Penci Sport plugin only working with the Soledad theme.

Telugu News Today - Telugu News Today

Category: Telugu News Today

  • Womens world cup 2025 | జయహో భారత్​.. మహిళా వరల్డ్​ కప్​ విజేతగా టీమిండియా

    Womens world cup 2025 | జయహో భారత్​.. మహిళా వరల్డ్​ కప్​ విజేతగా టీమిండియా

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Womens world cup 2025 | భారత్​ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి దక్కించుకుంది. నవీ ముంబయిలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్​లో సౌతాఫిక్రాను మట్టికరిపించింది. అద్వితీయమైన ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్‌ సేన విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచ కప్​ కలను ముద్దాడింది. ఈ ఉద్విగ్న క్షణం కోసం దశాబ్దాల తరబడిగా ఎదురుచూసిన భారతావని పులకించిపోయింది.

    Womens world cup 2025 | దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా

    భారత మహిళా జట్టు చిరకాల కల సాకారమైంది. వ‌న్డే ప్రపంచ క‌ప్‌ను సొంతం చేసుకుంది. నవీ ముంబయి వేదికగా జరిగిన తుదిపోరులో సౌతాఫిక్రాపై భారత్‌ ఘన విజయం సాధించింది. 52 పరుగుల తేడాతో చిత్తుచేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.

    షెఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ విరోచిత సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ 5, షెఫాలీ వర్మ 2, శ్రీ చరణి ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా షెఫాలీ నిలిచింది. ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డును దీప్తి శర్మ అందుకుంది.

    ఇది కూడా చదవండి..: Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Water Heater Precautions | వాటర్​ హీటర్​ వినియోగిస్తున్నారా.. అయితే జాగ్రత్తలు పాటించండి..!

    Water Heater Precautions | వాటర్​ హీటర్​ వినియోగిస్తున్నారా.. అయితే జాగ్రత్తలు పాటించండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Water Heater Precautions | చలికాలం వచ్చిందంటే చాలు.. చన్నీటితో స్నానం చేయడం, ముఖం కడుక్కోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, నీళ్లు వేడి చేసుకోవడానికి కొందరు గీజర్ ఉపయోగిస్తుంటారు. మరికొందరు గ్యాస్ స్టౌ వాడుతుంటారు. ఇంకా కొందరైతే వాటర్ హీటర్​తో నీటిని వేడి చేస్తుంటారు. అయితే.. ఎక్కువ మంది మాత్రం వాటర్ హీటరే వాడుతుంటారు. ఎందుకంటే వాటర్​ హీటర్​ అందుబాటులో ధరలో లభిస్తుంది. తక్కువ సమయంలో నీళ్లు వేడి కావడం వల్ల చాలామంది దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే దీనిని ఉపయోగించే సమయంలో కొందరు పొరపాట్లు చేస్తూ ప్రాణాల మీదకు ముప్పు తెచ్చుకుంటారు. కాబట్టి వీటిని వాడే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం..!

    కొనుగోలు సమయంలో జాగ్రత్త

    హీటర్​ కొనుగోలు సమయంలో ఐఎస్ఐ మార్క్ ఉన్నవి, బ్రాండెడ్ కంపెనీలవే కొనుగోలు చేయాలి. హీటర్ కాయిల్స్​పై ఉండే సిలికా కోటింగ్ రెండేళ్ల తర్వాత తొలగిపోతుంది. ఆ సమయంలో పాతది పక్కన పెట్టేసి.. కొత్త దానిని వినియోగించాలి.

    Water Heater Precautions : బకెట్​ కూడా ముఖ్యమే..

    చాలామంది హీటర్​ను ప్లాస్టిక్ బకెట్లలో పెట్టి నీటిని వేడి చేస్తుంటారు. అంతేకాకుండా బకెట్​కు హీటర్ హుక్​ను తగిలిస్తుంటారు. దీనివల్ల వేడికి ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది. ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ప్లాస్టిక్​ బకెట్​పై ఒక సన్నటి చెక్క (కట్టె) పెట్టి ఉపయోగించవచ్చు. అల్యూమినియం బకెట్ వినియోగిస్తున్నట్లయితే హీటర్​ను నేరుగానే పెట్టవచ్చు. అయితే విద్యుత్తు షాక్ తగిలే ప్రమాదం ఉన్నందున ఇనుప బకెట్​ను యూజ్​ చేయకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

    బకెట్​ నీటిని ఎంతవరకు పట్టాలంటే..

    బకెట్​లో నింపిన తర్వాత హీటర్​ను నీళ్లలో పెట్టాలి. అయితే హీటింగ్​ కాయిల్​ అనేది మునిగేలా చూసుకోవాలి. అనంతరం ప్లగ్​ను పవర్​ సాకెట్​కు పెట్టి స్విచ్​ ఆన్​ చేసుకోవాలి. మీరు వాడే హీటర్​పై దానిని ఎంత వరకు ముంచాలనే మార్క్​ ఉంటుంది. దానిని చూసుకుని బకెట్​లో వాటర్​ నింపుకోవాలి.

    Water Heater Precautions | కొన్ని విషయాల్లో జాగ్రత్తం

    హీటర్​ ఆన్​ చేసిన కొద్దిసేపటికి నీళ్లు వేడి అయ్యాయా లేదా చెక్​ చేయడానికి పవర్​ సాకెట్​ను స్విచ్​ ఆఫ్​ చేసి ప్లగ్​ తీసేసిన తర్వాతే నీటిని వేడి చూడాలి. అయితే కొందరు ఏమరపాటులో స్విచ్​ ఆఫ్​ చేయకుండా చూస్తుంటారు. ఇలా చేయడం ప్రాణాల మీదకు తెస్తుంది.

    Water Heater Precautions : కొందరు వాటర్ హీటర్స్ బాత్​రూమ్స్​లో వినియోగిస్తుంటారు. ఇలా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా 2 ఇన్ 1 కనెక్షన్ ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల.. ఒక్కోసారి స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయి బాత్​రూంలోకి వెళ్తే.. తేమ వల్ల విద్యుత్​ షాక్​కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

    మరో విషయం ఏమిటంటే పిల్లలున్న ఇళ్లలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు తిరిగే ప్రదేశాల్లో వీటిని అస్సలు పెట్టకూడదు. ఎవరూ వెళ్లని ఓ మూల చూసుకుని హీటర్​ పెట్టాలి. లేదంటే ప్రత్యేకంగా ఓ గదిలో నీటిని వేడి పెట్టుకోవడం ఉత్తమం.

    గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    Arattai End-to-End Chat Encryption |చాట్​ ఎన్​క్రిప్షన్​ను​ తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Arattai End-to-End Chat Encryption : జోహోకు చెందిన స్వదేశీ సోషల్​ మీడియా ప్లాట్​ఫాం అరట్టై యాప్ డౌన్​లోడ్స్​లో దూసుకుపోతోంది. గత నెల రోజుల్లో కోటి మందికిపైగా డౌన్​లోడ్​ చేసుకున్నారు. అయితే ఇందులో కాల్స్​కు ఎన్​క్రిప్షన్​ అందుబాటులో ఉండగా.. చాట్​ కోసం మాత్రం లేదు. కాగా.. దీనిపై దృష్టి సారించిన సంస్థ త్వరలోనే చాట్‌ల కోసం వాట్సాప్ లాంటి ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్​ వెంబు తెలిపారు.‌

    Arattai End-to-End Chat Encryptionచివరి ఫీచర్​ టెస్టింగ్​!

    అరట్టై ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్​ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫీచర్ చివరి పరీక్ష దశలో ఉన్నట్లు సమాచారం. దీనిని వినియోగదారుల కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ అందుబాటులోకి వచ్చినట్లయితే అరట్టై యాప్ వాట్సాప్‌కు మరింత బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వినియోగదారుల చాట్​లను లేదా డేటాను గోప్యంగా ఉంచుతుంది.‌

    ‌Arattai End-to-End Chat Encryption త్వరలో జోహో పే..!
    అరట్టై ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పాటు, UPI-ఆధారిత చెల్లింపు వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. జోహో పేను ప్లాట్‌ఫామ్‌లోకి ఇంటిగ్రేట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వచ్చినట్లయితే వినియోగదారులు యాప్‌లోనే డబ్బు పంపడం, స్వీకరించడం తదితర సౌకర్యాలు కలుగనున్నాయి. ఇది మనం వాట్సాప్‌ లాగే.. మల్టీ-యుటిలిటీ కమ్యూనికేషన్ సాధనంగా మారనుంది.

    Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్​పై ఓ లుక్కేయండి..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్​పై ఓ లుక్కేయండి..!

    Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్‌ ధరలో ట్యాబ్లెట్‌ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్​పై ఓ లుక్కేయండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ప్రముఖ మొబైల్స్​ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరో ట్యాబ్​లెట్​ను లాంఛ్​ చేసింది. ఇది బడ్జెట్‌ ధరలో వైఫై, LTE కనెక్టివిటీతో లభ్యమవుతోంది. వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ ట్యాబ్లెట్‌ 11 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 9340mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాంకుడా ఈ ట్యాబ్​లో క్వాడ్‌ స్పీకర్‌ యూనిట్‌ సైతం ఉంది. ఇందులో Kids Space ఫీచర్‌ను కూడా ఇచ్చారు. Budget Tablets Under 15000 India ఈ వన్‌ప్లస్‌ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలివే…

    Top 7 Budget Tablets Under 15000 | రూ.15,999 నుంచి ప్రారంభం..

    వన్‌ప్లస్‌ ప్యాడ్‌ లైట్‌ ట్యాబ్లెట్‌ ప్రస్తుతం అమెజాన్​లో లభ్యమవుతోంది. 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీతో వచ్చే ఈ ట్యాబ్​ (Wi-Fi) ధర రూ.15,999గా ఉంది. అలాగే 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ డివైజ్​ (Wi-Fi + 4G LTE) ధర రూ.17,999గా లభ్యమవుతోంది.

    Top 7 Budget Tablets Under 15000 |స్పెసిఫికేషన్స్​ ఇవే..

    90Hz రీఫ్రెష్‌ రేట్​ 11 ఇంచెస్​ HD+ LCD డిస్‌ప్లేతో ఈ ట్లాబ్లెట్‌ వస్తోంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌ ఉంటుంది. 180Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ ఉంది. ఈ డిస్‌ప్లే Low Blue Light, ఫ్లిక్కర్‌ ఫ్రీతో కూడిన TUV Rheinland సర్టిఫికేషన్‌ కలిగి ఉంటుంది.

    ఆండ్రాయిడ్‌ 15 ఓస్..

    ఈ ట్యాబ్​ మీడియాటెక్ హీలియో G100 SoC ప్రాసెసర్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0.1పై వర్క్​ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే.. వెనుక వైపు 5MP కెమెరా ఉంటుంది. ముందు వైపు 5MP కెమెరా వస్తుంది.

    Top 7 Budget Tablets Under 15000 | భారీ బ్యాటరీ

    ఈ వన్‌ప్లస్‌ ట్యాబ్​ అనేది 33W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో పాటు 9340mAh బ్యాటరీతో లభిస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్​ చేస్తే 80 గంటల మ్యూజిక్ ప్లే టైం, లేదంటే 11 గంటల వీడియో ప్లేబ్యాక్‌ లేదా 54 రోజుల స్టాండ్‌బై టైంను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

    ఈ బడ్జెట్​ ట్యాబ్​ Hi – Res ఆడియో గోల్డ్‌ స్టాండర్డ్‌ సర్టిఫికేషన్​తో కూడిన క్వాడ్ స్పీకర్‌ యూనిట్‌ కలిగి ఉంటుంది. ఇందులో షేరింగ్ ఫీచర్‌.. కిడ్స్‌ మోడ్​ సైతం ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా Wi-Fi, 4G LTE, బ్లూటూత్ 5.4 కలిగి ఉంది.

    US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. కూడా చదివేయండి.

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలు షురూ..!

    US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలు షురూ..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: US Nuclear Testing | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. రష్యా, చైనా లాంటి దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో.. అమెరికా సైతం అణ్వాయుధ పరీక్షలను మళ్లీ ప్రారంభించాలని ఆదేశించినట్లు ప్రకటించారు. ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక అయిన ‘ట్రూత్‌ సోషల్’​లో ఈ విషయాన్ని వెల్లడించారు.

    US Nuclear Testing | ట్రంప్​ ఏమన్నారంటే..

    “ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలు అమెరికా వద్దనే ఉన్నాయి. నా తొలి పదవీ కాలంలో దీనిని సాధించాం. అయితే ఈ ఆయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి వల్ల అప్పట్లో పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఇతర దేశాలు తమ అణు సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటున్నాయి. ఇందులో రష్యా రెండో స్థానంలో ఉండగా.. చైనా మూడో స్థానంలో ఉంది. రానున్న ఐదేళ్లలో ఈ మూడు దేశాలు సమాన స్థాయికి చేరే ఛాన్స్​ ఉంది. అందుకే మన దేశం తిరిగి అణ్వాయుధ పరీక్షలను ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది. ఇందుకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్​కు ఆదేశాలు జారీ చేశా. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభం కానుంది” అని ట్రంప్‌ తెలిపారు.

