తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Aadhaar App |యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తాజాగా కొత్త “Aadhaar” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ వివరాలను ఫోన్లోనే సేవ్ చేసుకోవచ్చు. అలాగే అవసరమైతే ఇతరులతో సులభంగా పంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ వినియోగదారులు ఆపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని UIDAI “X” లో తెలిపింది.
Aadhaar App : ఇప్పటికే “mAadhaar” యాప్ ఉన్నా.. “Aadhaar” అదనంగా తీసుకువచ్చింది. ఈ కొత్త యాప్‌లో డిజిటల్ కార్డ్ డౌన్లోడ్, PVC కార్డ్ ఆర్డర్, ఈ–మెయిల్, మొబైల్ వెరిఫికేషన్, వర్చువల్ ఐడీ వంటి ఫీచర్లు ఉండవు. ఇది ప్రధానంగా ఆధార్ వివరాలను స్టోర్ చేయడం, పంచుకోవడం కోసం తీసుకువచ్చారు.
Aadhaar App | కొత్త యాప్‌లో ఉన్న ఫీచర్స్ ఏమిటంటే..
ఇక నుంచి ఆధార్ కార్డ్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే చాలు. కొత్త యాప్ ద్వారా ఆధార్ కార్డు డిజిటల్‌గా అందుబాటులో ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆధార్లను సైతం ఈ యాప్‌లో సేవ్ చేసుకోవచ్చు.
Aadhaar App | భద్రత కూడా ఉంటుంది..
ఈ యాప్‌కు ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఉండడంతో ఇది మరింత సురక్షితం. ఎవరితో పంచుకోవాలో, ఏ వివరాలు షేర్ చేయాలో మీరు నిర్ణయించుకోవచ్చు. బయోమెట్రిక్ వివరాలను లాక్ చేయడమో, అన్‌లాక్ చేయడమో కూడా మీ చేతిలోనే ఉంటుంది. అలాగే ఆధార్‌ను చివరిసారిగా ఎక్కడ ఉపయోగించారో కూడా ఈ యాప్‌లో నమోదవుతుంది.
Aadhaar App | యాప్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
ముందుగా Google Playstore లేదా Apple Store నుంచి “Aadhaar” యాప్ డౌన్లోడ్ చేయండి.
అవసరమైన అనుమతులను ఇవ్వండి, షరతులను అంగీకరించండి.
మీ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి.
ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయండి.
చివరగా సెక్యూరిటీ పిన్ సెట్ చేయండి.. అంతే! యాప్‌ను ఉపయోగించవచ్చు.
Aadhaar App | కుటుంబ సభ్యుల వివరాలు అందుబాటులో..
ఈ కొత్త ఆధార్ యాప్ సింపుల్‌గానే కాదు, చాలా హెల్ప్‌ఫుల్ కూడా ఉంటుంది. ఫోన్లో ఆధార్ ఉంటే ఏదైనా వెరిఫికేషన్ కోసం వెంటనే చూపించవచ్చు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు సైతం ఇందులో నమోదు చేసుకోవచ్చు. దీంతో ఇక నుంచి ఫిజికల్ కాపీల ఇబ్బందులు ఉండవు. ఇంకేం మరి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు సేవ్ చేసుకోండి.
ఇది కూడా చదవండి..: Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
