాచారం.
Rohit Sharma | అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు.. కానీ..
2024 టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దేశవాళీ టోర్నమెంట్లలో ఆడడానికి ఆయనకు అభ్యంతరం లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
Rohit Sharma | నాకౌట్ దశలోనే రంగంలోకి దిగే అవకాశం
టోర్నమెంట్‌లో లీగ్ దశ ఇప్పటికే జోరుగా సాగుతోంది. అయితే రోహిత్ షెడ్యూల్ దృష్ట్యా లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండొచ్చు. బదులుగా డిసెంబర్ 12, 14, 16 తేదీల్లో ఇందౌర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగే నాకౌట్ (ప్రీ-క్వార్టర్, క్వార్టర్, సెమీ-ఫైనల్) మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
Rohit Sharma | ముంబై జట్టు ఫామ్ అద్భుతం
ఎలైట్ గ్రూప్-ఎలో ఆడుతున్న ముంబై జట్టు ఇప్పటివరకు ఆడిన ఆరు లీగ్ మ్యాచ్‌ల్లో ఐదింట్లో విజయం సాధించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. కేరళతో జరిగిన ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూసింది. ఈ ఫామ్‌తో నాకౌట్ దశకు అడుగుపెట్టిన ముంబైకి రోహిత్ శర్మ జాయిన్ కావడం జట్టుకు భారీ బూస్ట్‌గా మారనుంది.
ఇది కూడా చదవండి..: Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
1 comment