    US Nuclear Testing తో ట్రంప్ తాజా​ వ్యాఖ్యలతో అమెరికా–రష్యా–చైనాల మధ్య అణు ఆయుధ పోటీ కొత్త దశకు చేరనున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల రష్యా తన అణు సామర్థ్యాలను పెంచుకునేందుకు విస్తృతంగా చర్యలు చేపడుతోంది. ఇటీవల రష్యా పరీక్షించిన పోసిడాన్ అణు డ్రోన్‌ సబ్‌మెర్సిబుల్‌ అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వెల్లడించారు. అదే సమయంలో చైనా కూడా తన అణ్వాయుధాలను విస్తరించాలని భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. ట్రంప్​ దక్షిణ కొరియా బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్న కొన్ని గంటల ముందు ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే.. ట్రంప్‌ ప్రకటించిన ఈ నిర్ణయంపై అమెరికా రక్షణ శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనట్లు తెలుస్తోంది.

    ఈ క్రింది Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..! ఐతే ఓ లుక్కేయండి..

    Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Contrails |ఆకాశంలో విమానం వెనుక తెల్ల గీతలు ఎందుకు వస్తాయి?

    Contrails |ఆకాశంలో విమానం వెనుక తెల్ల గీతలు ఎందుకు వస్తాయి?

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: ఆకాశంలో విమానం ఎగురుతున్న సమయంలో దాని వెనుక పొడవైన తెల్ల గీతలను మీరు గమనించే ఉంటారు. విమానం వెళ్తుండగా దానరి వెనకాలే చారలు ఏర్పడుతుంటాయి. కాసేపటి తర్వాత అవి మాయమైపోతూ ఉంటాయి. అది పొగనా.. లేదా కాలుష్యమా.. ఇంకా ఏమైనా అని ఆలోచించారా.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా..

    ఆకాశంలో విమానాలు వెళ్తున్న సమయంలో తెల్లని గీతలు ఏర్పడుతుంటాయి. అయితే వీటిని “కాంట్రైల్స్” (Contrails) లేదా “కండెన్సేషన్ ట్రైల్స్” (Condensation Trails) అంటారని నిపుణులు చెబుతున్నారు. విమానాలు ఎగిరే ఎత్తు చాలా ఎక్కువగా ఉండడం వల్ల.. వాతావరణ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉంటుందట. కానీ విమానం ఇంజన్లు మాత్రం అత్యంత వేడిగా.. 500 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తాయి. అయితే Contrails ఈ వేడి వాయువులు చల్లని గాలిని తాకినసమయంలో వాటిలోని నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. ఈ ప్రక్రియలో ఏర్పడే చిన్న మంచు కణాలు కలసి తెల్లని చారలు రూపంలో మనకు కనిపిస్తుంటాయి. ఈ తెల్లని గీతలనే వాస్తవానికి మంచు స్ఫటికాల సమాహారం. పొగ లేదా కాలుష్యం కావు.

    Contrails అన్ని విమానాల్లో ఇలాగే జరుగుతుందా..


    అన్ని విమానాలు ఇలాంటి కాంట్రైల్స్‌ను సృష్టించవని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రధానంగా.. విమానం ఎగురుతున్న ఎత్తు, ఇంజిన్ నుంచి వెలువడే వేడి, గాలిలోని తేమ, ఉష్ణోగ్రతలు సరిగ్గా కలిసినప్పుడు సమయంలో మాత్రమే కండెన్సేషన్ ట్రైల్స్ ఏర్పడతాయట. అయితే విమానాలు తక్కువ ఎత్తులో ఎగిరినా.. లేదంటే పొడి వాతావరణంలో ఉన్నా కూడా ఈ గీతలు కనిపించవని చెబుతున్నారు.

    ఇక నుంచి ఎప్పుడైనా విమానం వెళ్తున్న సమయంలో గీతలు కనిపిస్తే దానిని కాలుష్యం అనుకోకండి. అది కేవలం ఘనీభవించిన నీటి ఆవిరి మాత్రమే. తెలుసుకున్నారుగా సైన్స్​ ఎంత ఆశ్చరమైనదో.. గొప్పదో అని..

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్​ను మళ్లీ చూడొచ్చు..

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్​ను మళ్లీ చూడొచ్చు..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ప్రముఖ సోషల్​మీడియా యాప్​ ఇన్​స్టాగ్రాం నయా ఫీచర్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది యూజర్స్​కు ఎంతో ఉపయోగపడనుంది. గతంలో మనం ఒక వీడియో చూస్తే.. అది తిరిగి చూడాలంటే మనకు దొరకకపోయేది. కానీ ఇన్​స్టా తీసుకున్న వచ్చిన ఈ కొత్త ఫీచర్​ ఈ సమస్యకు చెక్​ పెట్టనుంది. ‘వాచ్​ హిస్టరీ’ ఫీచర్​ ద్వారా మనం గతంలో చూసి రీల్​ను మళ్లీ చూసేయవచ్చు. దీని గురించి తెలుసుకుందామా..

