Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​​: Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివని మనకు తెలిసిందే. దీంతో ఆరోగ్యమే కాదు.. సౌందర్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఎన్నో పోషకాలు ఉండే ఈ గింజల్ని తీసుకోవడం వల్ల అనే లాభాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, బాడీ డీటాక్స్ చేయాలన్నా.. ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఆరోగ్యంతో పాటు అందానికి దోహదం చేసే సబ్జా గింజల గురించి తెలుసుకుందాం..

సబ్జా గింజలు (Sabja Seeds) పోషకాలతో కూడిన సూపర్‌ఫుడ్. వీటిని ఎన్నో రకాల మెడిసిన్, వంటల్లో సైతం వాడుతుంటారు. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఐరన్​, మెగ్నీషియం, కాల్షియం, వంటి ఖనిజాలతో పాటు ఇతర సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవి పేగు కదలికలను పెంచుతాయి. అంతేకాకుండా ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. వీటిని పరగడుపున తీసుకుంటే ఇంకా మంచిది. ఈ గింజలలో ఉండే సహజమైన డీటాక్స్ గుణాలు.. చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుందంటున్నారు.

Sabja Seeds Benefits | డీటాక్సిఫికేషన్..

సాధారణంగా వాహనాల నుంచి వెలువడే పొగ, కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల చర్మం కాంతిని కోల్పోతుంది. అంతేకాకుండా మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేయాలంటే సబ్జా గింజలు సరైన ఎంపిక అని అంటున్నారు. ఈ గింజల్లో ఉండే డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయని పేర్కొంటున్నారు. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది.

Sabja Seeds Benefits | చర్మం కాంతివంతంగా..

సబ్జా గింజల్లో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు దోహదం చేస్తుంది. అంతే కాకుండా ఈ గింజల్లో విటమిన్ ఏ, సీ, కాపర్, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి మనలో చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.

Sabja Seeds Benefits | ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేలా..

కొంతమందికి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తే అంత త్వరగా తగ్గవు. అలాంటి వారు రెగ్యులర్​గా సబ్జా గింజలను తీసుకోవడం మంచిదట. ఇందులోని యాంటీ బయోటిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయని ఓ అధ్యయనంలో తేలింది.

గమనిక: మేం అందించిన ఈ సమాచారం కేవలం సాధారణ సలహా కోసమే. ఆహార మార్పులు లేదా సప్లిమెంట్లను ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి.

Benefits of smile | ఎంత నవ్వితే అంత ఆరోగ్యం.. నవ్వులో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం..!

Related posts

Constant Fatigue Reasons: రోజంతా నీరసంగా ఉంటుందా.. ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు..

Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!