Constant Fatigue Reasons: రోజంతా నీరసంగా ఉంటుందా.. ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు..

by Harsha Vardhan
0 comments
Constant Fatigue Reasons

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు శరీరం నీరసంగా అనిపిస్తుందా.. నిస్తేజంగా ఉండడంతో పాటు ఏ పనీ చేయాలనిపించడం లేదా..

Constant Fatigue Reasons-1

Constant Fatigue Reasons

 

Constant Fatigue Reasons: ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు..

అంతేకాకుండా చిన్నచిన్న విషయాలు కూడా జ్ఞాపకం రావడం లేదా.. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చాలామంది నిద్ర తగ్గిందనో, పని ఒత్తిడి ఎక్కువైందనో అనుకుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఈ సమస్యలకు అసలైన కారణం శరీరంలో విటమిన్ బి12 స్థాయిలు తగ్గిపోవడమే అయి ఉండవచ్చని వారు తెలియజేస్తున్నారు. ఈ విటమిన్ లోపం వల్ల ఏర్పడే లక్షణాల గురించి తెలుసుకుందాం..

విటమిన్ బి12 కీలకం

విటమిన్ బి12ను శరీరంలో శక్తి ఉత్పత్తికి కీలకమైన పోషకంగా నిపుణులు పరిగణిస్తారు. ఇది రక్తహీనతను నివారిస్తుంది. అలాగే నాడీ కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా, డీఎన్ఏ సంశ్లేషణ, శక్తి ఉత్పాదన మరియు కేంద్ర నాడీ వ్యవస్థ సక్రమ పనితీరుకు ఇది అత్యవసరంగా నిపుణులు చెబుతుంటారు. ఆహారం ద్వారా ఈ విటమిన్ సరిపడా అందకపోతే శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారం.. ఉత్తర భారతదేశంలో దాదాపు 47 శాతం మంది ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.

వీటిలో పుష్కలం

విటమిన్ బి12 జంతు ఆహార పదార్థాల్లో లభిస్తుంది. మాంసం, చేపలు, గుడ్లు, పాలు మరియు పాల ఉత్పత్తులలో ఇది పుష్కలంగా ఉంటుంది. మొక్కల ఆధారిత ఆహారంలో ఈ విటమిన్​ సహజంగా తక్కువగా ఉంటుంది. దీంతో శాఖాహారులు ఎక్కువగా ఈ విటమిన్​ లోపం ఏర్పడుతుంది. అయితే, తృణధాన్యాలు, న్యూట్రిషనల్ ఈస్ట్ విటమిన్ బి12తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శాఖాహారులకు మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.

విటమిన్ బి12 ఉపయోగాలు..

ఎర్ర రక్త కణాల ఆరోగ్యం: ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు బి12 కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల రక్తహీనత ఏర్పడే ప్రమాదం ఉంది.

నాడీ వ్యవస్థ పరిరక్షణ: నాడుల చుట్టూ ఉండే మైలిన్ షీత్‌ను కాపాడి, మెదడు మరియు నాడీ వ్యవస్థ సాఫీగా పనిచేయడానికి సహాయపడుతుంది.

మెదడు ఆరోగ్యం: జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు మానసిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలంలో మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యం: రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలను నియంత్రించి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.

ఇతర ప్రయోజనాలు: మానసిక ఆరోగ్యం, ఎముకల బలం, చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా బి12 ముఖ్య పాత్ర వహిస్తుంది.

విటమిన్ బి12 లోపం లక్షణాలు

ప్రముఖ ఆరోగ్య సంస్థల అధ్యయనాల ప్రకారం.. ఈ విటమిన్ లోపం వల్ల కింది లక్షణాలు కనిపిస్తాయి. నిరంతర అలసట మరియు నీరసం, చర్మం పాలిపోవడం లేదా పసుపు రంగు ఏర్పడడం, తరచుగా తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే మానసిక కుంగుబాటు లక్షణాలు, జీర్ణసంబంధిత ఇబ్బందులు, ఏకాగ్రత లోపించడం, నోటి పుండ్లు, నాలుక వాపు, ఆకస్మిక బరువు తగ్గడం లాంటివి కనబడతాయి.

Constant Fatigue Reasons-2

Constant Fatigue Reasons-2

పైలక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రక్త పరీక్షల ద్వారా విటమిన్ బి12 స్థాయిలను తెలుసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ సమస్యను నివారించవచ్చు.

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్​లో దొరికిన సమాచారం ఆధారంగా ప్రచురించారం. మీరు వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి. ప్రతి రోగి శారీరక స్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిగత వైద్యుడి సూచనలకు ప్రాధాన్యత ఇవ్వండి.

Healthy Diet – health tips: 30 ఏళ్లు దాటిన వాళ్ళు తప్పక తినవాలసిన Foods!

Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

Have any thoughts?

Share your reaction or leave a quick response — we’d love to hear what you think!

You may also like

Leave a Comment

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00