Penci Sport plugin only working with the Soledad theme.

Telugu News Today - Telugu News Today

Category: Telugu News Today

  • Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!

    Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Mauni Amavasya 2026 | సంవత్సరంలో వచ్చే పన్నెండు అమావాస్యలలో మౌని అమావాస్య అత్యంత పవిత్రమైంది. అంతేకాకుండా మహోన్నతమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఇది మాఘ మాసం కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య. మాఘ అమావాస్య లేదా మాఘి అమావాస్య అనే పేర్లతో దీనిని పిలుస్తారు. ఈ ఏడాది మౌని అమావాస్య రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా సమకూరడంతో ఈ రోజు ఆధ్యాత్మిక మహత్త్వం మరింత ప్రముఖ్యత ఏర్పడింది.

    Mauni Amavasya 2026
    Mauni Amavasya 2026

    పుణ్యస్నానాలు, దానధర్మాలు..

    ఈ Mauni Amavasya 2026 రోజును దానధర్మాలు చేయడంతో పాటు పుణ్య స్నానాలు ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం వస్తుందని భావిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర దివ్య స్నానం ఆచరిస్తారు. కాగా.. 2026లో మౌని అమావాస్య జనవరి 18న రానుంది.

    మౌని అమావాస్య 2026 తేదీ, తిథి మరియు సమయం

    • మౌని అమావాస్య: జనవరి 18, 2026 (ఆదివారం)
    • అమావాస్య తిథి ప్రారంభం: జనవరి 18, 2026 రాత్రి 12:03 గంటల నుంచి..
    • అమావాస్య తిథి ముగింపు: జనవరి 19, 2026 రాత్రి 01:21 గంటల వరకు..

    మాఘ స్నానానికి ఎందుకు అంత ప్రాధాన్యం

    మౌని అమావాస్య రోజున దేవతలు స్వయంగా త్రివేణి సంగమంలో స్నానమాచరించడానికి వస్తారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం ఆదరించడం ద్వారా ఎంతో పుణ్యం కలుగుతుందని భావిస్తారు. మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు. మౌని అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండడం వల్ల ఏర్పడే అద్భుతమైన ఖగోళ సంయోగం మోక్ష ప్రాప్తికి శుభప్రదమని భావిస్తారు.

    జన్మజన్మల పుణ్యఫలం

    ఈ రోజున మౌన వ్రతాన్ని ఆచరించి, భక్తి శ్రద్ధలతో సంగమ నీటిలో స్నానం చేసినవారి పాపాలన్నీ నశించి, పుణ్యఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే పితృ దేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈ రోజు ఎంతో పవిత్రమైందిగా చెబుతారు. దానధర్మాల విషయంలో నువ్వులు, ధాన్యాలు, వస్త్రాలు, గోదానం వంటివి చేయడం ఈ Mauni Amavasya 2026 రోజున ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు.

    ఇది కూడా చదవండి..: Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

    గమనిక : మేం అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్​లో లభించిన సమాచారం ఆధారంగా దీనిని ప్రచురించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగున్యూస్​టుడే వీటిని ధృవీకరించడం లేదు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం.

  • Vande Bharat Sleeper Train | రైల్వే ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ ట్రెయిన్​..

    Vande Bharat Sleeper Train | రైల్వే ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ ట్రెయిన్​..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Vande Bharat Sleeper Train | ప్రయాణికులకు రైల్వే శాఖ నూతన సంవత్సరంలో గుడ్​న్యూస్​ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ ప్రకటించారు. ఈ రైలు సుదూర ప్రయాణాలకు ప్రత్యేకంగా రూపొందించిన ఆధునిక శైలిలో తయారైంది.

    రైల్వే మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper Train) అస్సాం రాష్ట్రంలోని గువాహటి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌరా (కోల్‌కతా) మధ్య నడవనుంది. 20 రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది.

    Vande Bharat Sleeper Train | మరింత సులభతర ప్రయాణం

    వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్​ ఉంది. వీటిలో స్లీపర్ వెర్షన్ రాకతో రాత్రిపూట ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. ఈ రైలు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో గాజు గ్లాసులో నీటిని నింపి ఉంచినా.. అతివేగంలో కూడా అది కదలకుండా స్థిరంగా ఉండడం దాని అత్యాధునిక సాంకేతికతను తెలియజేస్తోంది.

    Vande Bharat Sleeper Train | అత్యాధునిక సౌకర్యాలు

    ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 11 త్రి టైర్​ ఏసీ, 4 టు టైర్​ ఏసీ, ఒక క్లాస్​ ఏసీ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 823 మంది ప్రయాణికులు సాగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అత్యాధునిక సస్పెన్షన్ వ్యవస్థ, ఆటోమేటిక్ తలుపులు, కవచ్ యాంటీ-కొలిజన్ సిస్టమ్, సీసీటీవీ నిఘా వంటి సౌకర్యాలు ప్రయాణికుల భద్రత, సౌలభ్యాన్ని మరింత పెంచుతాయి.

    Vande Bharat Sleeper Train | టికెట్ ధరల వివరాలివే..

    మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని టికెట్ ధరలు నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గువాహటి-హౌరా మధ్య ఒకవైపు ప్రయాణానికి..

    • మూడో శ్రేణి ఏసీ (3AC): సుమారు రూ. 2,300 (భోజనం సహా)
    • రెండో శ్రేణి ఏసీ (2AC): సుమారు రూ. 3,000
    • మొదటి శ్రేణి ఏసీ (1AC): సుమారు రూ. 3,600

    ఇదే మార్గంలో విమాన టికెట్ ధరలు రూ. 6,000 నుంచి రూ. 8,000 వరకు ఉండగా, ఈ రైలు ధరలు సగం కంటే తక్కువగా ఉండడం ప్రత్యేక ఆకర్షణ. రాబోయే నెలల్లో మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది.

  • ChatGPT Images | ఓపెన్ AI నుంచి మేజర్ అప్‌డేట్.. గూగుల్ ‘నానో బనానా ప్రో’కు పోటీగా అత్యాధునిక ఇమేజ్ జనరేషన్..

    ChatGPT Images | ఓపెన్ AI నుంచి మేజర్ అప్‌డేట్.. గూగుల్ ‘నానో బనానా ప్రో’కు పోటీగా అత్యాధునిక ఇమేజ్ జనరేషన్..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: ChatGPT Images: ఓపెన్‌ ఏఐ సంస్థ తన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన చాట్‌జీపీటీ నుంచి కీలక అప్​టేడ్​ వచ్చింది. ఇటీవల కంపెనీ తన ఇమేజ్ జనరేషన్ ఫీచర్ “చాట్‌జీపీటీ ఇమేజెస్”కు గణనీయమైన అప్‌గ్రేడ్‌ను అందించింది. ఈ నూతన సంస్కరణ ఓపెన్‌ఏఐ అత్యంత అభివృద్ధి చెందిన ఇమేజ్ మోడల్ “జీపీటీ ఇమేజ్ 1.5” ఆధారంగా పనిచేస్తుంది. ఈ అప్‌డేట్​తో ఇమేజ్ సృష్టి ప్రక్రియ నాలుగు రెట్లు వేగవంతమవుతోంది. అదే సమయంలో వినియోగదారుల సూచనలను మరింత కచ్చితత్వంతో అనుసరిస్తుంది. ChatGPT Images ఇమేజ్‌లోని ముఖ్యమైన వివరాలను అలాగే ఉంచి కేవలం అవసరమైన భాగాలను మాత్రమే సవరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

    కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. ChatGPT Images, ఈ కొత్త మోడల్ మునుపటి సంస్కరణల కంటే మెరుగైన ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. ఫలితంగా.. వినియోగదారులు ఇచ్చే ప్రాంప్ట్‌లకు బాగా సమీపంగా ఉండే చిత్రాలు ఉత్పత్తి అవుతాయి. ఇది గూగుల్ ‘నానో బనానా ప్రో’ మోడల్‌కు నేరుగా పోటీ ఇవ్వగల స్థాయిలో ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    చాట్‌జీపీటీ ఇమేజెస్ కొత్త అప్‌డేట్ స్పెషాలిటీలు

    జీపీటీ ఇమేజ్ 1.5 మోడల్ పాత ఇమేజ్ జనరేషన్ సిస్టమ్‌ను పూర్తిగా భర్తీ చేస్తుంది. దీని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. వినియోగదారులు కొత్త చిత్రాలు సృష్టించినా లేదా ఇప్పటికే ఉన్న ఫొటోలను సవరించినా.. మోడల్ సూచనలను బాగా అర్థం చేసుకుని కచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా ఎడిటింగ్ సమయంలో లైటింగ్, కంపోజిషన్, వ్యక్తుల రూపు వంటి ముఖ్య అంశాలను మార్చకుండా ఉంచు.. కేవలం మార్పులను మాత్రమే అమలు చేస్తుంది.

