Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్.. డిజైన్, విశేషాలివే.. విడుదల ఎప్పుడంటే..!

సామ్‌సంగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన గెలాక్సీ S26ను త్వరలో భారత మార్కెట్‌లో లాంఛ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

by Harsha Vardhan
0 comments
Samsung Galaxy S26 Series

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన గెలాక్సీ S26ను త్వరలో భారత మార్కెట్‌లో లాంఛ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా అనే మూడు మోడల్స్ ఉండనున్నాయి.

Samsung Galaxy S26 Series-1

Samsung Galaxy S26 Series

వీటిలో ప్రాథమిక మోడల్​ గెలాక్సీ S26 ధరకు తగినట్టుగా ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది. ఇటీవల బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అధునాతన ట్రిపుల్ కెమెరా వ్యవస్థ వంటి అంశాలు ఉండవచ్చని సమాచారం. ఈ మోడల్ గురించి వివరాలను తెలుసుకుందాం..

Samsung Galaxy S26 Series | కెమెరా, సాంకేతిక లక్షణాలు

గెలాక్సీ S26లో అధునాతన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం కలిగిన 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చని తెలుస్తోంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించే అవకాశం ఉంది.

Samsung Galaxy S26 Series-2

Samsung Galaxy S26 Series

సాంకేతిక లక్షణాల విషయానికొస్తే.. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. దీనికి 8 GB RAM మరియు 256 GB అంతర్గత నిల్వ సామర్థ్యం జతకలిసి ఉండవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత సామ్‌సంగ్ వన్ UI 8.5 ఇంటర్‌ఫేస్‌తో రానుంది. డిస్‌ప్లే విషయంలో 6.3 అంగుళాల QHD రిజల్యూషన్ OLED స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 2600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయి ఉండవచ్చు.

Samsung Galaxy S26 Series | మెటల్ ఫ్రేమ్‌తో..

డిజైన్ పరంగా గెలాక్సీ S26 ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్‌తో మరింత సన్నని బాడీని కలిగి ఉంటుంది. ఇది గతంలో వచ్చిన వాటికి ఈ మోడల్‌కు భిన్నంగా మరింత ఆధునికంగా కనిపించవచ్చు. రంగుల విషయంలో తెలుపు, నలుపు, నీలం ఆప్షన్లతో పాటు ఆరెంజ్ షేడ్ రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy S26 Series | భారత్​లో ఎప్పుడు విడుదల కానుందంటే..

సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ మొత్తం గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్​ ఫిబ్రవరి 25న అమెరికాలో జరగనుందని తెలుస్తోంది. భారత మార్కెట్‌లో గెలాక్సీ S26 ప్రారంభ ధర సుమారు రూ. 80,999గా ఉండవచ్చని నిపుణులు అంచనా చేస్తున్నారు.

అయితే ఈ మోడల్​కు సంబంధించిన వివరాలు ప్రచారంలో ఉన్నాయి. అధికారికంగా విడుదలైన తర్వాత మార్పులు రావచ్చు. కాగా.. సామ్‌సంగ్ అభిమానులు ఈ కొత్త సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది చదవండి..: change gmail address | ఇక జీమెయిల్ అడ్రస్​ను కూడా సులభంగా మార్చుకోవచ్చు.. మీ డేటాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండానే..!

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

Leave a Comment

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00