తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Home remedies for mouth ulcers | విటమిన్ల లోపం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మహిళల్లో నెలసరి సమయంలో హార్మోన్ల అసమతుల్యత, వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శరీరంలో అధిక వేడి, ఇలాంటి అనేక కారణాల వల్ల చాలా మంది నోటి పుండ్ల బారిన పడుతుంటారు. ఈ చిన్న పుండ్లు మాట్లాడడం, తినడం, నీళ్లు తాగడం కూడా కష్టతరం చేస్తాయి. మందుల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మన వంటింట్లోనే ఉన్న సహజ పదార్థాలతో ఈ ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Home remedies for mouth ulcers | తులసి ఆకులు..
పవిత్రమైన తులసి మొక్క ఆరోగ్యానికి అద్భుత ఔషధం. దీని ఆకుల్లో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ 4-5 సార్లు 8-10 తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమలడం లేదా ఆకులను నీళ్లలో మెత్తగా నమిలి ఆ నీటితో పుక్కిలించడం వల్ల నోటి పుండ్లు త్వరగా తగ్గుతాయి. అనేక అంతర్జాతీయ పరిశోధనలు తులసిని నోటి రుగ్మతలకు సహజ చికిత్సగా గుర్తించాయి.

Home remedies for mouth ulcers | సహజ తేనె..
తేనెలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు గాయాలను త్వరగా మాన్పుతాయి. నోటి పుండ్లపై రోజూ 3-4 సార్లు కాస్త తేనె రాయడం వల్ల నొప్పి, మంట తగ్గి, ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ లభిస్తుంది. మరింత శక్తినిచ్చేందుకు చిటికెడు పసుపును తేనెలో కలిపి రాయవచ్చు. పిల్లల్లో కూడా తేనె సురక్షితమైన, ప్రభావవంతమైన చికిత్సగా నిరూపితమైంది.
Home remedies for mouth ulcers | కొబ్బరి – బహుముఖ ఔషధం
కొబ్బరి నూనెను పుండ్లపై సున్నితంగా రాయడం వల్ల తేమ నిలువరించి, నొప్పి తగ్గుతుంది. ఎండు కొబ్బరి ముక్కలు నమలడం లేదా రోజూ రెండు మూడు లేత కొబ్బరి బోండాల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని అధిక వేడి తగ్గి, పుండ్లు త్వరగా మాయమవుతాయి.
Home remedies for mouth ulcers | గసగసాలు
శరీర వేడిని తగ్గించడంలో గసగసాలకు ఎటువంటి సాటి లేదు. ఒక టీస్పూన్ గసగసాల పొడిని అంతే మోతాదు పంచదారతో కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే నోటి పుండ్లు గణనీయంగా తగ్గుతాయి.
Home remedies for mouth ulcers | ఇతర సహజ సలహాలు
- పుండ్లపై ఐస్ ముక్కలతో సున్నితంగా రుద్దితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
- లవంగం నమలడం లేదా లవంగం నూనె రాయడం వల్ల యాంటీ-బ్యాక్టీరియల్ ప్రభావం వలన నొప్పి తగ్గుతుంది.
- రోజూ గోరువెచ్చని నీటితో ఎక్కువసార్లు పుక్కిలించడం అత్యంత సులభమైన మార్గం.
- మజ్జిగ ఎక్కువగా తాగడం లేదా పుండ్లపై నెయ్యి రాయడం కూడా ఉపయోగకరం.
- పచ్చి ఉల్లిపాయలు తినడం, విటమిన్ సి, బి12 అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం సహాయకారి.
- టీ, కాఫీ, మాంసాహారం, అధిక మసాలా ఆహారం తాత్కాలికంగా తగ్గించడం మంచిది.
- ప్రతిరోజూ రెండుసార్లు పళ్లు శుభ్రంగా తోముకోవడం, ఫ్లాసింగ్ చేయడం, మూడు నెలలకోసారి బ్రష్ మార్చడం వంటి నోటి పరిశుభ్రత అలవాట్లు పుండ్లు రాకుండా కాపాడతాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించారం. మీరు వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి. ప్రతి రోగి శారీరక స్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిగత వైద్యుడి సూచనలకు ప్రాధాన్యత ఇవ్వండి.
ఇది కూడా చదవండి..: Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
