చిత్రం: అఖండ 2: తాండవం : Akhanda 2 Review
కథానాయకుడు: నందమూరి బాలకృష్ణ
ముఖ్య పాత్రలు: సంయుక్త మేనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి, జగపతి బాబు, కబీర్ దుహాన్ సింగ్, శ్వేతా చటర్జీ, విజి చంద్రశేఖర్ తదితరులు
సంగీతం: ఎస్. తమన్
ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్
కూర్పు: తమ్మిరాజు
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, ఇషాన్ సక్సేనా
సమర్పణ: ఎం. తేజస్విని నందమూరి
కథ, మాటలు, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల : డిసెంబర్ 12, 2025
‘అఖండ’ సృష్టించిన అదే ఉద్వేగం, అదే భక్తి రసం, అదే మాస్ జ్వరంతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల్ని కలిసింది. Akhanda 2 Review మొదటి భాగం ఎంతటి బ్లాక్‌బస్టర్ అయిందో అందరికీ గుర్తుంది కదా! ఇప్పుడు ఆ కొనసాగింపుగా వచ్చిన ‘అఖండ 2: తాండవం’ అంచనాల్ని అందుకుందా? థియేటర్లో బాలయ్య అభిమానులు మళ్లీ దద్దరిల్లేలా చేశాడా? చూద్దాం..
Akhanda 2 Review | కథ సారాంశం..
కథ టిబెట్ సరిహద్దు నుంచి ఆరంభమవుతుంది. భారతీయుల హిందూ నమ్మకాల్ని, సనాతన ధర్మాన్ని ఛిన్నాభిన్నం చేయాలని శత్రు దేశం (చైనా) ఒక ఘోర కుట్ర పన్నుతుంది. కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తున్న భక్తులపై బయోలాజికల్ దాడి చేస్తారు. ఫలితంగా వేలాది మంది కోమాలోకి జారుకుంటారు. దీనికి ప్రతి విరుగుడుగా డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు. కానీ శత్రువులు ఆ ల్యాబ్‌ను ధ్వంసం చేసి శాస్త్రవేత్తలందరినీ హతమార్చేస్తారు ఉంటారు. ఆ బృందంలోని యువ శాస్త్రవేత్త జనని (హర్షాలీ మల్హోత్రా) మాత్రమే ఆ వ్యాక్సిన్‌తో సహా ప్రాణాలతో బయటపడుతుంది.

ఆమెను వెంటాడే శత్రు బలగాల నుంచి కాపాడే బాధ్యత రుద్ర సికిందర్ అఘోరా (బాలకృష్ణ) తీసుకుంటాడు. అదే సమయంలో అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ (మరో బాలకృష్ణ) డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ రెండు ట్రాక్‌లు ఎలా ముడిపడతాయి? అఘోరాకు జనని గురించి తెలిసింది ఎలా? చివరికి భారత గౌరవాన్ని, హిందూ ధర్మ గొప్పతనాన్ని ఆయన ఎలాంటి తాండవంతో నిలబెట్టాడు? అనేది మిగతా కథ.
సినిమా ఎలా సాగింది?
బోయపాటి శ్రీను ఈసారి కథను దేశ సరిహద్దులకు మించి తీసుకెళ్లారు. అఘోరా పాత్రకు మరింత శక్తి కల్పించి, ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని కలిపి ఒక భారీ కాన్వాస్‌పై ఆవిష్కరించారు. మొదటి భాగంలో ఫ్యాక్షనిజం మీద యుద్ధమైతే ఇక్కడ డ్రగ్స్ మాఫియా, బయో టెర్రరిజం, సరిహద్దు దాడులతో సహా జాతీయ భద్రత విషయాలు కలిశాయి.
ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగినా, బాలమురళీకృష్ణ పరిచయం, ఆయన ఎంట్రీ సీక్వెన్స్‌లు అదిరిపోతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమా ఒక్కసారిగా గేర్ మార్చి, రెండో భాగంలో అఘోరా రూపంలో బాలకృష్ణ పూర్తి జోష్‌తో దండయాత్ర చేస్తాడు. హిమాలయాల్లో సర్జికల్ స్ట్రైక్, తాంత్రికుడైన నేత్రతో ఎదుర్కొనే సన్నివేశాలు, హనుమాన్-శివుడి రూపాల్లో అఘోరా, తల్లి సెంటిమెంట్ – ప్రతి ఎపిసోడ్ ఒక్కటే గూస్బంప్స్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో భారత్ గొప్పతనం, వేదభూమి మహత్యం గురించిన సంభాషణలు థియేటర్‌ను ఉర్రూతలూగిస్తాయి.
నటన, సాంకేతిక విభాగాలు
ఈ చిత్రం పూర్తిగా బాలకృష్ణ వన్ మేన్ ఆర్మీ. రెండు పాత్రల్లోనూ ఆయన విశ్వరూపం చూపించారు. అఘోరా రూపంలో భక్తి-ఆవేశం, బాలమురళీకృష్ణగా స్టైల్-సంభాషణ – రెండూ అద్భుతం. ఆయన మాటల డెలివరీ, యాక్షన్ ఘట్టాలు ఒక్కసారిగా సీట్ల నుంచి లేపేస్తాయి.

Akhanda2 Release Date Fix
సంయుక్త మేనన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా గ్లామర్‌తో ఆకట్టుకుంది. హర్షాలీ మల్హోత్రా కథలో కీలక పాత్ర, ఆమె నటన సహజంగా కనిపించింది. విలన్లలో ఆది పినిశెట్టి (నేత్ర) మాత్రమే కొంత గుర్తుండిపోతాడు, మిగతా వారు రొటీన్. తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ ఎమోషనల్ ఘట్టాలకు బలం చేకూర్చారు.
సాంకేతికంగా తమన్ సంగీతం సినిమాకు ప్రాణవాయువు. పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా ఆకట్టుకుంటుంది. రాంప్రసాద్ ఛాయాగ్రహణం గ్రాండ్, ముఖ్యంగా కుంభమేళా, హిమాలయ సన్నివేశాలు అద్భుతంగా కనిపిస్తాయి. నిర్మాణ విలువలు పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
ప్లస్ పాయింట్లు : Akhanda 2 Review
- బాలకృష్ణ డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్
- రెండో భాగంలో అఘోరా తాండవం, ఎలివేషన్ సీన్లు
- తమన్ బీజీఎం, భావోద్వేగ ఘట్టాలు
- దేశభక్తి-హిందూ ధర్మ గొప్పతనం చాటిన సన్నివేశాలు
మైనస్ పాయింట్లు: Akhanda 2 Review
- ప్రథమార్ధంలో కొన్ని సీన్లు కాస్త సాగతీతగా అనిపించడం
- విలన్లకు పెద్దగా బలం లేకపోవడం
చివరగా.. ‘అఖండ 2: తాండవం’ అంటే బాలకృష్ణ అభిమానులకు పండుగ, మాస్ ప్రేక్షకులకు పూనకాలు. మొదటి భాగం ఫార్ములానే అనుసరించినా, దాన్ని మరింత గ్రాండ్ స్థాయికి తీసుకెళ్లినందుకు బోయపాటి శ్రీనుకు, బాలయ్యకు జోహార్లు. థియేటర్లో గూస్బంప్స్, ఉద్వేగం, భక్తి రసం కావాలంటే ఈ చిత్రం మిస్ కాకూడదు.
రేటింగ్: 3.75/5 : Akhanda 2 Review
(గమనిక: ఈ సమీక్ష పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
ఇది కూడా చదవండి..: Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai

