తెలుగు న్యూస్‌టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Self Driving auto | డ్రైవర్ లేని ఆటో.. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా.. టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. పెరుగుతున్న సాంకేతిక కొత్త ఆవిష్కరణకు నాంది పలుకుతోంది. మన దేశానికి చెందిన ఓ ప్రముఖ త్రీవీలర్ ఆటో మొబైల్ సంస్థ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఆటోను రూపొందించింది. దాని విశేషాలు తెలుసుకుందాం పదండి..
Self Driving auto | అధునాతన ఫీచర్స్‌ను ఉపయోగించి..
ఓమెగా సీకి మొబిలిటీ (Omega Seiki Mobility) అనే సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ ఆటోను ఇటీవల ఆవిష్కరించింది. అయితే మనది జనాభా ఎక్కువ గల దేశం. అంతేకాకుండా విపరీతమైన ట్రాఫిక్‌లో ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. దీనిని దృష్టిలో ఉంచుకునే సదరు కంపెనీ ఈ త్రీ వీలర్‌ను తయారు చేసింది. దేశంలోని అధిక జనసాంద్రత, లో స్పీడ్ ట్రాఫిక్‌కు అనుకూలంగా దీనీని రూపొందించారు. లిడార్, జీపీఎస్, ఏఐ ఆధారిత నావిగేషన్ (Navigation) వంటి ఆధునిక సాంకేతికతలతో తయారు చేయడం వలన సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. కాగా.. వీటిని త్వరలో ప్రయాణికుల వేరియంట్, రవాణా వేరియంట్లను మార్కెట్లో తీసుకురానున్నారు.
Self Driving auto | ఈ ఆటో ఫీచర్స్ ఇవే..
ఒమేగా సీకి సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇందులో ఒకటి ప్యాసింజర్ వెర్షన్ కాగా.. మరోటి కార్గో వెర్షన్. పాసింజర్‌ను మనషుల ప్రయాణానికి తగినట్లుగా తయారు చేశారు. ఇక కార్గో వెర్షన్ గూడ్స్ ట్రాన్స్ పోర్టేషన్ కోసం తగినట్లుగా డిజైన్ చేశారు. ఈ ఆటో 10.3 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఏఐ బేస్డ్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో ఈ త్రీవీలర్ నడవనుంది. ఇందులో మల్టీ సెన్సార్ నావిగేషన్‌తో పాటు రిమోట్ సేఫ్టీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ముందుగా మీరు ఒక లొకేషన్ సెట్ చేస్తే.. అది ఆటోమెటిక్‌గా, సేఫ్‌గా తన రూట్ ఎంచుకుని గమ్యాన్ని చేరుకుంటుంది.
ఈ సెల్ఫ్ డ్రైవింగ్ త్రీవీలర్ (Self driving auto) అనేది దేశ రవాణా రంగంలో కీలక ముందుడుగా మారుంతుందని చెప్పవచ్చు. దేశంలో అనేక మంది తక్కువ ఛార్జీలతో గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆటోలకు ప్రాధాన్యతనిస్తారనేది మనకు తెలిసిందే. అయితే త్వరలో అందుబాటులోకి రానున్న ఈ డ్రైవర్ లేని ఆటోలు ఎంత వరకు సక్సెస్ అవుతాయనేది ఆసక్తికరమైన అంశం. కాగా.. ‘మేము ప్రజలకు సేవ చేసే టెక్నాలజీని అందిస్తున్నాం’ అని కంపెనీ ఛైర్మన్ ఉదయ్ నారంగ్ చెప్పుకొచ్చారు.
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!