తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: soft chapatis all day | చపాతీలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కానీ చాలా మందికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే.. అవి చేసినప్పుడు మెత్తగా వచ్చినా కొద్దిసేపటికే గట్టిపడిపోతాయి. మళ్లీ వేడి చేసినా పాత మెత్తదనం రాదు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఉదయం తయారు చేసిన చపాతీలు రాత్రి వరకూ కూడా రెండు వేళ్లతో సులువుగా మడతపెట్టేంత మెత్తగా ఉంటాయి. ఎటువంటి ప్రత్యేక పదార్థాలు లేకుండా, ఇంట్లో ఉన్నవాటితోనే ఇలా చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా..
soft chapatis all day | పిండి కలిపే సమయంలో ఇలా చేయండి..
- సాధారణంగా గోధుమ పిండిని నీళ్లతోనే కలుపుతాం. కానీ మెత్తదనం కోసం ఒక చిన్న మార్పు చేయండి.
- నీటిలో కొంత భాగం (సుమారు 25–౩౦ శాతం) పాలతో భర్తీ చేయండి. పాలలోని కొవ్వు, ప్రోటీన్ పిండిని తేమగా ఉంచుతాయి.
- పాలు వాడకపోయినట్లయితే రెండు టీస్పూన్ల నూనె లేదా నెయ్యి కలిపి కలపండి. ఇలా చేయడంతో పిండి మరింత మృదువుగా మారుతుంది. మరియు చపాతీలు గట్టిపడకుండా ఉంటాయి.
- పిండి మెత్తగా, మెరిసేలా కలిసే వరకూ బాగా పిసకండి
- కలిపిన పిండిని కాసేపు పక్కన పెట్టండ
- పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయకండి. కనీసం 20–౩౦ నిమిషాల పాటు పక్కన పెట్టండి. తడిగా ఉన్న పత్తి గుడ్డతో లేదా మూత పెట్టిన గిన్నెలో ఉంచండి. ఈ విశ్రాంతి సమయంలో గ్లూటెన్ సడలి, తేమ సమానంగా పంపిణీ అవుతుంది. ఫలితంగా చపాతీలు బాగా పొంగుతాయి. ఎక్కువ సేపు మెత్తగా ఉంటాయి.
soft chapatis all day | సరైన మంటపై కాల్చండి..
- చపాతీలు త్వరగా గట్టిపడిపోకుండా ఉండాలంటే పెనం (తవా) బాగా వేడిగా ఉండాలి
- మీడియం–హై మంట మీద పెనం వేడి చేయండి (నీటి చుక్క వేస్తే తక్షణం ఆవిరైపోవాలి).
- చపాతీని రెండు వైపులా కొద్దిసేపు కాల్చి, ఆ తర్వాత నేరుగా అగ్నిమీదికి తీసుకెళ్లి లేదా గుడ్డతో నొక్కుతూ పూరి లాగా పొంగేలా చేయండి.
- తక్కువ మంట మీద నెమ్మదిగా కాల్చితే తేమ అంతా పోయి చపాతీలు త్వరగా గట్టిపడతాయి.
- కాల్చేటప్పుడు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాస్తే రుచి, మెత్తదనం రెట్టింపవుతాయి.
soft chapatis all day | నిల్వ చేసే విధానం..
- ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. చాలా మంది ఈ దశలోనే తప్పు చేస్తారు
- వేడి వేడి చపాతీలను నేరుగా స్టీల్ డబ్బా లేదా క్యాస్రోల్‌లో పెట్టొద్దు
- ఆవిరి వల్ల మొదట తడిగా, తర్వాత రబ్బరు లాగా అవుతాయి.
- శుభ్రమైన, పొడి కాటన్ క్లాత్‌ను డబ్బాలో వేయండి ప్రతి చపాతీని ఆ గుడ్డలో మడతపెట్టి పెట్టండి. మూత మూసిన తర్వాత గాలి ప్రవేశించదు. అదనపు తేమను గుడ్డ పీల్చేస్తుంది.
- ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే మీ చపాతీలు ఎప్పుడూ దూదిలా మెత్తగా ఉంటాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించాం. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణులను సంప్రదించండి.
ఇది కూడా చదవండి..: Coffee on Empty Stomach Risks |ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
1 comment