తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Union Budget 2026 | భారత ఆర్థిక చరిత్రలో అరుదైన సంఘటన ఆవిష్కృతం కానుంది. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం రోజు ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE)లు అసాధారణ నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా వారాంతాల్లో మూసిఉండే మార్కెట్లు ఆదివారం పూర్తిస్థాయి ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి.
ఈ మేరకు రెండు ఎక్స్‌ఛేంజ్‌లు సర్క్యులర్లు జారీ చేశాయి. ఆ రోజు ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు సాధారణ ట్రేడింగ్ జరుగనుంది. ప్రీ-ఓపెన్ సెషన్, బ్లాక్ డీల్స్ సహా అన్ని కార్యకలాపాలు జరుగుతాయి. పెట్టుబడిదారులు, వ్యాపారులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
Union Budget 2026 | ఫిబ్రవరి 1నే బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయబద్ధంగా ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీ కొనసాగిస్తోంది. అయితే సారి ఆదివారం రాగా.. తేదీని మారస్తారని భావించినా.. సంప్రదాయాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఉదయం 11 గంటలకు మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. ఇది ఆమె వరుసగా తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం.
బడ్జెట్‌కు ముందు జనవరి 29న ఆర్థిక సర్వే నివేదిక విడుదల కానుంది. ఈ నివేదికలోని విశ్లేషణలు, సూచనలు బడ్జెట్‌లోని ముఖ్య విధానాలకు, కేటాయింపులకు ఆధారమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Union Budget 2026 | మార్కెట్‌పై ప్రభావం
బడ్జెట్ ప్రకటనలు మార్కెట్‌పై తక్షణ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పన్ను విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మూలధన మార్కెట్లకు సంబంధించిన నిర్ణయాలు షేర్ల ధరల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కారణంగా పెట్టుబడిదారులు బడ్జెట్‌పై మరింత ఆసక్తి చూపుతున్నారు.
ఇది కూడా చదవండి..: Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
