తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Akhanda 2 release postponed | టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా (Akhanda 2 release postponed) పడింది. తొలుత నిర్ణయించినట్లు డిసెంబర్ 5న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సినిమా రిలీజ్క కొద్ద గంటల ముందు నిర్మాతలు వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
Akhanda 2 release postponed | సోషల్ మీడియాలో పోస్ట్
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక భావోద్వేగ పోస్టు ద్వారా తెలియజేసింది. “అనివార్యమైన కారణాల వల్ల అఖండ 2ని షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేకపోతున్నామని తీవ్ర బాధతో తెలియజేస్తున్నాం. ఈ క్షణం మాకు అత్యంత వేదననిచ్చింది. ప్రతి బాలయ్య అభిమాని, సినీ ప్రేమికుడు ఎదుర్కొనే నిరాశను మేం పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం” అని పేర్కొంది. అలాగే వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరించి సానుకూల వార్తతో మళ్లీ వస్తామని పేర్కొంది.
ఈ ఆకస్మిక వాయిదాకు ఆర్థికపరమైన చిక్కులే కారణమని ప్రచారం జరుగుతోంది. గురువారం సాయంత్రం నుంచే ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే రాత్రి ప్రీమియర్ షోలను రద్దు చేయడం, ఆ తర్వాత విడుదలను వాయిదా వేయడం చర్చకు దారి తీసింది.
Akhanda 2 release postponed | కొత్త తేదీ ఎప్పుడో..
కొత్త రిలీజ్ తేదీ గురించి నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం లేదా వీకెండ్‌లోపు స్పష్టమైన ప్రకటన రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రూపొందిన ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ మళ్లీ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. అఘోరగా మరో సారి శక్తివంతమైన పాత్రలో తెరపై అఖండ తాండవం చేయనున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు. పూర్ణ, హర్షాలీ మల్హోత్రా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం, భారీ విజువల్ ఎఫెక్ట్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.
With a heavy heart, we regret to inform you that #Akhanda2 will not be releasing as scheduled due to unavoidable circumstances.
This is a painful moment for us, and we truly understand the disappointment it brings to every fan and movie lover awaiting the film.
We are working…
— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025
ఇది కూడా చదవండి..: Avatar 3 | డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు అవతార్ 3.. టికెట్ల బుకింగ్ ఎప్పటినుంచంటే..!
మమ్మల్ని సోషల్ మీడియాలో Follow చేయండి : Whatsapp, Facebook, Twitter, Arattai
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!
