తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Coffee on Empty Stomach Risks |పొద్దున నిద్రలేవగానే కప్పు కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. దీంతో ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా కడుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించారా..? ఈ అలవాటు మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా..
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఏమీ తినకుండా కాఫీ తాగడం వల్ల అది కడుపులోని ఆమ్ల స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఇది కడుపు గోడలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో మంట, గ్యాస్, వికారం, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
Coffee on Empty Stomach Risks |కాఫీలోని కెఫీన్ కారణంగా..
కాఫీలోని కెఫీన్ మరో సమస్య. ఇది శరీరంలో కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. దీనిని స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు. దీని కారణంగా ఉదయం రిఫ్రెష్ అయిన ఫీలింగ్‌కి బదులు ఆందోళన, చిరాకు లేదా టెన్షన్ అనిపించే అవకాశం ఉంటుంది. కాఫీ మీ మానసిక స్థితిని మరింత గందరగోళంగా మారుస్తుంది అన్నమాట.
Coffee on Empty Stomach Risks |మొదట గ్లాస్ నీళ్లు తాగండి..
ఉదయం లేచిన తర్వాత మొదట ఒక గ్లాసు నీరు తాగడమే సరైన మార్గం. రాత్రి నిద్రలో శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అయితే నీరు తాగడం వల్ల తేమ తిరిగి వస్తుంది. మెటబాలిజం ప్రారంభమవడంతో పాటు జీర్ణక్రియ సిద్ధమవుతుంది. ఆ తర్వాత కాఫీ తాగాలనిపిస్తే.. ముందుగా కొంచెం లైట్ బ్రేక్‌ఫాస్ట్ లేదా ఫ్రూట్స్ తినండి. ఆ తర్వాత అరగంట ఆగి కాఫీ తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆమ్ల ప్రభావం తగ్గుతుంది.
Coffee on Empty Stomach Risks |సరైన సమయంలో తాగితే..
కాఫీ అలవాటు అనేది పూర్తిగా చెడు చేస్తుందని కాదు. కానీ సరైన సమయంలో, సరైన విధానంలో తాగితే అది ఏకాగ్రత పెంచడంతో పాటు అలసట తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మూడ్‌ను మెరుగుపరుస్తుందట. కానీ ఖాళీ కడుపుతో తాగకపోవడం, మీ శరీర అవసరాలను గుర్తించడం చాలా కీలకం. ఇలాంటి చిన్న మార్పులతో మీ ఉదయాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు, దీర్ఘకాలంలో జీర్ణ ఆరోగ్యం, మానసిక బ్యాలెన్స్‌ను కాపాడుకోవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం అందించాం. ఈ కథనం ఇంటర్నెట్లో లభ్యమైన సమాచారం ఆధారంగా ఇచ్చాం. వీటిని పాటించే ముందుకు సంబంధిత వైద్యుడిని సంప్రదించండి.
ఇది కూడా చదవండి: Cracked Lips in Winter |చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో పాటించండి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