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన సోషల్​ మీడియా ప్లాట్​ఫాం. సామాన్య వినియోగదారుల నుంచి ప్రముఖుల వరకు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారు. కొందరైతే గంటల కొద్దీ స్క్రోల్​ చేస్తూ గడిపేస్తున్నారు. అయితే, ఒకసారి స్క్రోల్ చేసిన తర్వాత ఆ రీల్‌ను మళ్లీ చూడాలనుకుంటే పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ఇన్‌స్టా కొత్త ఫీచర్​ను లాంఛ్​ చేసింది. ఇది తన వినియోగదారుల అనుభవాన్ని మరింత సులభతరం ఉపయోగపడనుంది.

    Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఏమన్నారంటే..

    ఈ కొత్త ఫీచర్​పై ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఆడమ్ మొస్సేరి ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో ఏమన్నారంటే.. “ఇకపై మీరు గతంలో చూసిన రీల్స్‌ను సులభంగా కనుగొనవచ్చు. ఈ ఫీచర్‌ మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.

    ఎలా యాక్సెస్ చేయాలంటే..

    Instagram History Feature ఇన్​స్టా గ్రాం తీసుకున్న వచ్చిన కొత్త ఫీచర్​ను ఉపయోగించడం ఎంతో సులభం. ఈ స్టెప్స్​ ఫాలో అయితే గత రీల్స్​ జాబితాను చూసేయవచ్చు.

    • ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్​ చేయండి
    • సెట్టింగ్స్​లోకి (Settings) వెళ్లండి.
    • తర్వాత Your Activity ఎంపికను ఎంచుకోండి.
    • అక్కడ ‘వాచ్ హిస్టరీ’ (Watch History) అనే ఆప్షన్​ ఎంపిక కనిపిస్తుంది.
    • ఈ విభాగంలోకి వెళ్లాక.. మీరు గతంలో చూసిన రీల్స్ చేసేయవచ్చు.

    ఈ ఫీచర్ ఎందుకంటే..

    ఎంతో మంది వినియోగదారులు రీల్ చూస్తున్న టైం ఫోన్ కాల్ వచ్చినా లేదా యాప్‌ను రిఫ్రెష్ చేసినా.. ఆ రీల్‌ను తిరిగి దొరకక నిరాశకు గురవుతుండేవారు. ఈ సమస్యపై యూజర్స్​ నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇన్‌స్టా ఈ ఫీచర్​ను డెవలప్​ చేసింది. మీరు కూడా ఈ కొత్త ఫీచర్‌ను ట్రై చేయండి.. మీకు నచ్చిన రీల్స్‌ను సులభంగా తిరిగి చూసేయండి..

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitter, Arattai

  • Bharat Taxi | ఓలా, ఊబర్​లకు గట్టిషాక్​.. ‘భారత్​ టాక్సీ’ని అందుబాటులోకి తేనున్న కేంద్రం..

    Bharat Taxi | ఓలా, ఊబర్​లకు గట్టిషాక్​.. ‘భారత్​ టాక్సీ’ని అందుబాటులోకి తేనున్న కేంద్రం..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Bharat Taxi | దేశంలో ప్రముఖ క్యాబ్​ సర్వీసెస్​ అయిన ఓలా, ఊబర్​లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం అతి త్వరలోనే ‘భారత్​ ట్యాక్సీ’​ (Bharat Taxi) సర్వీస్​ను అందుబాటులోకి తీసుకురానుంది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కో- ఆపరేషన్, నేషనల్ ఈ- గవర్నెన్స్ డివిజన్ ఆధ్వర్యంలో సేవలను ప్రారంభించనుంది. అయితే డ్రైవర్ల నుంచి కమీషన్లు వసూలు చేయకుండా.. కేవలం సభ్యత్వ రుసుముతోనే సేవలను అందించనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలపై ప్రజల నుంచి కేంద్రానికి కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Bharat Taxi | ప్రైవేటు సర్వీసులపై ఫిర్యాదులు

    ప్రైవేట్ క్యాబ్ సర్వీసులపై ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదులు వస్తున్నాయి. ఇష్టారీతిన క్యాబ్ ధరలను పెంచడం, పాత వాహనాలను వినియోగించడం, సడెన్ క్యాన్సిలేషన్, వెంటనే రేట్లు పెరగడం తదితర ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వారి వద్ద నుంచి కంపెనీలు అత్యధికంగా కమీషన్లు తీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆదాయంలో సుమారు 25 శాతం కమీషన్లకే పోతుందని క్యాబ్​ డ్రైవర్లు వాపోతున్నారు.