    ChatGPT Images
    ChatGPT Images

    ChatGPT Images : ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?

    ముందుగా చాట్‌జీపీటీ యాప్ లేదా వెబ్‌సైట్ (chatgpt.com)ను తెరవాలి. సైడ్‌బార్‌లో కొత్తగా జోడించిన “ఇమేజెస్” ట్యాబ్‌ను గమనించవచ్చు. దీనిపై క్లిక్ చేసి.. “క్రియేట్” ఆప్షన్‌ను ఎంచుకోండి.

    కొత్త ఇమేజ్ సృష్టించడానికి..

    • మీకు కావాల్సిన చిత్రం గురించి వివరంగా ప్రాంప్ట్ టైప్ చేయండి.
    • ఎంటర్ నొక్కండి లేదా సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి.
    • కొత్త ఇంటర్‌ఫేస్‌లో ప్రీసెట్ స్టైల్స్, ఫిల్టర్స్ మరియు ట్రెండింగ్ ప్రాంప్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించి సృజనాత్మకతను సులభంగా అన్వేషించవచ్చు.

    ఇప్పటికే ఉన్న ఇమేజ్‌ను ఎడిట్ చేయడానికి..

    • ఇమేజెస్ సెక్షన్‌లో మీ ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
    • కావాల్సిన మార్పులను ప్రాంప్ట్ రూపంలో రాయాలి. (ఉదా: ఒక వస్తువును జోడించడం, తొలగించడం లేదా స్టైల్ మార్చడం).
    • మోడల్ ఆ మార్పులను అమలు చేసి, మిగతా వివరాలను అలాగే ఉంచుతుంది.
    • అవసరమైతే మరిన్ని మార్పుల కోసం పునరావృత్తి చేయవచ్చు.

    ఓపెన్‌ఏఐ ఈ అప్‌డేట్ ద్వారా ఇమేజ్ సృష్టి, ఎడిటింగ్‌ను మరింత ఆహ్లాదకరంగా, సృజనాత్మకంగా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫీచర్ ఫ్రీ, ప్లస్, ప్రో వంటి అన్ని సబ్‌స్క్రిప్షన్ స్థాయుల వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ మెరుగైన సాంకేతికతతో చాట్‌జీపీటీ ఇమేజెస్ ఇప్పుడు సృజనాత్మక పనులకు మరింత శక్తివంతమైన సాధనంగా మారింది.

    ఇది కూడా చదవండి..: Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్​ రిలీజ్​.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్​ కల్యాణ్​

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • IPL 2026 Mini Auction |ఐపీఎల్ 2026 మినీ వేలం.. అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై భారీ డిమాండ్..

    IPL 2026 Mini Auction |ఐపీఎల్ 2026 మినీ వేలం.. అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై భారీ డిమాండ్..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: IPL 2026 Mini Auction |అబుదాబీలో డిసెంబర్ 16న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీ పోటీ పడ్డాయి. ఈ వేలంలో యువ క్రీడాకారులను ఊహించని ప్రైస్​కు దక్కించుకోవడం విశేషం.

    IPL 2026 Mini Auction : ఐపీఎల్ 2026 మినీ వేలం..

    కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను దక్కించుకునేందుకు లఖ్‌నవ్, ముంబై, రాజస్థాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) రూ.14.20 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. ఇది అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల చరిత్రలో అత్యధిక ధరగా నిలిచింది.

    అదే విధంగా.. రాజస్థాన్ వికెట్‌కీపర్-బ్యాటర్ కార్తిక్ శర్మపై కూడా భారీ బిడ్డింగ్ జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవ్ సూపర్ జయంట్స్ వంటి జట్లు పోటీపడ్డాయి. ఆఖరికి సీఎస్‌కే మరోసారి రూ.14.20 కోట్లతో అతన్ని సొంతం చేసుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లుగా జంట రికార్డు సృష్టించారు.

    మరో అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్..

    IPL 2026 Mini Auction
    IPL 2026 Mini Auction

    IPL 2026 Mini Auction, జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆకిబ్ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు దక్కించుకుంది. ఈ ముగ్గురు యువకులు వేలంలో జాక్‌పాట్ కొట్టడం ద్వారా యువ ప్రతిభకు ఫ్రాంచైజీలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థమవుతోంది.

    గత సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆకట్టుకున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరన వేలంలో మరో హైలైట్‌గా నిలిచాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వచ్చిన అతనిపై మొదట ఢిల్లీ, లఖ్‌నవ్ జట్లు ఆసక్తి చూపాయి. తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ ఎంట్రీ ఇచ్చి రూ.18 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది.

    భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసింది. IPL 2026 Mini Auction, సౌత్ ఆఫ్రికా పేసర్ అన్రిచ్ నార్ట్‌జేను లఖ్‌నవ్ సూపర్ జయంట్స్ రూ.2 కోట్లకు దక్కించుకుంది. ఇక న్యూజిలాండ్ బ్యాటర్ జాకబ్ డఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హోసేన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.2 కోట్లతో సొంతం చేసుకుంది.

    మొత్తంగా ఈ మినీ వేలం యువ ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూ, ఫ్రాంచైజీల వ్యూహాలను ప్రతిబింబిస్తూ ఆకట్టుకున్న వేదికగా మారింది.

    ఇది కూడా చదవండి..: Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్​ రిలీజ్​.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్​ కల్యాణ్​

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Google Translater | గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్​.. హెడ్‌ఫోన్ల ద్వారా రియల్-టైమ్ అనువాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

    Google Translater | గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్​.. హెడ్‌ఫోన్ల ద్వారా రియల్-టైమ్ అనువాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Google Translater | ప్రముఖ సెర్చ్​ ఇంజన్​ గూగుల్.. ఇటీవల తన గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ ఒక కొత్త బీటా ఫీచర్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. ఇది యూజర్లు తమ హెడ్‌ఫోన్ల ద్వారా నిజ సమయంలో అనువాదాలను వినే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఫీచర్ సాధారణ హెడ్‌ఫోన్లను లైవ్ అనువాద సాధనంగా మారుస్తుంది. వివిధ భాషల్లో జరిగే సంభాషణలు, ఉపన్యాసాలు లేదా మీడియా కంటెంట్‌ను సులభంగా అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది.

    ఈ రియల్-టైమ్ అనువాదం మాట్లాడే వ్యక్తి టోన్, లయను కాపాడుతుంది. దీనివల్ల ఎవరు మాట్లాడుతున్నారో, ఏమి చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఫీచర్ 70కి పైగా భాషలకు సపోర్ట్​ చేస్తుంది. ఇది వైర్డు లేదా వైర్‌లెస్ ఏ హెడ్‌ఫోన్లతోనైనా పనిచేస్తుంది.

    ప్రస్తుతం ఈ బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ పరికరాల్లో అమెరికా, మెక్సికో, భారత్​లో అందుబాటులో ఉంది. 2026లో ఐవోఎస్​లోనూ అందుబాటులోకి తేనుంది. అలాగే మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.

    Google Translater | ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం..

      • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌ను తెరవండి.
      • హెడ్‌ఫోన్లను కనెక్ట్ చేయండి.
      • “లైవ్ ట్రాన్స్‌లేట్” ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
      • మూల భాషను, అనువాదించాల్సిన భాషను ఎంచుకోండి.
      • వినడం ప్రారంభించండి – అనువాదిత ఆడియో నేరుగా మీ హెడ్‌ఫోన్లలో వినిపిస్తుంది.

    ఈ ఫీచర్ ప్రత్యక్ష సంభాషణలు, ఉపన్యాసాలు, లెక్చర్లు లేదా ప్రయాణంలో విదేశీ భాషా కంటెంట్‌ ట్రాన్స్​లేషన్​ కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

    Google Translater | జెమినీ ఏఐతో మరింత మెరుగైన ట్రాన్స్​లేషన్​

    గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో జెమినీ ఏఐ సాంకేతికతను అనుసంధానం చేస్తోంది. ఇది మరింత సహజంగా, ఉత్తమ ట్రాన్స్​లేషన్​ను అందిస్తుంది. ముఖ్యంగా స్లాంగ్, ఇడియమ్స్, స్థానిక వ్యక్తీకరణలకు సంబంధించి బాగా పనిచేస్తుంది.

    Google Translater | నిజమైన అర్థం ఇచ్చేలా..

    ఉదాహరణకు.. “స్టీలింగ్ మై థండర్” వంటి ఇంగ్లిష్ ఇడియమ్‌ను అక్షరాలా అనువదించకుండా.. దాని నిజమైన అర్థాన్ని పరిగణనలోకి తీసుకొని ట్రాన్స్​లేట్​ చేస్తుంది. ఈ అప్‌డేట్ అమెరికా, భారత్​లో ఇంగ్లిష్ నుంచి దాదాపు 20 భాషలకు (హిందీ, అరబిక్, జపనీస్, జర్మన్, స్పానిష్, చైనీస్ వంటివి) అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్, వెబ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.

    ఇది కూడా చదవండి.. : Side Effects of Mobile Phones | స్మార్ట్‌ఫోన్లలో బందీ అవుతున్న బాల్యం.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • BB9 Telugu Double Elimination |బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్‌లో డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఆ ఇద్దరేనా..!

    BB9 Telugu Double Elimination |బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్‌లో డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఆ ఇద్దరేనా..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: BB9 Telugu Double Elimination: ఇప్పుడు తుది దశకు చేరింది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే కావడంతో.. ఈ వీకెండ్ ఎలిమినేషన్ ఈ సీజన్‌లో చివరిది కానుంది. హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్ల నుంచి ఎవరు బయటకు వెళ్తారని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారం ప్రకారం.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఈ ట్విస్ట్‌తో ఒక బలమైన కంటెస్టెంట్ కూడా హౌస్‌ను వీడనున్నారని తెలుస్తోంది.

    ప్రస్తుత హౌస్‌లో ఏడుగురు సభ్యులు : BB9 Telugu Double Elimination

    సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్‌లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో సెలబ్రిటీలు, కామన్​ పీపుల్​, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి. గత 13 వారాలుగా సింగిల్, డబుల్ ఎలిమినేషన్లు ఇలా మొత్తం 15 మంది హౌస్‌ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌస్‌లో కల్యాణ్, ఇమ్మాన్యుయెల్, తనూజ, భరణి, సుమన్ శెట్టి, సంజనా, డీమాన్ పవన్ మిగిలారు.

    14వ వారంలో ఆరుగురు నామినేట్

    ఈ వారం నామినేషన్లలో మొదటి ఫైనలిస్ట్‌ కల్యాణ్ మినహా మిగిలిన ఆరుగురు డేంజర్​ జోన్​లో ఉన్నారు. వీరిలో సంజనా, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, తనూజ, సుమన్ శెట్టి, భరణి ఉన్నారు. అయితే ఫినాలే వీక్‌లో సాధారణంగా టాప్ ఐదుగురు మాత్రమే ఉంటారు. కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం.

    అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ : BB9 Telugu Double Elimination

    సోమవారం నుంచి శుక్రవారం వరకు సోషల్ మీడియా, యూట్యూబ్ పోల్స్‌లో తనూజ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, భరణి, సంజనా ఉన్నారు. ఇక సుమన్ శెట్టి అనధికారిక ఓటింగ్‌లో అట్టడుగు స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఆఖరు స్థానాల్లో ఉన్నవారే బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    BB9 Telugu Double Elimination : శనివారం ఒకరు, ఆదివారం మరొకరు!

    తాజా సమాచారం ప్రకారం.. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు. ఆదివారం ఎపిసోడ్‌లో భరణి శంకర్ బయటకు వెళ్తారని బిగ్​బాస్​ వ్యూవర్స్​ చర్చించుకుంటున్నారు. సుమన్ శెట్టి ఎలిమినేషన్ చాలామంది ఊహిస్తున్నారు. కానీ భరణి పేరు తెరపైకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు.

    Akhanda 2 Review |అఖండ 2: తాండవం.. బాలకృష్ణ మరోసారి ‘అఖండ’ విజయం సాధించాడా?

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Machine Guns | భారత్​కు ఇజ్రాయెల్ నుంచి త్వరలో 40 వేల లైట్ మెషిన్ గన్స్..

    Machine Guns | భారత్​కు ఇజ్రాయెల్ నుంచి త్వరలో 40 వేల లైట్ మెషిన్ గన్స్..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Machine Guns | ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (IWI) తమ ఉత్పత్తులైన లైట్ మెషిన్ గన్స్‌ను భారత్‌కు సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలోనే సుమారు 40,000 ఎల్‌ఎంజీల తొలి బ్యాచ్ భారత్ చేరుకునే అవకాశం ఉందని సంస్థ సీఈవో షుకి స్క్వాట్జ్ తెలిపారు. గతేడాది కుదిరిన ఒప్పందం ఆధారంగా ఈ సరఫరా జరగనుంది. కాగా ఇందుకు సంబంధించి అన్ని పరీక్షలు, నాణ్యతా తనిఖీలు పూర్తయ్యాయి. ఉత్పత్తి అనుమతులు కూడా లభించిన నేపథ్యంలో తొలి బ్యాచ్‌ను వచ్చే ఏటి మొదటి త్రైమాసికంలో అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.

    Machine Guns | త్వరలోనే ఒప్పందం

    అదే సమయంలో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ (సీక్యూబీ) కార్బైన్‌ల కొనుగోలుకు సంబంధించిన మరో భారీ ఒప్పందం కూడా ఖరారు దశలో ఉంది. సుమారు 1.70 లక్షల కార్బైన్‌ల సరఫరాకు భారత్ ఫోర్జ్ ప్రధాన భాగస్వామిగా, ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ ద్వితీయ భాగస్వామిగా ఒప్పందం కుదరనుంది. ఈ ఏడాది చివరి నాటికి లేదా 2026 మొదట్లోనే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని సీఈవో ఆశాభావం వ్యక్తం చేశారు.

    Machine Guns | 60 శాతం స్థానికంగా..

    ఈ కార్బైన్‌లలో 60 శాతం భారత్ ఫోర్జ్ ద్వారా స్థానికంగా తయారు చేయనుండగా.. మిగిలిన 40 శాతం (సుమారు 1.70 లక్షలు) అదానీ గ్రూప్‌కు చెందిన పీఎల్‌ఆర్ సిస్టమ్స్ ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. దీంతో పాటు పిస్టల్స్, అసాల్ట్ రైఫిల్స్, ఇతర చిన్న తరహా ఆయుధాలను కేంద్ర హోంశాఖ పరిధిలోని వివిధ బలగాలకు సరఫరా చేయడం కోసం చర్చలు కొనసాగుతున్నట్లు షుకి స్క్వాట్జ్ తెలిపారు.

    Machine Guns | ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ ‘అర్బెల్’

    ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ భారత్‌కు అందించబోయే మరో అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ‘అర్బెల్ టెక్నాలజీ’. ఇది ప్రపంచంలోనే తొలి పూర్తి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్‌గా పరిగణించబడుతోంది. అత్యంత కచ్చితమైన లక్ష్య సాధన, రియల్ టైమ్ బాలిస్టిక్ కాలిక్యులేషన్, అధునాతన సెన్సార్ల సాయంతో యుద్ధక్షేత్రంలో సైనికుల ప్రాణాలను కాపాడేందుకు ఈ సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని సంస్థ పేర్కొంటోంది.

    ఇది కూడా చదవండి..: RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Telangana Panchayat Elections |ఎన్నికల సంగ్రామానికి పల్లెలు సిద్ధం.. నేటి నుంచే తొలిదశ నామినేషన్ల ప్రక్రియ

    Telangana Panchayat Elections |ఎన్నికల సంగ్రామానికి పల్లెలు సిద్ధం.. నేటి నుంచే తొలిదశ నామినేషన్ల ప్రక్రియ

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Telangana Panchayat Elections |తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల జోష్ మొదలైంది. మొదటి దశలో భాగంగా ఈ రోజు (నవంబర్ 27) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 25వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు ఈ రోజు నోటీసులు జారీ చేసి, అభ్యర్థుల నుంచి నామినేషన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

    Telangana Panchayat Elections

    నామినేషన్ కేంద్రాల్లో ఆయా పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాలను ప్రదర్శించనున్నారు. అభ్యర్థులు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

    Telangana Panchayat Elections : ఒక అభ్యర్థి ఒకే వార్డు నుంచి..

    ఒక అభ్యర్థి ఒకే వార్డు నుంచి మాత్రమే పోటీ చేయాలి. నామినేషన్‌తో పాటు నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, ఇతర బాధ్యతలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ సమర్పించాలి. ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, గ్రామ సేవకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అలాగే, ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు కూడా ఇటీవల చట్ట సవరణ ప్రకారం పోటీ చేయవచ్చు.

    Telangana Panchayat Elections : మొదటి దశలో ఎన్ని పంచాయతీలు?

    మొదటి దశలో 189 మండలాల్లోని 4,236 గ్రామ పంచాయతీలలోని మొత్తం 37,450 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల గడువు నవంబర్ 29 సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. 30న నామినేషన్ల పరిశీలన జరిగి, చెల్లుబాటు అయిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై డిసెంబర్ 1న అప్పీళ్లు స్వీకరిస్తారు. అనంతరం డిసెంబర్ 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అధికారిక అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

    పోలింగ్, ఫలితాలు ఒకే రోజు..
    డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై, వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితాలు ప్రకటిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు పూర్తవుతుంది.

    ఎన్నికల ఖర్చు పరిమితి
    2011 జనాభా లెక్కల ప్రకారం 5,000కు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.2.5 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలు మించి ఖర్చు చేయకూడదు. 5 వేలలోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు రూ.1.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ.30 వేలు మాత్రమే ఖర్చు పరిమితిగా నిర్ణయించారు.

    హైదరాబాద్, Telangana Panchayat Elections మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలు మినహా మిగతా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల నియమాల ఉల్లంఘనలపై ఫిర్యాదులు SEC వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్​ పోర్టల్ ద్వారా లేదా 92400 21456 కాల్ సెంటర్‌కు సమర్పించవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. రెండో దశ ప్రక్రియ నవంబర్ 30 నుంచి, మూడో దశ డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది.

    EPFO Passbook | ఈపీఎఫ్ పాస్‌బుక్‌ అప్​డేట్​ కాలేదా.. కారణమిదే..!

    మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Hello UPI | వాయిస్‌తో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. Hello UPI ఫీచర్స్ ఇవే..

    Hello UPI | వాయిస్‌తో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. Hello UPI ఫీచర్స్ ఇవే..

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Hello UPI | ప్రస్తుత కాలంలో మనం ఎక్కడి వెళ్లి ఏది కొనుగోలు చేసినా డిజిటల్​ పేమెంట్స్​ చేస్తున్నాం. యూపీఐ పేమెంట్​ విధానం వచ్చిన తర్వాత డబ్బుల చెల్లింపు చాలా ఈజీ అయ్యింది. ఇక దీనిని మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. అయితే ఇందులో ఉన్న వాయిస్ అసిస్టెంట్​ ఫీచర్​తో మనం పేమెంట్స్​ చేయడం మరింత సులువుగా మారింది. దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

    “హలో యూపీఐ” ఉపయోగాలివే..

    Hello UPI ద్వారా భారతీయ ప్రాంతీయ భాషల్లో పేమెంట్స్‌ చేయవచ్చు. ఈ ఫీచర్​ సీనియర్ సిటిజెన్స్, డిజిటల్ నిరక్షరాస్యులు, దృష్టి లోపం ఉన్నవారికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. అయితే ఇది ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర ప్రాంతీయ భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది.

    ఏ ఫోన్లలో సపోర్ట్ చేస్తుందంటే..

    Hello UPI అనేది ఫీచర్ ఫోన్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్లు రెండింటిలో పనిచేస్తుంది. యూపీఐ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లో UPI కన్వర్సేషనల్ పేమెంట్స్ చేయవచ్చు.

    ఎవరికి బెస్ట్ అంటే..

    పెద్దవాళ్లు: బటన్ నొక్కడం కష్టమా? వాయిస్‌లో చెప్పండి, పని అయిపోతుంది.

    కళ్లు బాగా కనిపించని వాళ్లు: స్క్రీన్ చూడకుండానే ట్రాన్సాక్షన్ పూర్తి.

    గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్లు: ఇంగ్లీష్ రాదా? మీ తల్లిభాషలోనే మాట్లాడండి.

    టైప్ చేయడం ఇష్టం లేని యంగ్‌స్టర్స్: “హలో UPI, రమేష్‌కి 500 పంపు” అనండి – అంతే!

    ఎందులో ఎలా పనిచేస్తుందంటే..

    స్మార్ట్‌ఫోన్: PhonePe, Google Pay, Paytm – ఏ యాప్ అయినా

    బటన్ ఫోన్: ఫీచర్ ఫోన్‌లో కూడా వాయిస్ పేమెంట్

    కాల్ చేసి: IVR మెనూ విని నంబర్ నొక్కి

    స్మార్ట్ గాడ్జెట్స్: స్పీకర్, టీవీ, ఫ్రిజ్ – రేపటి నుంచి!

