Upcoming Movies 2025 |15 రోజుల్లో అరడజన్​ రీ రిలీజ్​లు.. మూవీ లవర్స్​కు పండుగే..!

Upcoming Movies 2025

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: టాలీవుడ్​లో రీరిలీజ్​ల ట్రెండ్​ కొనసాగుతోంది. స్టార్ హీరో సినిమాలు నవంబర్‌ నెలలో పెద్దగా లేకపోవడంతో.. బాక్సాఫీస్‌పై మళ్లీ రీ రిలీజ్​ల హడావుడి మొదలైంది. రానున్న 15 రోజుల్లో అరడజన్​ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిలో కొన్ని తప్పక చూడాల్సిన క్లాసిక్స్‌ ఉండగా.. మరికొన్ని ఎమోషనల్‌ కనెక్షన్‌ కలిగిన మూవీస్‌ ఉన్నాయి. మూవీ లవర్స్​కు పండుగ తీసుకురానున్నాయి.

Upcoming Movies 2025 |నవంబర్ 14 – నాగార్జున ‘శివ’

నాగార్జున కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌ మూవీ ‘శివ’. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ కల్ట్‌ క్లాసిక్‌ ఇప్పుడు సరికొత్తగా 4K ప్రింట్‌, డాల్బీ అటామస్​ సౌండ్‌తో థియేటర్లలోకి రానుంది. నవంబర్​ 14న రీ రిలీజ్​ కానుంది. నాలుగేళ్ల పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌ టీం ఈ రీమాస్టరింగ్‌పై నిశితంగా పని చేసింది. మీడియా ప్రివ్యూలు చూసిన వారు ఇప్పటికే “వావ్‌!” అన్నట్లు తెలుస్తోంది. నాగార్జున గెటప్‌, వర్మ రా ప్రెజెంటేషన్‌, ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇవన్నీ మళ్లీ సిల్వర్‌స్క్రీన్‌పై మళ్లీ మాయ చేయనున్నాయి.

నవంబర్ 15 – సిద్దార్థ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’

‘శివ’ తర్వాతి రోజే మరో ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ప్రేక్షకులను అలరించనుంది. ప్రభుదేవా డైరెక్ట్​ చేసిన ఈ సినిమా అప్పట్లో యువతలో విపరీతమైన ఆదరణ పొందింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు, సిద్దార్థ్‌–త్రిష కెమిస్ట్రీ ఈ సినిమాను టైమ్‌లెస్‌ రొమాంటిక్‌ క్లాసిక్‌గా నిలబెట్టాయి. అందుకే ఫ్యాన్స్​ ఈ మూవీ రీ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

నవంబర్ 21 – చిరంజీవి ‘కొదమసింహం’

1990లో విడుదలైన తెలుగు సినిమాల్లో కౌబాయ్‌ థీమ్‌తో చేసిన అరుదైన ప్రయోగం మెగాస్టార్‌ చిరంజీవి ‘కొదమసింహం’ మూవీ. అప్పట్లో భారీగా కమర్షియల్‌ విజయం సాధించకపోయినా, క్రమంగా ఈ చిత్రం కల్ట్‌ స్టేటస్‌ను సంపాదించింది. మెగాస్టార్‌ మాస్‌ లుక్‌, కీరవాణి సంగీతం, సాహస సన్నివేశాలు అలరించాయి. నేటి తరం థియేటర్‌లో ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభించింది.

Upcoming Movies 2025 |నవంబర్ 22 – కార్తీ ‘ఆవారా’

తమిళ నటుడు కార్తీ నటించిన ‘ఆవారా’ సినిమా కూడా రీ రిలీజ్‌ కానుంది. ఒకసారి షెడ్యూల్‌ చేసి వాయిదా వేసిన ఈ మూవీ ఇప్పుడు తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులో కూడా సమాంతరంగా వస్తోంది. యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్‌ల మిశ్రమంగా వచ్చి ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చింది. కొత్త సాంకేతిక మెరుగులతో, ఈసారి థియేటర్లలో ఆవారా మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.

Upcoming Movies 2025 |నవంబర్ 28 – సూర్య ‘సికందర్’

సూర్య ‘సికందర్’ మొదటిసారి రిలీజ్‌ అయినప్పుడు పెద్దగా సక్సెస్‌ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు రీ ఎడిట్‌ చేసి, సరికొత్త కట్‌తో, ఫ్రెష్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇవ్వనున్నట్లు దర్శక–నిర్మాతలు చెబుతున్నారు.

Upcoming Movies 2025 |నవంబర్ 29 – మహేష్ బాబు ‘బిజినెస్ మెన్’

మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే ఎక్స్​పీరియన్స్​ ఇచ్చింది బిజినెస్​ మెన్​ సినిమా. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్‌ నవంబర్​ 29న రీ రిలీజ్‌ కానుంది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా గ్రాండ్‌ షెడ్యూల్‌తో వస్తోంది.

ఈ నెలలో ఇన్ని రీ రిలీజ్​ సినిమాలు ఉండడంతో మూవీ లవర్స్​కు ఇది ఒక పెద్ద ఫీస్ట్‌ అనే చెప్పుకోవాలి. రీ రిలీజ్​లతో నవంబర్‌ నెల సినీ ప్రేమికులకు బంపర్‌ మంత్‌గా మారబోతోంది.

ఇది కూడా చదవండి: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!

మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

Related posts

Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

Dhurandhar collections | ‘ధురంధర్’ బాక్సాఫీస్ దూకుడు.. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న మూవీ..

Movies releasing this week | ఈ వారం విడుదల కానున్న చిత్రాలివే.. థియేటర్లతో పాటు ఓటీటీల్లోకి..!