Guava leaves benefits | ఆన్​లైన్​లో జామ ఆకుల​ అమ్మకం.. ధరెంతో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే..!

ఇటీవల కాలంలో వేప ఆకులు, వేప కాయలు, మామిడి ఆకులు, జామ ఆకులు సైతం విక్రయిస్తున్నారు. అయితే ఇందులో జామ ఆకుల ధరలు చూస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే.

by Harsha Vardhan
0 comments
Guava leaves benefits

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్​​: Guava leaves benefits‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం’ అన్నారు శ్రీశ్రీ ఒకనాడు.. కానీ నేడు ‘జామ ఆకు.. మామిడి ఆకు.. వేప ఆకు.. కాదేదీ అమ్మకానికనర్హం’ అన్నట్లు మారిపోయింది ఆన్​లైన్ బిజినెస్​. గుండు పిన్ను నుంచి మొదలు బైకులు, కార్ల వరకు అన్నీ ఆన్​లైన్​లో అమ్మేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఇటీవల కాలంలో వేప ఆకులు, వేప కాయలు, మామిడి ఆకులు, జామ ఆకులు సైతం విక్రయిస్తున్నారు. అయితే ఇందులో జామ ఆకుల ధరలు చూస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే. మనం కూడా ఆన్​లైన్​లో విక్రయించేద్దాం అని అనిపిస్తుంది.

‌జామ చెట్టు.. ఒకప్పుడు ప్రతి ఒక్కరి పెరట్లో ఉండేది. రానురాను వీటి సంఖ్య తగ్గుతోంది. పల్లెల్లో ఇప్పటికీ వీధి ఐదారు చెట్లున్నా.. సిటీల్లో మాత్రం వీటి సంఖ్య తగ్గిపోతోంది. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ప్రతి ఇంట్లో ఈ చెట్టు తప్పనిసరిగా ఉండేది. ఖాళీ సమయాల్లో తెంపుకుని తినేది. కానీ కాలమారుతున్న కొద్దీ చెట్లు తగ్గిపోవడంతో కొనుక్కుని తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ప్రస్తుతమైతే జామ ఆకులు సైతం ఆన్​లైన్​లో విక్రయిస్తున్నారు.

Guava leaves benefits | వీటి ధర చూస్తే షాకే..

చిన్నతనంలో లేత జామ ఆకులో చింతపండు, కాస్త ఉప్పు కలిపి తింటే ఆ రుచి అమోఘంగా ఉండేది. టేస్ట్​ సూపర్​గా ఉండడమే కాదు.. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిలోని ప్రయోజనాలను గుర్తించి కార్పొరేట్​ సంస్థలు.. జామ ఆకులను ఆన్​లైన్​లో విక్రయిస్తున్నాయి. పచ్చి ఆకులతో పాటు ఎండిన ఆకులు, ఆకులతో చేసిన పౌండర్​ను సైతం అమ్ముతున్నారు. ఎండిన ఆకులైతే 50 గ్రాములకు రూ. 120 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు. అంటే కిలోకు రూ. 1200 నుంచి రూ. 3వేలకు అమ్ముతున్నారన్న మాట. ఇక పౌడర్​ను కూడా ఇదే ధరల్లో లభ్యమవుతోంది.

Guava leaves benefits

Guava leaves benefits | జామ ఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలు..

జామ ఆకులను కొనుగోలు చేసి ఏం చేస్తారని అనుకుంటున్నారు.. వీటితో టీ తయారుచేస్తారని మీకు తెలుసా. జామ కాయలతో పాటు ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో విటమిన్ c, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. అందుకే వీటికి డిమాండ్​ పెరుగుతోంది. పచ్చి జామ ఆకులతో కొందరు రసం చేసుకుని తాగుతారు. మరికొందరు ఎండిన ఆకులతో టీ చేసుకుని ఆస్వాదిస్తుంటారు. ఎలా తీసుకున్నా వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Guava leaves benefits | బ్లడ్ షుగర్‌ కంట్రోల్..

జామ ఆకుల రసం తాగితే.. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమపద్ధతికి చేరతాయి. డయాబెటిస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే మంచిదట. దీనివల్ల దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటాయంటున్నారు నిపుణులు. నాలుగు జామ ఆకుల్ని నీటిలో వేసి పది నిమిషాలు ఉడికించి.. ఆ నీటిని తాగేయడమే.

‌Guava leaves benefits | గుండె ఆరోగ్యానికి మేలు

జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు.. గుండెకు మేలు చేయడంలో ఉపయోగపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Guava leaves benefits | జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

జామకాయలు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. వీటి ఎంత తింటే అంతగా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఒక జామకాయ.. మన రోజువారీ అవసరమయ్యే ఫైబర్‌‌లో 12 శాతం ఇస్తుందట. జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపర్చడంలో దోహదం చేస్తుంది. అంతేకాకుండా డయేరియా(విరేచనాలు)కు చెక్ పెడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Guava leaves benefits | విటమిన్​ సీ పుష్కలం

జామకాయలు, ఆకుల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో దోహదం చేస్తుంది. ఓ ఆరెంజ్ తినడం వల్ల వచ్చే సీ విటమిన్ కన్నా.. రెట్టింపు విటమిన్ జామకాయను తినడం ద్వారా వస్తుంది. అలాగే మనకు వేడి చేసినప్పుడు విటమిన్ సీ బాడీలో నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఈ సమయంలో జామకాయలు తినడం వల్ల తిరిగి తెచ్చుకోవచ్చు. జామ కాయలు, జామ ఆకులతో ఉండే ఉపయోగం తెలిసింది కాదా.. నిత్యం జీవితంలో వీటిని భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..

గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం (Health tips) మాకు తెలిసిన విషయాలతో మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. వీటిని పాటించే ముందుకు మీ వ్యక్తిగత వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోని పాటించండి.

Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

Follow Us : WhatsappFacebookTwitter

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

Leave a Comment

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00