తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Gold price | బంగారం ధరలు (Gold prices) గత కొద్ది రోజులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. పట్టపగ్గాలు లేనట్లు పరుగులు పెడుతున్నాయి.
Gold price | బంగారం పెరుగుదలకు కారణాలేమిటి..!
చూస్తుండగానే ధరలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, పలు దేశాలు బంగారం కొనుగోలును పెంచడంతో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రేట్ల పెరుగుదలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.
భారత మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. గత జనవరిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.84వేలు ఉండగా.. నేడు రూ. లక్షా 20వేలకు చేరింది. అంటే దాదాపు గత ఎనిమిది నెలల్లో రూ. 36వేలు ధర పెరిగింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు అమెరికర: డాలర్ బలపడడం, అలాగే రూపాయి విలువ క్షీణించడం లాంటివి ధరల పెరుగుదలకు కారణాలుగా మారుతున్నాయి. పెట్టుబడి దారులు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్గా భావిస్తుండడంతో ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.
Gold price | మరింత పెరగనుందా..
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ కొనసాగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను ఈ ఏడాదిలో మరింత తగ్గిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు నిధులను లోహాలపైకి మళ్లిస్తున్నారు. దీంతో ధరలు పెరుగుదల కొనసాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రూ. లక్షా 25 వేలకు వరకు వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు సైతం పసిడితో పాటు పరుగులు పెడుతున్నాయి.
Gold price | రూ.1,20,000కు చేరిన ధర
బంగారం ధరలు మంగళవారం గరిష్టాన్ని తాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,780కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 1,10,710గా నమోదైంది. ఇక వెండి ధర కిలోకు రూ. 1,67,100 పలికింది.
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!