తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: 2026 Holidays List | కొత్త సంవత్సరంలో కొన్ని రోజుల్లో అడుగుపెట్టనున్నాం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు వర్తించే 2026 సంవత్సరం సెలవుల జాబితాను (2026 Holidays List) అధికారికంగా ప్రకటించింది. ప్రయాణాలు, కుటుంబ కార్యక్రమాలు లేదా వ్యక్తిగత పనుల కోసం ముందుగానే ప్లాన్ చేసుకునే వారికి ఈ క్యాలెండర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 2025తో పోల్చితే 2026లో సెలవుల గణనీయంగా పెరగడం ఉద్యోగులు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితా ప్రకారం 2026లో మొత్తం 14 తప్పనిసరి (గెజిటెడ్) సెలవులు, 12 ఐచ్ఛిక (రెస్ట్రిక్టెడ్) సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా ప్రతి నెలలోని రెండో శనివారాలు (12 రోజులు), అన్ని ఆదివారాలు (52 రోజులు) కూడా సెలవులుగానే పరిగణించబడతాయి.

2026 Holidays List | 2026 సెలవుల జాబితా విడుదల
సెలవుల వివరాలు
- జనవరి 1 – నూతన సంవత్సర దినోత్సవం
- జనవరి 14 – మకర సంక్రాంతి / పొంగల్
- జనవరి 23 – వసంత పంచమి
- జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
- ఫిబ్రవరి 1 – గురు రవిదాస్ జయంతి
- ఫిబ్రవరి 15 – మహా శివరాత్రి
- ఫిబ్రవరి 19 – ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
- మార్చి 4 – హోలీ
- మార్చి 19 – తెలుగు ఉగాది
- మార్చి 21 – ఈదుల్ ఫితర్ (రంజాన్)
- మార్చి 26 – శ్రీరామ నవమి
- మార్చి 31 – మహావీర్ జయంతి
- ఏప్రిల్ 3 – గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 5 – ఈస్టర్ సండే
- ఏప్రిల్ 14 – డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి
- మే 1 – బుద్ధ పౌర్ణమి
- మే 27 – బక్రీద్
- జూన్ 26 – మొహర్రం
- ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం
- ఆగస్టు 26 – మిలాద్-ఉన్-నబీ, ఓణం
- ఆగస్టు 28 – రక్షా బంధన్
- సెప్టెంబర్ 4 – శ్రీ కృష్ణ జన్మాష్టమి
- సెప్టెంబర్ 14 – వినాయక చతుర్థి
- అక్టోబర్ 2 – మహాత్మా గాంధీ జయంతి
- అక్టోబర్ 18, 19, 20 – దసరా సెలవులు (విజయదశమి సహా)
- నవంబర్ 8 – దీపావళి
- నవంబర్ 15 – ఛత్ పూజ
- నవంబర్ 24 – గురు నానక్ జయంతి
- డిసెంబర్ 25 – క్రిస్మస్
పాఠశాలల విషయానికి వస్తే దసరా సెలవులు సాధారణంగా ఒక వారం నుంచి పది రోజుల వరకు ఉంటాయి. అలాగే వేసవి సెలవులు, ఇతర స్థానిక సెలవులు కలుపుకుంటే విద్యార్థులకు సంవత్సరానికి సుమారు 100 రోజులకు పైగా సెలవులు లభించే అవకాశం ఉంది.
ఈ కొత్త సెలవుల క్యాలెండర్‌తో ఉద్యోగులు, తల్లిదండ్రులు ముందుగానే తమ వార్షిక ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘ కాల సెలవులు (లాంగ్ వీకెండ్స్) వచ్చే తేదీలను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..: Shukra Maudhyam 2025 | శుభకార్యాలకు సుదీర్ఘ విరామం.. శుక్ర మౌఢ్యం నిజంగా అశుభ కాలమేనా..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!