    Bharat Taxi | ఎప్పటి నుంచి ప్రారంభం అంటే..

    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న భారత్ టాక్సీ సర్వీసులు నవంబర్​లో ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. అయితే తొలుత దేశ రాజధానిలోని విమానాశ్రయాలతో పాటు ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ యాప్ ఆధారిత సేవలు అందించేందుకు ఇప్పటివరకు సుమారు 650 మంది డ్రైవర్లను నియమించుకుంది. ఢిల్లీలో సేవలను పరీక్షించిన అనంతరం దేశ వ్యాప్తంగా ప్రధాన సిటీలకు విస్తరించనుంది.

    Bharat Taxi | సహకార సంస్థ ఏర్పాటు

    భారత్​ టాక్సీ సర్వీస్​ ఏర్పాటు కోసం కేంద్రం ఇప్పటికే ‘సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’ను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా దీనికోసం రూ. 300 కోట్ల వాటా మూలధనం కూడా కేటాయించింది. ఈ సహకార సంస్థకు ఇటీవల ఎన్నికలు సైతం నిర్వహించగా.. అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. అలాగే ఎన్​సీడీసీ (NCDC) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ గుప్తా వైస్ ఛైర్మన్​గా ఎన్నుకున్నారు.

    Bharat Taxi | ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన పనిలేదు

    ‘భారత్‌ ట్యాక్సీ’ సేవల్లో రైడ్‌ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా డ్రైవర్లకే చెల్లించనున్నారు. డ్రైవర్​లు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన పనిలేదు. అతి తక్కువ నామినల్‌ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫామ్‌తో పనిచేయవచ్చు. దీని వల్ల డ్రైవర్లకు ఎంతో మేలు జరుగనుంది.

    Laptop Charging | ల్యాప్​టాప్​కు ఛార్జింగ్​ పెట్టి వాడుతున్నారా.. అయితే విషయాలు తెలుసుకోండి..!

    Follow Us : WhatsappFacebookTwitter

  • Gutti Bendakaya Fry Recipe | “గుత్తి బెండకాయ ఫ్రై” ఇలా ట్రై చేయండి.. వాహ్​ అనాల్సిందే..!

    Gutti Bendakaya Fry Recipe | “గుత్తి బెండకాయ ఫ్రై” ఇలా ట్రై చేయండి.. వాహ్​ అనాల్సిందే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Gutti Bendakaya Fry Recipe | ‘గుత్తొంకాయా గుత్తొంకాయా.. గుంతలకిడి గుమ్మపేరు గుత్తొంకాయ..’ అని పాడుతూ గుత్తి వంకాయ కూరను లొట్టలేసుకుంటూ తినేఉంటారు.. గరంగరం అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే రోజూ తినేదానికంటే నాలుగు మద్దులు ఎక్కువగానే లాగించేస్తారు. అంతలా ఇష్టపడతారు ఎంతో మంది. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే రెసిపీ వంకాయ కూర అనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్​.. మీ కోసం ముద్ద బెండకాయ వంటకాన్ని తీసుకొచ్చాం. దీని టేస్ట్​ చేయాలంటే వాహ్​ అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం.. ముద్ద బెండకాయ వంటకాన్ని తెలుసుకుందాం..

    బెండకాయ వేపుడు (Gutti Bendakaya Fry Recipe) అంటే చిన్నాపెద్దా అందరూ ఇష్టపడతారు. అయితే ఇలా చేసి పెట్టారంటే బెండకాయ అంటే నచ్చనివాళ్లు కూడా వాహ్​ అంటూ లొట్టలేసుకుంటూ ఆరగించేస్తారు. దీనిని చాలా సింపుల్​గా చేసుకోవడంతో పాటు తక్కువ టైంలోని అయిపోతుంది. మరి, ఈ టేస్టీ టేస్టీ గుత్తి బెండకాయ ఫ్రై ప్రిపరేషన్​ చూద్దాం.

    ‌Gutti Bendakaya Fry Recipe | ఫ్రైకి కావాల్సిన పదార్థాలు..

    • బెండకాయలు : పావుకిలో
    • నూనె : రెండు చెంచాలు

    Gutti Bendakaya Fry Recipe | మసాలా కోసం కావాల్సినవి..

