Shukra Maudhyam 2025 | శుభకార్యాలకు సుదీర్ఘ విరామం.. శుక్ర మౌఢ్యం నిజంగా అశుభ కాలమేనా..!

శుక్ర మౌఢ్యం నవంబరు 26 నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు సుమారు 83 రోజుల పాటు కొనసాగనుంది. దాదాపు రెండున్నర నెలల పాటు శుభకార్యాలకు ‘లాంగ్ బ్రేక్’ ఏర్పడనుంది.

by Harsha Vardhan
0 comments
Shukra Maudhyam 2025

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Shukra Maudhyam 2025 | జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడతాడు. సుఖం, సంతోషం, వైవాహిక జీవితం, సంపద, సౌందర్యం, కళలు, విలాసాలు.. ఇవన్నీ శుక్రుని ఆధీనంలో ఉంటాయి. అయితే ఈ శుక్ర గ్రహం కొన్ని రోజుల పాటు సూర్యునికి అత్యంత సమీపంలోకి వచ్చి, భూమి నుంచి చూసినప్పుడు దాదాపు కనిపించని స్థితికి చేరుకుంటాడు. ఈ కాలాన్నే ‘శుక్ర మౌఢ్యం’ (Shukra Maudhyam) అంటారు. ఈ సమయంలో శుక్రుడు తన సహజ బలాన్ని, ప్రకాశాన్ని కోల్పోయినట్టు భావించి, అతని ప్రభావం బాగా తగ్గిపోతుందని పండితుల అభిప్రాయం.

2025 సంవత్సరంలో ఈ శుక్ర మౌఢ్యం (Shukra Maudhyam) నవంబరు 26 నుంచి ప్రారంభమై.. 2026 ఫిబ్రవరి 7 లేదా 17వ తేదీ వరకు (వివిధ పంచాంగాల ప్రకారం స్వల్ప తేడా ఉండవచ్చు) సుమారు 83 రోజుల పాటు కొనసాగనుంది. ఈ దీర్ఘ వ్యవధి మూలంగా దాదాపు రెండున్నర నెలల పాటు శుభకార్యాలకు ‘లాంగ్ బ్రేక్’ ఏర్పడనుంది.

Shukra Maudhyam 2025

Shukra Maudhyam 2025 | ఈ కాలంలో శుభకార్యాలు ఎందుకు ఉండవంటే..

జ్యోతిష్య శాస్త్రంలో గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి చాలా దగ్గరలో ఉన్నప్పుడు వాటి శక్తి తాత్కాలికంగా క్షీణిస్తుందని భావిస్తారు. ముఖ్యంగా శుక్రుడు సంపూర్ణంగా బలహీనుడైన ఈ మౌఢ్య సమయంలో వివాహం, గృహప్రవేశం, సీమంతం, అక్షరాభ్యాసం, కొత్త వ్యాపార ప్రారంభం, భూమి పూజ, బావి తవ్వడం, వాహన కొనుగోలు వంటి మంగళ కార్యాలు చేయడం శ్రేయస్కరం కాదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఈ కార్యాలు శుక్రుడి అనుగ్రహంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. శుక్రుడు బలహీనుడైతే ఆ కార్యాలు దీర్ఘకాలంలో కష్టాలు, అవాంఛిత ఫలితాలు ఇవ్వవచ్చని ప్రజలు ఆందోళన చెందుతారు.

Shukra Maudhyam 2025 | ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదు?

ఈ కాలం పూర్తిగా నిషేధం అని కాదు. నిత్య పూజలు, దైనందిన ధార్మిక కర్మలు, శివాభిషేకం, లక్ష్మీ పూజ, గణపతి హోమం, కొన్ని ప్రత్యేక వ్రతాలు (ఉదా: వైకుంఠ ఏకాదశి, మకర సంక్రాంతి వంటివి) సాధారణంగా చేసుకోవచ్చు. గ్రహశాంతి, నవగ్రహ హోమాది జప-తప-హోమాలు కూడా అనుమతించబడతాయి. కానీ కొత్తగా మంగళ కార్యాలు ప్రారంభించడం, ముహూర్తాలు పెట్టడం మాత్రం పూర్తిగా వాయిదా వేయడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు.

Shukra Maudhyam 2025 | మౌఢ్యం అంటే ఏమిటి?

ఖగోళ శాస్త్ర దృక్కోణంలో చూస్తే శుక్రుడు సూర్యుడి చుట్టూ తిరుగుతూ, భూమి-సూర్యుడి మధ్యలోకి వచ్చినప్పుడు భూమి నుంచి చూస్తే సూర్యకాంతిలో దాక్కొని కనిపించడు. దీన్నే ‘అధిక మౌఢ్యం’ (Superior Conjunction) అంటారు. ఈ సమయంలో శుక్రుడు వెనుకకు (రెట్రోగ్రేడ్) కదులుతున్నట్టు కనిపిస్తాడు కాబట్టి జ్యోతిష్యంలో దీనిని ‘మౌఢ్యం’గా పరిగణిస్తారు.

జ్యోతిష్యంలో ఇది శుక్రుడి బలహీన కాలంగా గుర్తించబడుతుంది. అందుకే శుభకార్యాలను ఈ 83 రోజుల పాటు వాయిదా వేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.

గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

Leave a Comment

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00