X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: X Chat | అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి తెర తీశారు. టాప్​ మెసేజింగ్​ యాప్​ వాట్సప్​కు షాక్​ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ఎలాన్ మస్క్ లాంచ్ ప్రకటించారు. త్వరలో వాట్సప్​కు పోటీగా X Chatతో ఎంట్రీ ఇవ్వనున్నారు.

X Chat | వాట్సప్​, టెలిగ్రాం, ఆరట్టైలకు ప్రత్యామ్నాయంగా..

ఎలాన్ మస్క్. వాట్సాప్, టెలిగ్రామ్, అరట్టై వంటి మెసేజింగ్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా X Chatను లాంచ్ చేయనున్నారు. ఇందులో ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సరికొత్త ప్లాట్ ఫాం.. డిజిటల్ కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరుచనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్​తో పాటు అడ్వాన్స్‌డ్ మెసేజ్ కంట్రోల్స్ ఉండనున్నాయి. అంతేకాకుండా పాత డైరెక్ట్ మెసేజీలు (DM), కొత్త చాట్ ఫంక్షన్స్​ కోసం యూనిఫైడ్ ఇన్‌బాక్స్ అలాంటి స్పెషల్​ ఫీచర్స్​ ఉండడం దీని ప్రత్యేకత.

త్వరలోనే లాంఛ్​..

ఈ కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారం త్వరలో లాంఛ్ చేయనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, ఫైల్ ట్రాన్స్‌ఫర్‌, ఆడియో, వీడియో కాల్స్​ వంటి ఫీచర్స్​తో కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ఆవిష్కరించినట్లు ట్వీట్ చేశారు. కాగా.. ‘ఎక్స్’ను “ఎవ్రీథింగ్ యాప్”గా మార్చే ఉద్దేశంలో ఉన్న మస్క్​.. త్వరలో ‘ఎక్స్ మనీ’ (X Money) కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. X Chatలో పంపిన మెసేజ్​లు, ఫైల్ షేరింగ్‌తో సహా అన్ని చాట్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్​ సౌకర్యం ఉంటుందని వివరించారు. కేవలం వీటిని పంపినవారు, స్వీకరించేవారు తప్ప మరెవరూ యాక్సెస్ చేయలేరని పేర్కొన్నారు.

ఎడిటింగ్​ ఆప్షన్​

త్వరలో లాంఛ్​ చేయనున్న ఈ మెసేజింగ్ యాప్​లో యూజర్లు తాము పంపిన మెసేజ్​లను తర్వాత కూడా ఎడిట్ చేయవచ్చు, లేదంటే డిలిట్ చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని యాప్​ కల్పించనుంది. అవసరం అనుకుంటే డిసప్పియర్ చేసే వెసలుబాటు కూడా కల్పించనుంది. వాట్సాప్‌లో ఏదైనా సమాచారాన్ని డిలిట్ చేసినట్లయితే This Message was Deleted.. అని కనిపిస్తుంటుంది. కానీ ఎక్స్ చాట్​లో డిలిట్ చేసినట్లయితే ఇలా కనిపించదు.

ఇది కూడా చదవండి..: WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : WhatsappFacebookTwitterArattai

Related posts

BSNL New Offers Plans 2026: బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన నయా ఆఫర్​ ప్లాన్స్​.. ప్రయోజనాలు తెలుసుకోండి..!

Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్.. డిజైన్, విశేషాలివే.. విడుదల ఎప్పుడంటే..!