తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: EV vehicles | గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. అయినా కూడా పెట్రోల్ వాహనాలతో పోలిస్తే చాలా తక్కువగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. ఛార్జీలు స్టేషన్లు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో పాటు వీటి ధరలు అధికంగా ఉండడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. పెట్రోల్ కార్లతో పోలిస్తే రేట్లు ఎక్కువ కావడంతో ప్రజలు అంతగా ఆసక్తి చూపించడంలేదు. కాగా.. ఈ క్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలో ఈవీ కార్ల ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
EV vehicles | ఎందుకు తగ్గనున్నాయంటే..
ప్రస్తుతం పెట్రోల్ వెహికిల్స్ రేట్ల కంటే ఎలక్ట్రికల్ వెహికిల్స్ ధరలు అధికంగా ఉంటున్నాయి. అయితే ఈవీల ప్రొడక్షన్ పెరగడం.. వినియోగం సైతం పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 4–6 నెల్లలో పెట్రోల్, ఈవీ వాహనాల మధ్య అంతరం తగ్గిపోనుందని పేర్కొన్నారు. 20వ ఫిక్కీ హైయర్ ఎడ్యుకేషన్ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు.
EV vehicles | మూడో అతిపెద్ద దేశంగా భారత్
భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుందని గడ్కరీ తెలిపారు. అమెరికా రూ.78 లక్షల కోట్లు, చైనా రూ.47 లక్షల కోట్లు తర్వాతి స్థానంలో రూ.14 లక్షల కోట్లుతో మనం మూడో ప్లేస్‌లో ఉన్నాయని వివరించారు. అయితే రానున్న ఐదేళ్లలో భారత వాహన పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేర్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
EV vehicles | శిలాజ ఇంధనాలతో పర్యావరణానికి ముప్పు
శిలాజ ఇంధనాలపై ఆధారపడడం మన దేశానికి ఆర్థిక భారమని గడ్కరీ వివరించారు. ప్రతియే పెట్రో ఉత్పతుల దిగుమతులపై రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా శిలాజ ఇంధనాల వల్ల పర్యావరణానికీ ముప్పు కలుగుతోందన్నారు. అందుకే దశ పురోగతి కోసం శుద్ధ ఇంధనాన్ని అందిపుచ్చుకోవడం కీలకమని చెప్పారు. ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తుండడం వల్ల కొంత భారం తగ్గిందన్నారు. జొన్న నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనంగా రూ.45,000 కోట్లు సంపాదించారని వివరించారు. 2027 నాటికి రహదారుల నిర్మాణంలో ఘన వ్యర్థాలను వినియోగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. తద్వారా వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తున్నామని ఆయన చెప్పారు.
Have any thoughts?
Share your reaction or leave a quick response — we’d love to hear what you think!