తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Telangana Panchayat Elections | తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ విషయాన్ని ప్రకటించారు.
Telangana Panchayat Elections | మూడుదశల్లో ఎన్నికలు..
రాష్ట్రంలోని మొత్తం 12,728 సర్పంచ్ పదవులకు, 1,12,242 వార్డు మెంబర్ పదవులకు ఎన్నికలు మూడు దశలుగా నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషనర్ తెలిపారు. పోలింగ్ తేదీలు డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17గా నిర్ణయించారు. ప్రతి దశలోనూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కమిషనర్ వెల్లడించారు. నోటిఫికేషన్ విడుదలతోపాటు మంగళవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి వచ్చింది.
గతంలో సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో అక్టోబర్ 9న హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైందని రాణి కుముదిని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1.66 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్టు ఆమె తెలిపారు.
Telangana Panchayat Elections | దశలవారీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
- తొలి దశ: 4,236 సర్పంచ్ పదవులు, 37,440 వార్డు మెంబర్ పదవులు
నామినేషన్లు: నవంబర్ 27 నుంచి
పోలింగ్: డిసెంబర్ 11
- రెండో దశ: 4,333 సర్పంచ్ పదవులు, 38,350 వార్డు మెంబర్ పదవులు
నామినేషన్లు: నవంబర్ 30 నుంచి
పోలింగ్: డిసెంబర్ 14
- మూడో దశ: 4,159 సర్పంచ్ పదవులు, 36,452 వార్డు మెంబర్ పదవులు
నామినేషన్లు: డిసెంబర్ 3 నుంచి
పోలింగ్: డిసెంబర్ 17
ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కొత్త నాయకత్వం ఎన్నిక కానుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఇది కూడా చదవండి..: New Labour Codes | అమలులోకి కొత్త కార్మిక చట్టాలు.. ప్రయోజనాలేమిటో తెలుసుకోండి..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
