తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Gaza war | సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ప్రపంచం ఉలిక్కిపడింది. 2023 అక్టోబర్ 7న హమాస్ ముష్కరులు ఎవరూ ఊహించని రీతిలో ఇజ్రాయిలోకి చొచ్చుకొచ్చారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న వారిని పిట్టల్లా కాల్చారు. సుమారు 1200 మందిని హతమార్చారు. అంతేకాకుండా దాదాపు 250 మందిని బందీలుగా చేసుకుని తీసుకువెళ్లిపోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. నాటి ఘటన ఇంకా కళ్లముందు కదలాడుతోంది.
Gaza War | విరుచుకుపడ్డ ఇజ్రాయిల్
హమాస్ దాడితో షాక్‌కు గురైన ఇజ్రాయిల్ వెంటనే తేరుకుంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడింది. దాడితో సంబంధం ఉన్న హమాస్ అగ్ర నాయకులందరినీ మట్టుబెట్టింది. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనాలోకి చొచ్చుకెళ్లి అడుగడుగు జల్లెడ పట్టి మరీ హమాస్ ఉగ్రమూకలను హతమార్చింది. ఈ క్రమంలో చాలా మంది సామాన్యులు సైతం ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా రెండేళ్ల క్రితం మొదలైన యుద్ధం నేటికీ కొనసాగుతోంది.
Gaza War | ఎటు చూసినా శవాలు.. కూలిన బంగ్లాలు..
హమాస్ ఉగ్రవాదులు మట్టుబెడతామని ప్రతిన బూనిన ఇజ్రాయిల్ గత రెండేళ్లు పాలస్తీనాలో భీకర దాడులు చేస్తోంది. ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు చేస్తూ.. ఉగ్రవాదులను ఏరివేస్తూ వచ్చింది. ఇప్పటికీ ఇజ్రాయిల్ దాడులు (Gaza war) కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాలస్తీనా శవాల దిబ్బగా మారింది. అంతేకాకుండా ఎటువైపుచూసినా కూలిపోయిన బంగ్లాలతో కళావిహీనంగా మారిపోయింది. కాగా.. గత ఆరునెలల క్రితం మాత్రమే కొన్ని రోజుల పాటు కాల్పులకు బ్రేక్ ఇచ్చింది. ఈ సమయంలో హమాస్ – ఇజ్రాయిల్ మధ్య జరిగిన ఒప్పదం ప్రకారం.. కొందరు బందీలను విడుదల చేశారు.
Gaza War | శాంతికి 20 పాయింట్ల ప్రణాళిక
మిడిల్ ఈస్ట్‌లో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యత్నిస్తున్నారు. హమాస్ – ఇజ్రాయిల్ మధ్య శాంతి ఒప్పందం కోసం 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. కాగా.. దీనిని ఇజ్రాయెల్-హమాస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. బందీలను విడుదల చేసేందుకు హమాస్ ఒప్పుకుంది. అంతేకాకుండా పాలస్తీనా ఖైదీలను సైతం విడుదల చేసేందుకు ఇజ్రాయిల్ కూడా అంగీకారం తెలిపింది. అయితే ట్రంప్ రంగంలోకి దిగడంతో శాంతి చర్చలు సఫలమై యుద్ధం ముగుస్తుందా అనేది చూడాలి.
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!