BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్​.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మరోసారి ఒక్క రూపాయి ప్లాన్​ తీసుకువచ్చింది. దీని ద్వారా నెల రోజుల పాటు అన్​లిమిటెడ్​ కాలింగ్​ సౌకర్యం, రోజువారీ 2 జీబీ డేటా అందించనుంది.

by Harsha Vardhan
0 comments
BSNL 1 rupee plan

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: BSNL 1 rupee plan | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తూ ప్రైవేట్ ఆపరేటర్లకు గట్టి పోటీ ఇస్తోంది. గత కొంతకాలంగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచినప్పటికీ, ప్రత్యేక సందర్భాల్లో అత్యంత తక్కువ ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందించి కస్టమర్ల మనసు గెలుచుకుంటోంది.

ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “ఆజాదీ కా ప్లాన్” పేరుతో రూ.1 రీఛార్జ్ ఆఫర్‌ను (BSNL 1 rupee plan) ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దీపావళి సందర్భంగా “దీపావళి

BSNL 1 rupee plan

బొనాంజా” పేరిట మరోసారి ఇదే ఆఫర్‌ను తీసుకొచ్చింది. రెండు సార్లూ ఈ ప్లాన్ ద్వారా భారీ సంఖ్యలో కొత్త కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వ ర్క్‌లో చేరారు.

BSNL 1 rupee plan | ప్రస్తుతం మరోసారి..

ఇప్పుడు మరోసారి అదే ఆకర్షణీయ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చింది. కస్టమర్ల నుంచి వివిధ వేదికలపై వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కేవలం ఒక్క రూపాయి ధరతో 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్టు అధికారికంగా ప్రకటించింది.

BSNL 1 rupee plan | ఈ ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు

  • అన్‌లిమిటెడ్ లోకల్ వాయిస్ కాలింగ్ (ఏ నెట్‌వర్క్‌కైనా)
  • రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా (ఆ తర్వాత అన్‌లిమిటెడ్ రిడ్యూస్డ్ స్పీడ్)
  • రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్ సౌకర్యం
  • వ్యాలిడిటీ: 30 రోజులు

BSNL 1 rupee plan | డిసెంబర్​ 31 వరకు..

ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటంటే, కొత్త సిమ్ కార్డు తీసుకునే వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సిమ్ కార్డు పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. ఈ స్కీం డిసెంబర్ 1 నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 31, 2025 వరకు కొనసాగనుంది.

ఈ ప్రత్యేక ఆఫర్‌ను పొందాలంటే సమీప బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా అధికారిక కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.

తక్కువ ఖర్చుతో అత్యధిక ప్రయోజనాలు అందించే ఈ ప్లాన్ ద్వారా మరింత మంది కస్టమర్లను చేరదీసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ యోచిస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల ధరల పెంపుతో నష్టపోతున్న వినియోగదారులకు ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

Leave a Comment

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00