    ఎలా పనిచేస్తుంది?

    యాప్ ఓపెన్ చేయండి → “హలో UPI” అని పలకండి.

    వాయిస్ అసిస్టెంట్ మీతో మాట్లాడుతుంది – “ఎంత పంపాలి? ఎవరికి?”

    UPI పిన్ చెప్పండి (లేదా నొక్కండి).

    గమనిక: భద్రత కోసం UPI పిన్ ఇప్పటికీ అవసరమే. వాయిస్‌లో చెప్పినా, టైప్ చేసినా – రెండూ సేఫ్.

    Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

  • Snoring in Sleep |నిద్రలో గురక పెడుతున్నారా.. ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. అవెంటో తెలుసుకోండి..!

    Snoring in Sleep |నిద్రలో గురక పెడుతున్నారా.. ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. అవెంటో తెలుసుకోండి..!

    తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు గురక వస్తోందా..? అది సాధారణ సమస్యనే అనుకుంటున్నారా? కానీ.. రోజూ గురకపెడుతున్నట్లయితే మీకు ఇబ్బందులు పొంచి ఉన్నాయనే సిగ్నల్​గా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్నియాను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, హైపర్‌టెన్షన్, స్ట్రోక్ వంటి ముప్పుల తప్పించుకోవచ్చంటున్నారు.

    Snoring in Sleep |స్లీప్ అప్నియా ఎందుకు పెరుగుతోంది?

    స్లీప్ అప్నియా (Snoring in Sleep) అనేది నిద్రలో శ్వాస చాలాసార్లు ఆగిపోయి, తిరిగి ప్రారంభమయ్యే సాధారణమైన పరిస్థితి. ఇది శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. గురక, ఉదయం తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉండవచ్చు, అయితే చికిత్స చేయించుకోకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    ఈ మధ్య కాలంలో స్లీప్ అప్నియా గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇది వృద్ధుల్లోనే కాకుండా యువతలోనూ సర్వసాధారణంగా మారుతోంది. డెస్క్ జాబ్స్, లేట్ నైట్ స్క్రీన్ టైం, వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ లాంటి పెరుగుతున్నాయి. హార్ట్​ స్ట్రోక్ వచ్చిన 50-70 శాతంలో మందిలో స్లీప్ అప్నియా ఉంటుందని అంటున్నారు. యువకుల్లో కూడా రీకరెంట్ స్ట్రోక్స్ వస్తున్నాయట. అయితే లైఫ్‌స్టైల్ మార్చుకోకపోతే ఇది మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందంటున్నారు.

    Snoring in Sleep ఏం జరుగుతుందంటే..!

    స్లీప్ అప్నియా వల్ల నిద్రలో మీ ఎయిర్‌వే రిపీటెడ్‌గా బ్లాక్ అవుతూ ఉంటుంది. రాత్రంతా అనేక సార్లు ఇలా జరగడం వల్ల మెదడు, శరీరానికి ఆక్సిజన్ అందదు. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ వెసెల్స్ డ్యామేజ్ అవుతాయి. అయితే ఇది సైలెంట్‌గా స్ట్రోక్, హార్ట్ డిసీజ్‌లకు దారి తీస్తుందట.

    Snoring in Sleep లక్షణాలు ఇవే..

    చాలా మంది ఏళ్ల తరబడి స్లీప్​ అప్నియా లక్షణాలు గమనించరు. గురక వచ్చేవారు, నిద్రలో గ్యాస్పింగ్ లేదా చోకింగ్ ఫీలింగ్, రోజంతా టైర్డ్‌నెస్, మార్నింగ్ హెడేక్, డ్రై మౌత్, ఏకాగ్రత లేకపోవడం, మూడ్ స్వింగ్స్ లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి ఎదురైనట్లయితే సంబంధిత వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

    గురక తగ్గడానికి ఏం చేయాలంటే..

    గురక తగ్గాలంటే జీవనశైలి మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రెగ్యులర్​గా వ్యాయామం చేయాలి. బెడ్​టైంకు ముందు ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అలాగే రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్, అలాగే ఒకవైపు పడుకోవడం లాంటివి చేయాలి. వీటి వల్ల మార్పు వస్తే ఒకే. లేదంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

    గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని ఇచ్చాం. వీటిని పాటించే ముందు మీరు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

    ఇది కూడా చదవండి..: Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్

    మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai