తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Clove Health Benefits | లవంగం.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు అన్నీ కూరల్లో దీనిని వాడుతుంటాం. అయితే దీనిలోని ప్రయోజనాలు కేవలం ఆహారానికి రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కూరల్లోనే కాదు.. అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ప్రతి రోజూ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. లవంగాలతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం పదండి..

Clove Health Benefits | ప్రయోజనాలివే..
లవంగాలతో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలిసిందే. వీటిలో ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, హైడ్రాలిక్ ఆసిడ్, సోడియం, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా నైజీరిసిన్ అనే సమ్మేళనం ఇందులో ఉంటుందట. ఇది డయాబెటిస్‌ను నివారించడంతో పాటు ఇన్సులిన్ చర్యను మెరుగుపర్చడంలో దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నూతన కణాలను సైతం ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందట. బ్లడ్‌లో షుగర్ స్థాయిలను తగ్గించడంలో పనిచేస్తుందంటున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడేందుకు సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో లభిస్తాయట.
Clove Health Benefits | భోజనం తర్వాత
రోజూ రాత్రి భోజనం తర్వాత రెండు లేదా మూడు లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుందట. అంతేకాకుండా శరీరంలోని అవాంఛిత కొవ్వును తొలగించడానికి దోహదం చేసుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత లవంగాలను నోటిలో వేసుకుని నమలడంతో నోటి దుర్వాసనను తగ్గించడంతో పాటు బ్యాక్టీరియాను చంపుతుందట. జలుబు దగ్గుకు లవంగం మంచి మందు అని చెబుతున్నారు.
నోటి దుర్వాసన దూరం: లవంగం లాలాజలంలో కరిగి నోట్లోని బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది దుర్వాసనను తగ్గించి.. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా తినడం వల్ల నోరు శుభ్రంగా, తాజాగా ఉంటుంది.
Clove Health Benefits | దంతాల నొప్పికి ఉపశమనం..
దంతాల నొప్పి, చిగుళ్ల వాపు నుంచి లవంగం ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని తేలికపాటి అనస్థీటిక్ ప్రభావం నొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్లను సైతం బలపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగుదల: లవంగం తినడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రి పూట లవంగాన్ని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా మారుతుంది. ఉదయం కడుపు తేలికగా అనిపిస్తుంది. అంతేకాకుండా శరీరానికి డిటాక్సిఫైయర్‌గా కూడా పనిచేస్తుందట.
Clove Health Benefits | రోగనిరోధక శక్తి పెరుగుదల
లవంగంలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వలన శరీరం ఇన్‌ఫెక్షన్లు, వైరల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. చిన్న లవంగంలో ఉండే అనేక ఉపయోగాల గురించి తెలుసుకున్నారు కదా.. ఇక నుంచి రోజూ తినడం అలవాటు చేసుకోండి మరి.
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం అందించాం. ఈ కథనం ఇంటర్నెట్‌లో లభ్యమైన సమాచారం ఆధారంగా ఇచ్చాం. వీటిని పాటించే ముందుకు సంబంధిత వైద్యుడిని సంప్రదించండి.
ఈ క్రింది Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..! ఐతే ఓ లుక్కేయండి..
Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా..!
మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
