IRCTC ticket booking new rules | టికెట్ల బుకింగ్​లో కొత్త అప్డేట్.. నేటి నుంచి అమలులోకి వచ్చిన IRCTC కొత్త రూల్స్​ ఇవే..

రైల్వే విభాగం కూడా టికెట్ బుకింగ్ వ్యవస్థలో నిరంతరం మార్పులు చేస్తూ వస్తోంది. ఇటీవలే టికెట్లకు సంబంధించి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి.

by Harsha Vardhan
0 comments
IRCTC ticket booking new rules

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: IRCTC ticket booking new rules | భారతదేశంలో రైలు ప్రయాణాలకు ఉన్న ఆదరణ ఎంతటిదో అందరికీ తెలిసిందే. దూరప్రాంతాలు, పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక స్థలాలు – ఎక్కడికైనా సరే, ఎక్కువ మంది రైల్వేను ఎంచుకుంటారు. టికెట్ ధరలు సరసమైనవి కావడంతో పాటు, ప్రయాణం సురక్షితమనే నమ్మకం కూడా దీనికి కారణం. అయితే, రైళ్లలో రద్దీ కూడా తక్కువేమీ కాదు. పండుగలు, ప్రత్యేక సమయాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. ఈ పరిస్థితిని గమనించి, చాలా మంది ముందుగానే – నెలల ముందు – టికెట్లను రిజర్వ్ చేసుకుంటారు. రైల్వే విభాగం కూడా టికెట్ బుకింగ్ వ్యవస్థలో నిరంతరం మార్పులు (IRCTC New Rules) చేస్తూ వస్తోంది. ఇటీవలే టికెట్లకు సంబంధించి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలను తెలుసుకుందాం..

రైలు టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో స్పష్టతను పెంచడానికి, దళారుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి భారతీయ రైల్వేలు సమయానుసారం కొత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా, అక్టోబర్ 1 నుంచి సాధారణ టికెట్ రిజర్వేషన్‌కు సంబంధించిన నియమాల్లో మార్పులు (IRCTC ticket booking new rules) చేశారు. టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణ అనివార్యం చేశారు. అప్పటి నుంచి, IRCTCతో ఆధార్ లింక్ చేసిన వారు మాత్రమే మొదటి 15 నిమిషాల్లో టికెట్లను రిజర్వ్ చేయగలరు. అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి (ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు)లో బుకింగ్‌కు సంబంధించి రైల్వేలు మరిన్ని కఠిన నియమాలు అమలు చేస్తున్నాయి.

IRCTC ticket booking new rules

IRCTC ticket booking new rules | 15 నిమిషాల నుంచి 4 గంటల వరకు సమయ విస్తరణ

ప్రస్తుతం, సాధారణ రిజర్వేషన్ విండో తెరిచిన వెంటనే IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో మొదటి 15 నిమిషాల్లో ఆధార్ ధ్రువీకరణ ఉన్న వినియోగదారులకు మాత్రమే రిజర్వేషన్ అవకాశం లభిస్తుంది. ఈ సమయాన్ని డిసెంబర్ 29, 2025 నుంచి నాలుగు గంటలకు విస్తరించారు. అంటే, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టికెట్ బుకింగ్ చేయాలంటే ఆధార్ ధ్రువీకృత ఖాతాలు మాత్రమే అర్హత కలిగి ఉంటాయి. టికెట్ల దుర్వినియోగం లేదా మోసపూరిత బుకింగ్‌లను నియంత్రించడానికి ఆధార్ ధ్రువీకరణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని IRCTC అభిప్రాయపడుతోంది. అందుకే ఈ సమయాన్ని 15 నిమిషాల నుంచి 4 గంటలకు పెంచారు. ఆధార్ ధ్రువీకరణ లేని వినియోగదారులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రమే టికెట్లను రిజర్వ్ చేయవచ్చు.

అయితే, ఈ సమయ పరిమితులను జనవరి 5 నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఆ తర్వాత జనవరి 12 నుంచి ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు మరింత విస్తరించనున్నారు. అంటే, ఈ సమయాల్లో కేవలం ఆధార్ ధ్రువీకృత వినియోగదారులు మాత్రమే టికెట్లను బుక్ చేయగలరు. ఇలాంటి చర్యలతో టికెట్ అక్రమాలను అరికట్టాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

IRCTC ticket booking new rules | తత్కాల్ టికెట్లకు కూడా ఆధార్ లింక్ అనివార్యం

తత్కాల్ టికెట్ల (ఆన్‌లైన్)కు సంబంధించి 2025, జులై 1 నుంచి ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేసింది. 2025, జులై 15 నుంచి PRS కౌంటర్లు లేదా ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసినప్పుడు కూడా OTP ధ్రువీకరణ అవసరం ఉంటుంది. ఈ కొత్త నియమాలు అన్నీ ఆన్‌లైన్ బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయి. PRS కౌంటర్ల ద్వారా టికెట్లు రిజర్వ్ చేసుకునే వారికి ఇవి వర్తించవు.

IRCTC ticket booking new rules | IRCTC ఖాతాతో ఆధార్ లింక్ చేయడం ఎలా..

  • IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అవ్వండి.
  • My Accounts విభాగంలోకి వెళ్లి, Link Your Aadhaar ఎంపికను ఎంచుకోండి.
  • ఆధార్ నంబర్ లేదా వర్చువల్ IDని నమోదు చేయండి. ఆధార్ వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ, లింగం వంటివి సరిపోతున్నాయో పరిశీలించండి.
  • వివరాలను ధ్రువీకరించి, OTPపై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేసి సబ్మిట్ చేస్తే, ధ్రువీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత టికెట్లు సులభంగా బుక్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి..: Water Geyser Replacement |ఈ ఐదు సంకేతాలు మీ గీజర్​లో కనిపిస్తున్నారా.. అయితే మీరు వెంటనే మార్చాల్సిందే..!

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

Leave a Comment

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00