తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: మనం ఇష్టంగా కొనుకున్న షర్టు కొద్ది రోజుల్లోని కలర్ మారిపోయిందా.. మీకు నచ్చిన ప్యాంటు త్వరగా చిరిగిపోయిందా.. బ్రాండెడ్‌వి కొన్నా ఇలా ఎందుకు జరిగిందో మీకు అర్థంకావడం లేదా.. ఇందుకు కారణం ఉంది. మనం దుస్తుల తీరును సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉతకడం, ఐరన్ చేయడం, బ్లీచ్ వేయడం, వాషింగ్ మెషీన్లో వేయడం వల్ల ఇలా జరుగుతుంది. Laundry Symbols Explained దుస్తుల తీరును బట్టి మనం ఉతకడం, ఐరన్ చేయడం లాంటి చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో దుస్తులు భద్రంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందామా..
Laundry Symbols Explained దుస్తులపై ఉండే గుర్తులు కీలకం..
కొత్త దుస్తులను వేసుకునే ముందు వాటిపై ఉండే ట్యాగ్‌లను పరిశీలించాలి. ఇవి సాధారణంగా కాలర్ లేదా లోపలి భాగంలో ఉంటాయి. వీటిపై కొన్ని చిన్న గుర్తులు, ప్రత్యేక చిహ్నాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని బట్టి మనం వాషింగ్, బ్లీచింగ్, ఐరన్ చేయాలని సూచిస్తున్నారు.
O సర్కిల్ గుర్తు ఉంటే..
కోట్లతో పాటు కొన్ని ప్రత్యేక దుస్తులను మామూలు నీటితో ఉతికితే పాడవుతాయి. అయితే వీటిని డ్రై క్లీన్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దుస్తుల ట్యాగ్‌పై సర్కిల్ గుర్తు ఉన్నట్లయితే డ్రైక్లీన్ చేయాలని అర్థం. ఒకవేళ ఇంటూ గుర్తు ఉన్నట్లయితే డ్రైక్లీన్ చేయాల్సిన పనిలేదు.
🧺 బకెట్ చిహ్నం ఉంటే..
సున్నితమైన దుస్తులను వాషింగ్మెషీన్లో వేయడం వల్ల త్వరగా దెబ్బతింటాయి. ఇలాంటి కేటగిరీలోకి సిల్క్, ఉన్ని, కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్తోఓ తయారైనవి వస్తాయి. అయితే దుస్తుల ట్యాగ్‌పై ఒక చెయ్యిన నీటితో ఉన్న బకెట్లో ఉంచినట్లు కనిపించినట్లయితే దానిని చేతితోనే శుభ్రం చేయాలని అర్థం చేసుకోవాలి.
🔥ఐరన్ బాక్స్.. Laundry Symbols Explained
దుస్తులను ఇస్త్రీ చేసే సమయంలో తగిన ఉష్ణోగ్రత చేసుకోవాలి. కొన్ని రకాల దుస్తులు ఎక్కువ వేడిని తట్టుకోవు. దీనికి సూచనగా ట్యాగ్‌పై ఇనుపగుర్తు చుక్కలు ఉంటాయి. మూడు డాట్స్ ఉంటే కొంచెం ఎక్కువ వేడితో ఐరన్ చేయాలని అర్థం. ఒక డాట్ ఉంటే తక్కువ వేడితో చేయాల్సి ఉంటుంది.
🔺 త్రిభుజం మార్క్ ఉన్నట్లయితే..
త్రిభుజం గుర్తు బ్లీచింగ్ వినియోగించాలా? వద్దా? అనే విషయాన్ని తెలుపుతుంది. ఖాళీ త్రిభుజం గుర్తు కనిపిస్తే బ్లీచింగ్‌ను వాడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ త్రిభుజంలో ఇంటూ గుర్తు ఉన్నట్లయితే బ్లీచింగ్ వాడొద్దని అర్థం. త్రిభుజం లోపల రేఖలు ఉంటే కొన్నిసార్లు వాడవచ్చు.. కానీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.
□ చతురస్రాకారం..
చతురస్రాకారం గుర్తు లోపల వృత్తం ఉన్నట్లయితే వాషింగ్మెషీన్లో ఆరబెట్టాలని సూచిస్తుంది. దానిపై ఇంటూ గుర్తు ఉంటే ఎండలో ఆరబెట్టవచ్చని తెలుసుకోవాలి.
ఇది కూడా చదవండి.. : Laundry Symbols Explained
ఇది కూడా చదవండి..: Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!