తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Water Geyser – చలికాలం.. అందరూ వేడి నీటితో స్నానం చేస్తారు. అయితే ఇందుకు గీజర్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మనకు తెలిసిందే. అయితే, ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాల మాదిరిగానే, గీజర్‌లకు కూడా ఒక నిర్దిష్ట ఆయుష్షు ఉంటుంది.
కాలక్రమేణా భాగాలు దెబ్బతినడం వల్ల సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ గీజర్‌ను తక్షణమే మార్చాల్సిన అవసరం ఉందని సూచించే ఐదు ముఖ్య సంకేతాలు తెలుసుకుందామా..
Water Geyser : గీజర్ నుంచి వింత శబ్దాలు రావడం..
మీ గీజర్ నుంచి పాపింగ్ లేదా బ్యాంగింగ్ వంటి శబ్దాలు వస్తున్నాయా.. ఇవి ట్యాంక్ లోపల ధూళి లేదా మినరల్స్ పేరుకుపోవడాన్ని సూచిస్తాయి. దీని వల్ల గీజర్ మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఇలా జరగడం వల్ల అధిక ఒత్తిడి.. అతిగా వేడెక్కడం వల్ల అంతర్గత భాగాలు దెబ్బతినవచ్చు. కొన్ని సందర్భాల్లో ట్యాంక్ పేలే ఛాన్స్ ఉంటుంది.
తరచుగా మరమ్మతులు అవసరపడడం..
మీ గీజర్ మరమ్మతుల కోసం తరచుగా టెక్నీషియన్‌ను పిలవాల్సి వస్తుందా. ఇది గీజర్ ముగింపు దశలో ఉందనడాకి స్పష్టమైన సంకేతం. నిరంతర మరమ్మతులకు డబ్బు ఖర్చు చేయడం కన్నా.. కొత్త గీజర్ కొనుగోలు చేయడం దీర్ఘకాలికంగా ఆర్థికంగా లాభదాయకం.
నీటి ఉష్ణోగ్రతలో అస్థిరత..
స్నానం చేసేటప్పుడు నీటి ఉష్ణోగ్రత అకస్మాత్తుగా చల్లగా లేదా అతిగా వేడిగా మారుతుందా..? ఇది థర్మోస్టాట్ లేదా హీటింగ్ ఎలిమెంట్‌లో సమస్యను సూచిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినట్లయితే గీజర్ పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
Water Geyser : గీజర్ నుంచి నీటి లీకేజీ..
ట్యాంక్, వాల్వ్‌లు లేదా పైప్ కనెక్షన్ల నుంచి చిన్న లీకేజీ ఏర్పడినా ప్రమాదకరంగా మారుతుంది. లీకేజీ సమస్య ఏర్పడిందంటే పాడయ్యే దశలో ఉందని అర్థం. లికేజీల వల్ల గోడలు తడిసి, నేలలు దెబ్బతిని, ఫంగస్ పెరిగి ఇంటి నిర్మాణానికి హాని కలగవచ్చు.
Water Geyser : కరెంట్ బిల్లులో ఆకస్మిక పెరుగుదల
పాత గీజర్‌లు నీటిని వేడి చేయడానికి ఎక్కువ విద్యుత్తును వాడుకుంటాయి. మీ వినియోగం మారకపోయినా బిల్లు పెరిగితే గీజర్ సమస్య కావొచ్చు. కొత్త తరం మెరుగైన ఇన్సులేషన్, ఎనర్జీ సేవింగ్ గీజర్ వల్ల విద్యుత్ ఖర్చు తగ్గుతుంది.
ఇది కూడా చదవండి..: Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్ కల్యాణ్
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai