తెలుగు న్యూస్‌టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Sir Creek | కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకు అంత సీరియస్‌గా హెచ్చరికలు చేశారు. అసలు సర్ క్రీక్ వివాదం ఏమిటో తెలుసుకుందాం..
పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ – పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు తలెత్తిన అందరికీ తెలిసిన విషయమే. పాక్ టెర్రరిస్టులు పహల్గామ్లో ఉగ్రదాడికి (Pahalgam terror attack) పాల్పడి మన వాళ్లను పొట్టన పొట్టుకున్నారు. దీంతో భారత్ దూర్తదేశానికి ఆపరేషన్ సింధూర్ (Operation sindoor) పేరిట తగిన గుణపాఠం చెప్పింది. భారత్ దాడులు తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణకు బతిమిలాడుకోవడం మనందరికీ విదితమే. కానీ కుక్కతోక వంక అన్నట్లు.. ఆ దేశం బుద్ధి మారడం లేదు. ఏమైందనుకుంటున్నారా.. భారత్‌తో మళ్లీ గుల్లికజ్జాలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Sir Creek | తెరపైకి ‘సర్ క్రీక్’ వివాదం
భారత్-పాకిస్తాన్ మధ్య తాజాగా ‘సర్ క్రీక్ ’ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతంలో పాక్ తన సైనిక మౌలిక సదుపాయాలను పెంచుతోంది. సర్ క్రీక్ ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇటీవల పాకిస్తాన్.. బంకర్లు, రాడార్లు, డ్రోన్లను, పదాతిదళ కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల క్రితం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defense Minister Rajnath Singh), మన ఆర్మీ చీఫ్ ద్వివేది పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సర్ క్రీక్‌లోని భారత్‌కు చెందిన భాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారుతాయని హెచ్చరించారు. కరాచీకి వెళ్లే ఒక మార్గం సర్ క్రీక్ ద్వారా వెళ్తుందనే విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇక ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సర్ క్రీక్‌ను ఇంచు ఆక్రమించినా పాకిస్తాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు.
Sir Creek | అసలేమిటీ వివాదం..
‘సర్ క్రీక్’ గుజరాత్ రాష్ట్రంలోని రాన్ ఆఫ్ కచ్ (Rann of Kutch) చిత్తడి నేలలో 96 కి.మీ. ఒక నీటి స్ట్రిప్. ఇది భారతదేశం – పాక్ మధ్య వివాదాస్పద ప్రాంతం. ఈ క్రీక్ భారతదేశంలోని కచ్ ప్రాంతాన్ని, పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌ను వేరు చేస్తుంది. వలస రాజ్యాల సమయంలో బ్రిటిష్ అధికారి పేరు మీద సర్ క్రీక్ అని పేరు పెట్టారు. రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దు రేఖ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ ప్రాంతం బాంబే ప్రెసిడెన్సీలో ఉండేది. 1947లో విభజన అనంతరం కచ్ భారత్‌తో ఉండగా, సింధ్ పాకిస్తాన్‌కు దక్కింది. 1914లో కచ్ రావు సింధ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం మధ్య సంతకం చేయబడిన బాంబే ప్రభుత్వ తీర్మానం ప్రకారం.. పాకిస్తాన్ ఈ క్రీక్ తన భూభాగంగా చెబుతోంది. అయితే భారతదేశం అంతర్జాతీయ చట్టంలోని థాల్వెగ్ నియమం ప్రకారం.. భారతదేశం సరిహద్దు కాలువ మధ్యలో ఉండాలని, అంటే క్రీక్‌లో సగం తమకు చెందాలని వాదిస్తోంది.
Sir Creek | ఈ ప్రాంతం ఎందుకు ముఖ్యమైందంటే..
సర్ క్రీక్ ప్రాంతం (Sir Creek) ఎంతో వ్యూహాత్మకమైంది. 1965 యుద్ధంలో రాన్ ఆఫ్ కచ్‌లో భారత్, పాక్ దళాలు ఘర్షణ పడ్డాయి. అలాగే మత్స్యకార ప్రదేశం. ఆసియాలోనే అతిపెద్ద మత్స్యకార వనరుల్లో ఇదీ ఒకటి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో సముద్రం కింద చమురు మరియు గ్యాస్ నిల్వలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాంతం ఎంతో కీలమైంది.
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!