తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Storing eggs in the fridge | ‘సండే హోయా మండే.. రోజ్ కావో అండే..’ ఇది నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ప్రకటన. గుడ్డు ఆరోగ్యానికి మంచిదని ప్రజలకు వివరించేందుకు గతంలో ఈ ప్రకటన ఇచ్చేది. గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఉంటాయన్న మాట. అయితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే గుడ్లను ఎలా నిల్వచేయాలనేది కూడా ముఖ్యం.
చాలా మంది మార్కెట్ నుంచి తీసుకువచ్చిన గుడ్లను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తుంటారు. ఇలా వీటిని ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచి తినటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్‌లో గుడ్లు ఎన్ని రోజులు పెట్టవచ్చు. అసలు వీటిని అలా నిల్వ చేయవచ్చా.. ఫ్రీజ్‌లో ఉంచిన గుడ్లు ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సాధారణంగా అందరి ఇళ్లలో గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం చూస్తుంటాం. గుడ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని అలా ఫ్రిజ్‌లో పెడుతుంటాయి. అయితే, వీటిని ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచి తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్లను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేస్తే.. వాటిలో ఉండే పోషకాలు చాలా వరకు తగ్గిపోతాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. దీంతో గుడ్ల వల్ల శరీరానికి లభించే ప్రయోజనాల కన్నా.. నష్టం ఎక్కువ జరుగుతుందంటున్నారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకుండా చూసుకోవడం ఉత్తమం. తప్పనిసరి అయితే.. చాలా తక్కువ రోజులు ఉంచాలని సూచిస్తున్నారు.
Storing eggs in the fridge | ఎక్కువ రోజులు ఉంచినట్లయితే..
గుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తినడం వల్ల.. వాటిలోని పోషకాలు అందవట. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయట. గుడ్లను ఫ్రిజ్‌లో 3 లేదా 5 వారాలకు మించి నిల్వ చేయకూడదని చెబుతున్నారు. గుడ్లను నిల్వ చేయాలనుకుంటే ఫ్రిజ్ దిగువ భాగాన.. ఒక బాక్స్‌లో పెట్టి ఉంచాలి. అయితే ఫ్రిజ్‌లో పెట్టే ముందు గుడ్లను శుభ్రంగా నీటిలో కడిగి పెట్టాలి.
Storing eggs in the fridge అయితే గుడ్లను అవసరమైన వరకు ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం మేలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా పోషకాలు అందుతాయంటున్నారు.
గమనిక: మేం అందించిన ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్లో లభ్యమైన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటిని పాటించే ముందుకు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
FAQ: Storing eggs in the fridge
1. గుడ్లను ఫ్రిజ్‌లో సరిగ్గా ఎలా దాచాలి?
- ముందుగా, గుడ్లను అసలు కార్టన్‌లోనే ఉంచండి,
ఫ్రిజ్ తలుపు మీద కాకుండా, మధ్య షెల్ఫ్‌లో పెట్టండి.
2. గుడ్లు బయట ఉంచితే ఎన్ని రోజులకు చెడిపోతాయి ?
-
ప్యాక్ తేదీ నుంచి + 30 రోజులు.
ఈ Samsung Wallet లో నయా ఫీచర్స్.. ఇక పిన్ నంబర్ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
1 comment