Gmail account | మీ జీమెయిల్ ఖాతా హ్యాక్ అయిందా..? అయితే వెంటనే ఇలా చేయండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Gmail account | నేటి యుగంలో ప్రతిఒక్కరి ఫోన్​తో పాటు ల్యాప్​టాప్​, టాబ్​, కంప్యూటర్​లో జీమెయిల్​ కచ్చితంగా ఉంటుంది. అయితే దీనిని సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ జీమెయిల్ ఖాతా (Gmail account) అనుకోకుండా ఏదైనా అపరిచిత డివైస్‌లో లాగిన్‌ అయితే.. మీ ఫోన్ రిమోట్‌గా యాక్సెస్ చేసే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ యాప్‌ల సమాచారం వరకు ఇతరుల చేతుల్లో వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అయితే మీ జీమెయిల్ అకౌంట్​ ఎక్కడెక్కడ లాగిన్ అయి ఉందో తెలుసుకోవాలంటే.. ఈ సులభమైన స్టెప్స్​ ఫాలో అవండి..

Gmail account | లాగిన్ అయిన డివైస్‌లను తనిఖీ చేయండి..

  • మీ పీసీ లేదా మొబైల్​ బ్రౌజర్‌లోకి వెళ్లి ‘myaccount.google.com’లోకి వెళ్లండి.
  • అనంతరం అందులోని ‘Security’ ఆప్షన్‌లోకి వెళ్లి.. కిందికి స్క్రోల్ చేయండి.
  • ఆ తర్వాత ‘Your Devices’ ట్యాబ్‌లోకి వెళ్లి.. ‘Manage All Devices’పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీరు మీ జీమెయిల్ ఖాతాతో లాగిన్ అయిన అన్ని డివైస్‌లను చెక్​ చేయవచ్చు.
  • ఒకవేళ ఈ జాబితాలో మీకు తెలియని డివైస్ ఏదైనా కనిపించినట్లయితే దానిపై క్లిక్ చేసి వెంటనే ‘Sign out’ ఆప్షన్​ను ఎంచుకోండి.
  • అనంతరం.. వెంటనే మీ జీమెయిల్ పాస్‌వర్డ్‌ను మార్చుకోండి.

Gmail account | అకౌంట్​ యాక్టివిటీని పరిశీలించండి..

  • ఇందుకోసం మీ క్యంపూటర్​లోని మీ జీమెయిల్ ఖాతాలో లాగిన్ చేయండి.
  • అనంతరం మీ జీమెయిల్ జాబితాకు వెళ్లి.. పూర్తిగా కిందికి స్క్రోల్ చేయండి. అందులోని ‘Details’ ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • దీంతో నూతన విండో ఓపెన్​ అవుతుంది. ఇందులో యాక్సెస్ రకం, ఐపీ అడ్రస్, ఇతర వివరాలు కనిపిస్తాయి.
  • మీ జీమెయిల్ ఖాతాలో ఏవైనా అనుమానాస్పదమైనవి కనిపించినట్లయితే.. వెంటనే మీ జీమెయిల్ పాస్‌వర్డ్‌ను మార్చేసుకి మీ ఖాతాను సురక్షితం చేసుకోండి.

Gmail account | థర్డ్-పార్టీ యాప్​లను సైతం..

  • మీ జీమెయిల్ ఖాతా ఏదైనా థర్డ్-పార్టీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో దుర్వినియోగం అవుతుందో లేదో చెక్​ చేసుకోండి.
  • దీనికోసం ముందుగా, మీ కంప్యూటర్​, టాబ్​ లేదా మొబైల్ బ్రౌజర్‌లో ‘myaccount.google.com’ను తెరవండి.
  • అనంతరం ‘Security’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి.. ‘Signing in to other sites’ విభాగంలోకి వెళ్లండి.
  • అప్పడు ‘Signing in with Google’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఈ పేజీలో మీరు మీ జీమెయిల్‌తో లాగిన్ చేసిన యాప్‌లు, వెబ్‌సైట్లను తీసివేయవచ్చు. ఒకవేళ మీకు తెలియని, అనుమానాస్పదమైన వెబ్‌సైట్‌లు, యాప్‌లు కనిపించినట్లయితే వాటి యాక్సెస్‌ను వెంటనే ఆపేయండి.

మీ జీమెయిల్ అకౌంట్​ను భద్రతంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ సులభమైన స్టెప్స్​ అనుసరించడం ద్వారా, మీ ఖాతా ఎక్కడ లాగిన్ అయి ఉందో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అనధికార యాక్సెస్‌ను నివారించుకోవచ్చు. ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే, వెంటనే వాటిని నిరోధించి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. Securing your Gmail account is crucial. By following these easy steps, you can check your account’s login history and block any unauthorized access, ensuring your personal information remains safe.

Read also : epfo | పీఎఫ్​ ఖాతాదారులకు (Epfo) శుభవార్త.. ఇక నుంచి వందశాతం విత్​డ్రా చేసుకునే ఛాన్స్​..!

Related posts

BSNL New Offers Plans 2026: బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన నయా ఆఫర్​ ప్లాన్స్​.. ప్రయోజనాలు తెలుసుకోండి..!

Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్.. డిజైన్, విశేషాలివే.. విడుదల ఎప్పుడంటే..!