Varanasi Movie | మహేశ్​–రాజమౌళి మూవీ టైటిల్​ ‘వారణాసి’.. రిలీజ్​ డేట్​ ఎప్పడంటే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Varanasi Movie | మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్​లో SSMB29 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​ మూవీ టీం మహేశ్ పోస్టర్​తో పాటు టైటిల్, గ్లింప్స్​ను రివీల్ చేశారు. ఈ గ్లింప్స్​ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. నందీశ్వరుడిపై మహేశ్​ బాబు విజువల్స్​ అదరగొట్టాయి.

Varanasi Movie | నందీశ్వరుడిపై మహేశ్​ ఎంట్రీ

ఈవెంట్​లో స్టేజ్​పైకి మహేశ్ ఎంట్రీ నెక్ట్స్ లెవెల్​గా నిలిచింది. ఆయన సినిమా క్యాస్టూమ్ ధరించి నందీశ్వ‌రుడిపై కూర్చుని ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 50 ఫీట్ల ఎత్తులో క్రేన్​పై నిల్చుని అభిమానుల‌కు అభివాదం చేశారు. భారీ పబ్లిక్ ఈవెంట్​లో ఇలా ఎంట్రీ ఇవ్వడం ఏ హీరోకైనా గ్రేట్ అచీవ్​మెంట్ అనే చెప్పాలి.

Varanasi Movie | నా డ్రీమ్​ ప్రాజెక్టు

గ్లోబ్​ ట్రాటర్​ ఈవెంట్​కు హాజరైన మహేశ్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు. ఇది ఒక నటుడికి లైఫ్ టైమ్ ప్రాజెక్ట్ లాంటిందని పేర్కొన్నారు. ‘మీ అందర్నీ (ఫ్యాన్స్​) కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడకు నార్మల్​గానే వస్తానని చెప్పాను. కానీ, రాజమౌళి కుదరదని చెప్పి నాతో ఇలా స్పెషల్​గా చేయించారు. నన్ను పౌరాణిక సినిమా చేయ‌మ‌ని నాన్న‌గారు చాలాసార్లు అడుగుతుండేవారు. ఆయ‌న మాట‌ విన‌లేదు. ఇప్పుడు ఆయ‌న నా మాట‌లు వింటుంటారు. ఈ సినిమా కోసం ఎంత కావాలో అంత క‌ష్ట‌ప‌డ‌తాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అంద‌రూ గర్వించేలా చేస్తాను. ముఖ్యంగా రాజ‌మౌళి గారిని’ అని మహేశ్​ పేర్కొన్నారు.

‘వార‌ణాసి విడుద‌లైన అనంతరం దేశం మొత్తం గ‌ర్వంగా ఫీల‌వుతుంది. ఇది టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్ర‌మే. మున్ముందు ఎలా ఉండ‌బోతోందనేది మీ ఊహ‌కే వ‌దిలేస్తున్నా. మీ మద్దతు ఎల్లపుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్‌ అనేది చాలా చిన్న మాటే. మీ అభిమానం మాటల్లో చెప్పలేను. ఈవెంట్‌ సజావుగా సాగడానికి సహకరించిన పోలీసు శాఖకు నా ధన్యవాదాలు’ అని మహేశ్ అన్నారు.

Varanasi Movie | రాముడిగా మహేశ్‌..: రాజమౌళి

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘నేను సినిమా ప్రారంభించే ముందు ప్రెస్‌మీట్‌ పెట్టి సినిమా విశేషాలు చెబుతాను. అయితే, అన్నింటికీ చెప్పలేదు. కథకు ఉన్న ప్రాధాన్యం ఆధారంగా అది జరుగుతుంది. ఈ మూవీ గురించి మాటల్లో చెప్పలేం. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక మాట చెప్పకుండా వీడియో చేద్దామని భావించాం. మార్చిలో ఈవెంట్‌ నిర్వహించి విడుదల చేద్దామని అనుకున్నా కుదరలేదు. జూన్‌, జులై నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు నవంబరు 15న మీ ముందుకు ఈ వీడియోను తెచ్చాం’ అని అన్నారు.

‘‘చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం నాకు అంతగా తెలియదు. ఎక్కువగా ఎన్టీఆర్‌ సినిమాలు చూస్తుండేవాడిని చూసేవాడిని. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే కృష్ణగారి గురించి అర్థమైంది. ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీ ఆయన సినిమాల వల్లనే పరిచయమైంది. మనం తీసే సినిమాలను స్కోప్​లో తీసి.. ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌కు బ్లో అప్‌ చేస్తాం. కానీ అది నిజమైన ఐమ్యాక్స్‌ కాదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను అసలైన ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈవెంట్‌ కోసం మా టీం ఎంతో కష్టపడింది. మేం విడుదల చేసే వీడియో చూసి, ప్రేక్షకుడు థ్రిల్‌ ఫీలవ్వాలని అనుకున్నాం.’

‘ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. సినిమాలో మహేశ్‌బాబు పాత్ర.. ఇందుకు ఆయన పడిన కష్టం గురించి ప్రస్తుతం మాట్లాడను. ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడతా.. మహేశ్​ నుంచి నేర్చుకునే లక్షణం ఒకటి ఉంది. మనం సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేం. కానీ, మహేశ్‌బాబు షూటింగ్‌కు వస్తే.. అస్సలు మొబైల్​ చూడరు. కారులోనే ఫోన్‌ను పెట్టేసి వస్తారు. ఏడెనిమిది గంటలైనా దాని జోలికి పోరు. నేను కూడా అలా ఉండేందుకు ప్రయత్నిస్తా. అది కచ్చితంగా నేర్చుకుంటా’ అని ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.

ఇది కూడా చదవండి..: Upcoming Movies 2025 |15 రోజుల్లో అరడజన్​ రీ రిలీజ్​లు.. మూవీ లవర్స్​కు పండుగే..!

మమ్మల్ని సోషల్ మీడియా లో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

Related posts

Dhurandhar box office collections | కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’.. బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తూ..!

Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

Dhurandhar collections | ‘ధురంధర్’ బాక్సాఫీస్ దూకుడు.. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న మూవీ..