తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: vivo x300 | ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తన “ఫ్లాగ్‌షిప్ X300” సిరీస్‌ను త్వరలో భారత్‌లో లాంఛ్ చేయనుంది. ఈ విషయాన్ని “X” వేదికగా సంస్థ ప్రకటన చేసింది. చైనాలో గత అక్టోబర్‌లో రీలీజ్ చేసిన ఈ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో “వివో X300″తో పాటు “X300 ప్రో” తీసుకొచ్చింది. అయితే త్వరలోనే భారత్‌లో లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కంపెనీ తన ఇండియా వెబ్‌సైట్‌లో ఈ మోడళ్లకు సంబంధించి కొన్ని కీలక స్పెసిఫికేషన్లు వెల్లడించింది.
vivo x300 | సూపర్ ఫీచర్లతో..
వివో “X300” సిరీస్‌లో కీలక ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, V3+ ఇమేజింగ్ చిప్, ZEISSతో కలిసి అభివృద్ధి చేసిన కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లతో భారత్‌లో లాంఛ్ చేయనుంది. వీటితో పాటు స్టాండర్డ్ “X300” మోడల్‌ను స్పెషల్‌గా రెడ్ కలర్లో తీసుకు రానున్నామని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ రెండు మోడల్స్ డిసెంబర్ 2న భారతదేశంలో విడుదల కానున్నాయి.
vivo x300 | ప్రాసెసర్, పనితీరు..
వివో తీసుకురానున్న రెండు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 (3nm) చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. ఇది V3+ ఇమేజింగ్ చిప్‌తో వస్తుంది. “ప్రో” మోడల్‌లో అదనపు “ప్రో ఇమేజింగ్ చిప్ VS1” సైతం ఉండనుంది. 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం బాగుంటుంది. ఆండ్రాయిడ్ 16-ఆధారిత OriginOS 6పై రన్ అవుతంది.
vivo x300 | కెమెరా ప్రత్యేకం..
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో కంపెనీ ఈ సిరీస్‌లోని కెమెరా సిస్టమ్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. వివో “X300 ప్రో” మోడల్‌లో 50MP (f/1.57) సోనీ LYT-828 మెయిన్ (ZEISS గింబాల్ – గ్రేడ్), 50MP (f/2.0) శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్, 200MP (f/2.67) HPB APO టెలిఫొటో ఫీచర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇక స్టాండర్డ్ “X300” మోడల్‌లో 200MP (f/1.68) HPB మెయిన్ (OISతో), 50MP (f/2.57) సోనీ LYT-602 టెలిఫొటో (OISతో), 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఈ రెండు మెడళ్లలో సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం 50MP (f/2.0) శాంసంగ్ JN1 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఇది కూడా చదవండి..: WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
1 comment