    • పల్లీలు – మూడు లేదా నాలుగు చెంచాలు
    • ధనియాల పొడి – ఒక స్పూన్​
    • జీలకర్ర పొడి – ఒక చెంచా
    • పసుపు – పావు స్పూన్​
    • కారం – ఒక చెంచా
    • గరంమసాలా – హాఫ్​ స్పూన్​
    • ఆమ్​చూర్ పొడి – హాఫ్​ స్పూన్​
    • సోంపు పొడి – హాఫ్​ స్పూన్​
    • ఉప్పు – మీ రుచికి తగినంత
    • నూనె – రెండు చెంచాలు

    Gutti Bendakaya Fry Recipe | తయారీ విధానం ఇలా..

    • ‘గుత్తి బెండకాయ ఫ్రై’ కోసం ముందుగా లేత బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి.
    • అనంతరం వాటిని పొడి క్లాత్​తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత బెండకాయల రెండు వైపులా అంచులు తీసేయాలి. అలాగే చాకుతో నిలువుగా గాటు పెట్టుకోవాలి. ఇలా అన్ని బెండకాయలను సిద్ధం చేసిపెట్టుకోవాలి.
    • ఇప్పుడు ఒక చిన్న బాండీ(కడాయి)లో పల్లీలను దోరగా వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి.. మిక్సీ జార్​లో బరకగా, పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి, సోంపు పొడి ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవాలి.
    • ఇక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న పల్లీపొడి, జీలకర్రపొడి, ధనియాల పొడి, కారం, పసుపు, సోంపు పొడి, గరంమసాలా, ఆమ్​చూర్ పౌడర్, రుచికి తగినంత ఉప్పు, ఒకటి లేదా రెండు చెంచాల నూనె వేసి బాగా కలుపుకోవాలి.
    • ఆ త్వరాత పల్లీపొడి మిశ్రమాన్ని చీల్చి పెట్టుకున్న బెండకాయల్లో తగినంత వేసి చక్కగా స్టఫ్ చేసుకోవాలి.
    • ఆపై బెండకాయలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ అన్నివైపులా నూనె రాసి పెట్టుకోవాలి.
    • స్టవ్ మీద పాన్ పెట్టి వేడి అయ్యాక సన్నని సెగ మీద ఉంచాలి. ఆ తర్వాత నూనె రాసిన బెండకాయల్ని స్టఫింగ్ ఉన్న వైపు బాగా వేగనివ్వాలి.
      అన్నివైపులా తిప్పుతూ బాగా వేయించుకోవాలి.
    • స్టఫ్ చేసుకున్న బెండకాయలన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి.

      ఇలా చేసిన వేడివేడి.. టేస్టీటేస్టీ గుత్తి బెండకాయ ఫ్రై ట్రై చేశారంటే వాహ్​ అనాల్సిందే..

    Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

     

  • Bhai Dooj | నేడు భగినీ హస్త భోజనం.. అన్నాచెల్లెలి అనుబంధాల పండుగ.. దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటంటే..?

    Bhai Dooj | నేడు భగినీ హస్త భోజనం.. అన్నాచెల్లెలి అనుబంధాల పండుగ.. దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటంటే..?

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Bhai Dooj | భాయ్​ దూజ్​.. (భగినీ హస్త భోజనం) ఈ పండుగను ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో జరుపుకుంటారు. కార్తీకమాసంలో రెండో రోజు ఈ భాయ్ దూజ్ పండుగను చేసుకుంటారు. దీనిని మన తెలుగువారు యమ విదియ అని కూడా అంటారు. ఈ పండుగ పురాణాల్లో రక్షాబంధన్ అని చెప్పుకోవచ్చు. సోదరసోదరీమణికి సంబంధించిన పండుగ. అయితే ఈ యేడు నేడు (అక్టోబర్ 23న) జరుపుకుంటున్నారు.

    దేశంలోని అతిపెద్ద పండుగలలో భాయ్ దూజ్ కూడా ఒకటి, ఇది దీపావళి అనంతరం రెండు రోజుల తర్వాత, అలాగే గోవర్ధన్ పూజ ఒక రోజు తర్వాత జరుపుకుంటారు. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో భగినీ హస్త భోజనం పండుగగా జరుపుకుంటారు. భగినీ అనగా సోదరి అని అర్థం. అంటే.. ఈ రోజు సోదరి వండి పెట్టే భోజనాన్ని సోదరులు తినాలి అన్నమాట. సోదరులు.. సోదరి ఇంటికి వెళ్లి.. భోజనం చేయడంతో పాటు ఆమెకు ఒక చీర, రవికను బహుకరించాల్సి ఉంటుంది. ఇది వారి మధ్య బంధాన్ని మరింత పెరిగేలా చేస్తుంది. సోదర, సోదరీ బంధం అనేది పుట్టుక నుంచి ఉంటుంది. అది ప్రేమానురాగాలతో నిండిన బంధం. అందుకే ఈ రోజున సోదరుడు సోదరి ఇంట్లో భోజనం చేస్తే.. ఆమె ఎంతో సంతోషిస్తుంది. అంతేకాకుండా.. పురాణాల ప్రకారం ఇద్దరికీ అపమృత్యు దోషాలు ఉండవు అని పండితులు చెబుతున్నారు. ఇందుకు ఒక పురాణ కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం..

