Penci Sport plugin only working with the Soledad theme.

Telugu News Today - Telugu News Today

Category: Telugu News Today

  • Self Driving auto | డ్రైవర్​ లేని ఆటోనా.. నిజమేనా..! అదీ మేడిన్​ ఇండియా.. ఎక్కి కూర్చుంటే అదే తీసుకెళ్తుంది..

    Self Driving auto | డ్రైవర్​ లేని ఆటోనా.. నిజమేనా..! అదీ మేడిన్​ ఇండియా.. ఎక్కి కూర్చుంటే అదే తీసుకెళ్తుంది..

    తెలుగు న్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Self Driving auto | డ్రైవర్​ లేని ఆటో.. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా.. టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. పెరుగుతున్న సాంకేతిక కొత్త ఆవిష్కరణకు నాంది పలుకుతోంది. మన దేశానికి చెందిన ఓ ప్రముఖ త్రీవీలర్​ ఆటో మొబైల్​ సంస్థ ఈ సెల్ఫ్​ డ్రైవింగ్​ ఆటోను రూపొందించింది. దాని విశేషాలు తెలుసుకుందాం పదండి..

    Self Driving auto | అధునాతన ఫీచర్స్​ను ఉపయోగించి..

    ఓమెగా సీకి మొబిలిటీ (Omega Seiki Mobility) అనే సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ ఆటోను ఇటీవల ఆవిష్కరించింది. అయితే మనది జనాభా ఎక్కువ గల దేశం. అంతేకాకుండా విపరీతమైన ట్రాఫిక్​లో ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. దీనిని దృష్టిలో ఉంచుకునే సదరు కంపెనీ ఈ త్రీ వీలర్​ను తయారు చేసింది. దేశంలోని అధిక జనసాంద్రత, లో స్పీడ్ ట్రాఫిక్‌కు అనుకూలంగా దీనీని రూపొందించారు. లిడార్, జీపీఎస్​, ఏఐ ఆధారిత నావిగేషన్ (Navigation) వంటి ఆధునిక సాంకేతికతలతో తయారు చేయడం వలన సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. కాగా.. వీటిని త్వరలో ప్రయాణికుల వేరియంట్, రవాణా వేరియంట్లను మార్కెట్​లో తీసుకురానున్నారు.

    Self Driving auto | ఈ ఆటో ఫీచర్స్​ ఇవే..

    ఒమేగా సీకి సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇందులో ఒకటి ప్యాసింజర్ వెర్షన్ కాగా.. మరోటి కార్గో వెర్షన్​. పాసింజర్​ను మనషుల ప్రయాణానికి తగినట్లుగా తయారు చేశారు. ఇక కార్గో వెర్షన్ గూడ్స్ ట్రాన్స్ పోర్టేషన్​ కోసం తగినట్లుగా డిజైన్ చేశారు. ఈ ఆటో 10.3 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్​ చేస్తే 12‌‌0 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఏఐ బేస్డ్​ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో ఈ త్రీవీలర్​ నడవనుంది. ఇందులో మల్టీ సెన్సార్ నావిగేషన్​తో పాటు రిమోట్ సేఫ్టీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ముందుగా మీరు ఒక లొకేషన్ సెట్ చేస్తే.. అది ఆటోమెటిక్​గా, సేఫ్​గా తన రూట్ ఎంచుకుని గమ్యాన్ని చేరుకుంటుంది.

    ఈ సెల్ఫ్​ డ్రైవింగ్​ త్రీవీలర్ (Self driving auto) అనేది​ దేశ రవాణా రంగంలో కీలక ముందుడుగా మారుంతుందని చెప్పవచ్చు. దేశంలో అనేక మంది తక్కువ ఛార్జీలతో గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆటోలకు ప్రాధాన్యతనిస్తారనేది మనకు తెలిసిందే. అయితే త్వరలో అందుబాటులోకి రానున్న ఈ డ్రైవర్​ లేని ఆటోలు ఎంత వరకు సక్సెస్​ అవుతాయనేది ఆసక్తికరమైన అంశం. కాగా.. ‘మేము ప్రజలకు సేవ చేసే టెక్నాలజీని అందిస్తున్నాం’ అని కంపెనీ ఛైర్మన్​ ఉదయ్​ నారంగ్ ​చెప్పుకొచ్చారు.

  • Sir Creek | పాక్​కు భారత్​ ఎందుకు స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చింది.. అసలేమిటీ సర్​ క్రీక్​ వివాదం..!

    Sir Creek | పాక్​కు భారత్​ ఎందుకు స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చింది.. అసలేమిటీ సర్​ క్రీక్​ వివాదం..!

