Winter Health Care | చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. మీ ఆరోగ్యం సేఫ్..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Winter Health Care : చలికాలం వచ్చిందంటే చాలు.. మనల్ని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చలి కారణంగా చర్మ సంబంధిత సమస్యలతో ఇతర ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే సీజన్​ ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడంతో చలి అంతగా లేదు. కానీ.. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా సంరక్షించుకోవచ్చు.

Winter Health Care | శీతాకాలం.. వాధ్యుల కాలం..

చలికాలం(Winter) అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. జలుబు, దగ్గు నుంచి మొదలు పెడితే ఆస్తమా వరకు అనేక సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి. చర్మం పొడిబారడం, పగుళ్లు ఏర్పడడంతో పాటు విటమిన్ లోపాలు తలెత్తుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఇలా అనేక సమస్యలు ఇబ్బంది పెడతాయి.

Winter Health Care | ఈ జాగ్రత్తలు పాటించండి..

చలి కాలంలో కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సరైన నియమాలు పాటించడం వల్ల చలికాలాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో దాహం ఎక్కువగా కాదు.. అయినా కూడా నీటి అధికంగా తీసుకోవాలి. దీని వల్ల అందంతో పాటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. అందుకే చర్మానికి తేమ అవసరం.. కాబట్టి మాయిశ్చరైజర్లు (Moisturizers) వాడాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో పెదాలు కూడా పగిలే అవకాశం ఉంటుంది. లిప్ బామ్​లు వినియోగించడం వల్ల ఈ సమస్యకు చెక్​ పెట్టవచ్చు.

Winter Health Care | రోగనిరోధక శక్తిని పెంచుకోండి..

పలు ఆహార నియమాలు పాటించడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చే. విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు తీసుకోవడం వల్ల జలుబు(Cold), దగ్గు (Cough) నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. నారింజ, నిమ్మకాయలు వంటివి వాటిలో సి విటమిన్​ అధికంగా ఉంటుంది. విటమిన్ డి లోపం ఉన్న వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉదయాన్నే ఎండలో వాకింగ్‌కు వెళ్లడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్‌ డి లభిస్తుంది.

Winter Health Care | వెచ్చదనం కలిగించే దుస్తులు ధరించాలి

చలికాలంలో మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తే.. వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు కాకుండా ఉన్నితో (Woolen cloths) రూపొందించనవి ఎంచుకోండి. అలాగే పాలీప్రొఫైలిన్ వంటి సింథటిక్ ఫాబ్రిక్‌ను కూడా ధరించవచ్చు. ఎందుకంటే ఇది తేమను దూరం చేసి వేడిని కలిగిస్తుంది.

  • చలికాలంలో వ్యాయామం, వాకింగ్​, యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
  • అత్యవసరమైతేనే దూర ప్రయాణాలు చేయాలి.
  • వేడినీటితో కాకుండా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి.
  • స్నానం చేసిన 15 నిమిషాల అనంతరం మాయిశ్చరైజర్లు చర్మానికి రాసుకోవాలి.
  • బయటకు వెళ్లే సమయంలో స్వెటర్లు, గ్లౌజులు, కోట్లు ధరించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

గమనిక : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

Related posts

Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!

Vande Bharat Sleeper Train | రైల్వే ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ ట్రెయిన్​..

ChatGPT Images | ఓపెన్ AI నుంచి మేజర్ అప్‌డేట్.. గూగుల్ ‘నానో బనానా ప్రో’కు పోటీగా అత్యాధునిక ఇమేజ్ జనరేషన్..