    Bhai Dooj | ఈ రోజు ఏం చేయాలంటే..

    మహిళలు ఉదయమే నిద్రలేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు పూజ గదిలో దీపం వెలిగించాలి. విష్ణువు, వినాయకుడికి పూజ చేయాలి. ఈరోజున సోదరుడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. నుదుటున బొట్టు పెట్టి  హారతి ఇవ్వాలి. తన కుడిచేతి ఉంగరం వేలితో సోదరుడికి తిలకం దిద్దాలి. చేతికి రక్షా దారం కట్టి స్వీట్లు తినిపించాలి. అనంతరం సోదరిని దీవించి బహుమతి ఇవ్వడం ఆచారంగా వస్తోంది.

    Bhai Dooj | పురాణ గాథ..

    పూర్వకాలంలో యముడు మార్కండేయుడిని తనతో తీసుకువెళ్లేంఉదకు యమపాశం విసిరాడు. దీనిని తప్పించుకునేందుకు మార్కండేయుడు వెంటనే శివలింగాన్ని ఆలింగనం చేసుకొని.. కాపాడాలని వేడుకున్నాడు. అయితే.. యముడు విసిరిన యమపాశం మార్కండేయుడిని చుట్టుకుంది. ఆ క్రమంలో అది శివలింగాన్ని సైతం చుట్టుకుందట.

    Bhai Dooj | దీంతో కోపోద్రిక్తుడైన శివుడు తన త్రిశూలాన్ని యముడిపైకి వదిలాడు. త్రిశూలం.. వేగంగా యముడివైపు రావడంతో పరుగు మొదలుపెట్టాడు. ఏం చెయ్యాలో తెలియక.. తన సోదరి ఇంటికి వెళ్లాడు. చాలా కాలం తర్వాత అన్నయ్య రావడంతో.. ఆనందపడిన ఆమె.. యముడికి భోజనం పెట్టింది.

    సరిగ్గా అదే సమయంలో.. త్రిశూలం అక్కడికి వచ్చింది. భోజనం చేస్తున్న యముడి జోలికి వెళ్లకుండా ఆగిపోయింది. ఎందుకనగా.. భోజనం తినేవారిని మధ్యలో అంతరాయం కలిగించకూడదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉందని పండితులు చెబుతుంటారు. ఈ కారణంగానే త్రిశూలం.. తిరిగి శివుడిని చేరింది. అప్పటికి శివుడి ఆగ్రహం కాస్త చల్లారడంతో యుముడిని క్షమించి వదిలేశాడు.

    Bhai Dooj
    Bhai Dooj

    త్రిశూలం తిరిగి వెళ్లిపోవడంతో యముడు ఊపిరిపీల్చుకున్నాడు. తన చెల్లి చలవ వల్లే ప్రాణాలు కాపాడుకున్నాను అనుకున్నాడు. ఈ క్రమంలో ‘నా ప్రాణాలు కాపాడావు. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు.’ యముడి సోదరి స్పందిస్తూ నువ్వు ఆరోగ్యంగా ఉండటమే నాకు చాలు సోదరా అని అంది. కానీ యముుడు ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు. దాంతో ఆమె స్పందించి.. ‘నువ్వు ఎలాగైతే.. నా వంట తిని మృత్యువు నుంచి తప్పించుకున్నావో.. అలాగే.. సోదరి పెట్టే భోజనం ఆరగించిన వారిందరికీ అపమృత్యు దోషం లేకుండా కరుణించాలని’ కోరింది. దీంతో యముడు ఆ వరం ఇచ్చాడని పురాణ గాథ.

    గమనిక: Bhai Dooj ఈ కథనం ప్రజల విశ్వాసలతో పాటు సామాజిక మాద్యమాల్లో లభించిన సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చాం. దీనిని విశ్వసించడం అనేది మీ వ్యక్తిగతం.

    Benefits of smile | ఎంత నవ్వితే అంత ఆరోగ్యం.. నవ్వులో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం..!

    Follow Us : WhatsappFacebookTwitter