తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: instagram hashtags | ఇన్స్టాగ్రామ్ రీల్స్, పోస్టులకు ఎక్కువ రీచ్ రావాలనే లక్ష్యంతో చాలా మంది విపరీతంగా హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తుంటారు. ఎడాపెడా హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టడం ఆనవాయితీగా మారిపోయింది. కంటెంట్‌కు సంబంధం లేకుండా ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది. హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై కఠినమైన పరిమితులను విధించింది.
instagram hashtags | కేవలం ఐదు మాత్రమే..
ఇక నుంచి ఒక పోస్ట్ లేదా రీల్‌కు కేవలం ఐదు హ్యాష్‌ట్యాగ్‌లు మాత్రమే జోడించడానికి వీలవుతుంది. ఈ మార్పు క్రమంగా అన్ని ఖాతాలకు వర్తింపజేయనుంది. సాధారణమైన జెనరిక్ ట్యాగ్‌లకు బదులుగా కంటెంట్‌కు రిలేటెడ్ టార్గెటెడ్ హ్యాష్‌ట్యాగ్‌లను ఎంచుకోవాలని ప్లాట్‌ఫామ్ కంటెంట్ సృష్టికర్తలకు సూచించింది. ఉదాహరణకు.. టెక్నాలజీ లేదా ఫుడ్ కంటెంట్ షేర్ చేసేవారు ఆ రంగాలకు చెందిన హ్యాష్‌ట్యాగ్‌లను మాత్రమే వినియోగించాలి. అంతేకాకుండా.. #రీల్స్, #ఎక్స్ప్లోర్ వంటి విస్తృత ట్యాగ్లు వినియోగిస్తున్నారని.. ఇవి రీచ్‌ను పెంచవని, వాటి వల్ల లాభం లేదని పేర్కొంది.
instagram hashtags | 2011 నుంచి హ్యాష్‌ట్యాగ్స్..
ఇన్స్టాగ్రామ్ 2011 నుంచి హ్యాష్‌ట్యాగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి టాపిక్ ఆధారిత డిస్కవరినీ సులభతరం చేయడంతో పాటు అల్గారిథమ్ ఆధారిత కంటెంట్ సిఫారసులకు దోహదపడ్డాయి. ఇప్పటి వరకు ఒక్కో పోస్ట్ లేదా రీల్‌కు గరిష్ఠంగా 30 హ్యాష్‌ట్యాగ్‌లు జోడించే సౌకర్యం ఉండేది. అయితే సంబంధం లేని ట్రెండింగ్ ట్యాగ్‌లను దుర్వినియోగం చేయడం పెరిగినందున ఇన్స్టాగ్రామ్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
ఇది కూడా చదవండి..: Water Geyser Replacement |ఈ ఐదు సంకేతాలు మీ గీజర్‌లో కనిపిస్తున్నారా.. అయితే మీరు వెంటనే మార్చాల్సిందే..!