    తెలుగు న్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Sir Creek | కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, ఆర్మీ చీఫ్​ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్​కు స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకు అంత సీరియస్​గా హెచ్చరికలు చేశారు. అసలు సర్​ క్రీక్​ వివాదం ఏమిటో తెలుసుకుందాం..

    పహల్​గామ్​ ఉగ్రదాడితో భారత్​ – పాకిస్తాన్​ మధ్య తీవ్ర ఉద్రిక్తలు తలెత్తిన అందరికీ తెలిసిన విషయమే. పాక్​ టెర్రరిస్టులు పహల్​గామ్​లో ఉగ్రదాడికి (Pahalgam terror attack) పాల్పడి మన వాళ్లను పొట్టన పొట్టుకున్నారు. దీంతో భారత్​ దూర్తదేశానికి ఆపరేషన్​ సింధూర్ (Operation sindoor)​ పేరిట తగిన గుణపాఠం చెప్పింది. భారత్​ దాడులు తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణకు బతిమిలాడుకోవడం మనందరికీ విదితమే. కానీ కుక్కతోక వంక అన్నట్లు.. ఆ దేశం బుద్ధి మారడం లేదు. ఏమైందనుకుంటున్నారా.. భారత్​తో మళ్లీ గుల్లికజ్జాలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

    Sir Creek | తెరపైకి ‘సర్​ క్రీక్’​ వివాదం

    భారత్-పాకిస్తాన్ మధ్య తాజాగా ‘సర్ క్రీక్ ’ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతంలో పాక్​ తన సైనిక మౌలిక సదుపాయాలను పెంచుతోంది. సర్ క్రీక్ ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇటీవల పాకిస్తాన్.. బంకర్లు, రాడార్లు, డ్రోన్లను, పదాతిదళ కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల క్రితం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defense Minister Rajnath Singh), మన ఆర్మీ చీఫ్​ ద్వివేది పాకిస్తాన్​కు స్ట్రాంగ్​ వార్నింగ్ ఇచ్చారు. సర్ క్రీక్‌లోని భారత్‌కు చెందిన భాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారుతాయని హెచ్చరించారు. కరాచీకి వెళ్లే ఒక మార్గం సర్ క్రీక్ ద్వారా వెళ్తుందనే విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇక ఆర్మీ చీఫ్​ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సర్ క్రీక్​ను ఇంచు ఆక్రమించినా పాకిస్తాన్​ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు.

    Sir Creek | అసలేమిటీ వివాదం..

    ‘సర్ క్రీక్’ గుజరాత్‌ రాష్ట్రంలోని రాన్ ఆఫ్ కచ్ (Rann of Kutch) చిత్తడి నేలలో 96 కి.మీ. ఒక నీటి స్ట్రిప్. ఇది భారతదేశం – పాక్​ మధ్య వివాదాస్పద ప్రాంతం. ఈ క్రీక్ భారతదేశంలోని కచ్ ప్రాంతాన్ని, పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌ను వేరు చేస్తుంది. వలస రాజ్యాల సమయంలో బ్రిటిష్ అధికారి పేరు మీద సర్ క్రీక్ అని పేరు పెట్టారు. రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దు రేఖ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ ప్రాంతం బాంబే ప్రెసిడెన్సీలో ఉండేది. 1947లో విభజన అనంతరం కచ్ భారత్​తో ఉండగా, సింధ్ పాకిస్తాన్‌కు దక్కింది. 1914లో కచ్ రావు సింధ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం మధ్య సంతకం చేయబడిన బాంబే ప్రభుత్వ తీర్మానం ప్రకారం.. పాకిస్తాన్ ఈ క్రీక్ తన భూభాగంగా చెబుతోంది. అయితే భారతదేశం అంతర్జాతీయ చట్టంలోని థాల్వెగ్ నియమం ప్రకారం.. భారతదేశం సరిహద్దు కాలువ మధ్యలో ఉండాలని, అంటే క్రీక్‌లో సగం తమకు చెందాలని వాదిస్తోంది. 

    Sir Creek | ఈ ప్రాంతం ఎందుకు ముఖ్యమైందంటే..

    సర్ క్రీక్ ప్రాంతం (Sir Creek) ఎంతో వ్యూహాత్మకమైంది. 1965 యుద్ధంలో రాన్ ఆఫ్ కచ్‌లో భారత్​, పాక్​ దళాలు ఘర్షణ పడ్డాయి. అలాగే మత్స్యకార ప్రదేశం. ఆసియాలోనే అతిపెద్ద మత్స్యకార వనరుల్లో ఇదీ ఒకటి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో సముద్రం కింద చమురు మరియు గ్యాస్ నిల్వలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాంతం ఎంతో కీలమైంది.