తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Avatar 3 | జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ విజువల్ స్పెక్టాకిల్ ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ (Avatar: Fire and Ash) మూడో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులను ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ విజువల్ వండర్ మూవీ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్స్బుకింగ్స్కు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది.
Avatar 3 | టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ తేదీ నిర్ణయం
భారతదేశంలో ‘అవతార్ 3’ (Avatar 3) సినిమా టికెట్ల ముందస్తు బుకింగ్ డిసెంబర్ 5, 2025 నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ బుకింగ్స్ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దేశవ్యాప్తంగా రిలీజ్ అవనుంది. గత రెండు భాగాల మాదిరే ఈ చిత్రానికి కూడా అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డు స్థాయి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
![]()
Avatar 3 | IMAX వెర్షన్ కసం..
ఈ చిత్రాన్ని అత్యంత భారీ తెరపై అనుభవించాలనుకునే అభిమానుల కోసం IMAX వెర్షన్ భారతదేశంలో విడుదల చేయనున్నారు. అయితే, IMAX ఫార్మాట్ కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లోకే పరిమితం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో IMAX వెర్షన్ లేదు.
![]()
Avatar 3 | జేమ్స్ కామెరూన్ సంచలన ప్రకటన
ఇటీవల ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైతే ‘అవతార్’ సిరీస్‌ను శాశ్వతంగా ముగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తన కథాంశం, సాంకేతిక ప్రమాణాలపై ఆయనకున్న గట్టి నమ్మకాన్ని ఈ ప్రకటన తెలియజేస్తోంది. ఈ వ్యాఖ్యలు చిత్రంపై ఉన్న ఆసక్తిని మరింత పెంచాయి.
ఇది కూడా చదవండి..: Samantha Marriage | వివాహ బంధంలోకి సమంత – రాజ్.. ఫొటోలు వైరల్..
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
